Sunday, June 01, 2014

చక్రవాకం--1974

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,S.V.రంగారావు,చంద్రకళ,నాగభూషణం,అంజలీదేవి,పద్మనాభం

పల్లవి::

ప్రియతమా..ఆ..నా..ఆ..ప్రియతమా..ఆఆఆ  
ఎక్కడున్న ఎలాగున్నా..వినుము నా నివేదన
ఎక్కడున్న ఎలాగున్నా..వినుము నా నివేదన
దిక్కు దిక్కుల మారుమ్రోగే..దీన హృదయావేదన
దిక్కు దిక్కుల మారుమ్రోగే..దీన హృదయావేదన            
ప్రియతమా..ఆ..నా..ఆ..ప్రియతమా..ఆఆఆ  
ఎక్కడున్న ఎలాగున్నా..వినుము నా నివేదన

చరణం::1

నిన్ను నేను వంచించగలనా..ఈ జన్మ ఎవరికో అర్పించగలనా
నిన్ను నేను వంచించగలనా..ఈ జన్మ ఎవరికో అర్పించగలనా 
నింద నెటుల నమ్మావు నీవు..నింద నెటుల నమ్మావు నీవు
నన్నిదా తెలుసుకున్నావు..నన్నిదా తెలుసుకున్నావు  
ప్రియతమా..ఆ..నా..ఆ..ప్రియతమా..ఆఆఆ  
ఎక్కడున్న ఎలాగున్నా..వినుము నా నివేదన

చరణం::2

నిన్ను కాదని జీవించగలనా..ఈ నిజానికి రుజువు కావలెనా
నిన్ను కాదని జీవించగలనా..ఈ నిజానికి రుజువు కావలెనా
గుండె గుడిగా చేసుకున్నాను..గుండె గుడిగా చేసుకున్నాను
నీ కొలువుకోసమే కాచుకున్నాను..నీ కొలువుకోసమే కాచుకున్నాను
ఎక్కడున్న ఎలాగున్నా..వినుము నా నివేదన
దిక్కు దిక్కుల మారుమ్రోగే..దీన హృదయావేదన
ప్రియతమా..ఆ..నా..ఆ..ప్రియతమా..ఆఆఆ