Thursday, June 23, 2011

అమ్మమాట--1972




సంగీతం::రమేష్‌నాయుడు
రచన::దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం::P.సుశీల


ఎంతబాగ అన్నావు..
ఎంతబాగ అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా..వేదంలా విలువైన మాట
ఎంతబాగ అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా..వేదంలా విలువైన మాట
ఎంతబాగ అన్నావు..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఅ
జారని వానల జల్లులూ..ఊరికే ఉరిమే మబ్బులు
జారని వానల జల్లులూ..ఊరికే ఉరిమే మబ్బులు
ఆ మబ్బులెందుకూ..?
ఊరని తేనేల సోనలూ..ఊరికే పూచే పూవులు..
ఊరని తేనేల సోనలూ..ఊరికే పూచే పూవులు..
ఆ పూవులెందుకు..?
ఉతుత్తి మాటలు అనవచ్చా..మాటలు చేతలు కావాలి
ఆ చేతలు పదుగురు మెచ్చాలి..
నూరేళ్ళు బతకాలీ..నూరేళ్ళూబతకాలీ..

ఎంతబాగ అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా..వేదంలా విలువైన మాట
ఎంతబాగ అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా

ఆఆఆ ఆఆఅ మ్మ్ మ్మ్ మ్మ్ ఆఆఆ
అన్నమాట అంటావనీ..అపుడే ఘనుడైనావనీ
ముందే మురిసే మీ నాన్నా..ఆ ముసి ముసి నవ్వులు చూడరా
కన్నా..ఆ..కన్నీరు కాదురా..కన్నవారి దీవెనరా
ఏటికేడుగా..ఏడంతస్తుల మేడగా..ఏటికేడుగా..ఏడంతస్తుల మేడగా
నూరేళ్ళు బతకాలీ..నూరేళ్ళూబతకాలీ..
శ్రీరామ రక్షా..శ్రీరామరక్షా..

ఎంతబాగ అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా..వేదంలా విలువైన మాట
ఎంతబాగ అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా

అమ్మమాట--1972

చిమ్మటలోని ఈ పాట వింటూ లిరిక్స్ చూసుకోండి



సంగీతం::రమేష్‌నాయుడు
రచన::దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం::P.సుశీల


:::


ఉష్ ..సద్దుమణగ నీయవూ..చందురూడ
ముద్దుతీరు తుందిలే..అందగాడ
కుదిరింది ఇద్దరికీ భలే జత
ముందుంది చూడవోయ్ అసలుకథ
సద్దుమణగ నీయవూ..చందురూడ
ముద్దుతీరు తుందిలే..అందగాడ
కుదిరింది ఇద్దరికీ భలే జత
ముందుంది చూడవోయ్ అసలుకథ
సద్దుమణగ నీయవూ..చందురూడ

:::1


మల్లెపూలు మరికాస్త విచ్చుకోనీ
మామగారు మరికాస్త..పుచ్చుకోనీ
మల్లెపూలు మరికాస్త విచ్చుకోనీ
మామగారు మరికాస్త..పుచ్చుకోనీ
అందాక ఆగితే..మరోఘడియ దాటితే
అనుకొన్నది చేద్దాము..అంతుచూసుకోందాము


సద్దుమణగ నీయవూ..చందురూడ
ముద్దుతీరు తుందిలే..అందగాడ
కుదిరింది ఇద్దరికీ భలే జత
ముందుంది చూడవోయ్ అసలుకథ
సద్దుమణగ నీయవూ..చందురూడ

:::2


పుట్టినిల్లు విడిచి..నీ పుట్టచేరుకొంటి
పుట్టినిల్లు విడిచి..నీ పుట్టచేరుకొంటి
పుట్టడాసతో..నిన్నే చేపట్టాలనుకొంటి
పుట్టడాసతో..నిన్నే చేపట్టాలనుకొంటి
పట్టుచిల్లువరకూ..ఫలం దక్కువరకూ
పట్టుచిల్లువరకూ..ఫలం దక్కువరకూ
....వదలననీ..ఒట్టేసుకోంటి

ఉష్ ..సద్దుమణగ నీయవూ..చందురూడ
ముద్దుతీరు తుందిలే..అందగాడ
కుదిరింది ఇద్దరికీ భలే జత
ముందుంది చూడవోయ్ అసలుకథ
సద్దుమణగ నీయవూ..చందురూడ


Amma maaTa--1972
Music::Ramesh Naidu
Lyricist::C.Narayana Reddy
Singer's::Suseela

:::

saddumanaganeeyavoy chandurudaa
muddu teerutundile andagaadaa
kudirindi iddariki bhale jata
mundundi chudavoy asalu kadha

:::1

malle pulu mari kaasta vichukonee
maama gaaru mari kaasta puchukonee
malle pulu mari kaasta vichukonee
maama gaaru mari kaasta puchukonee
malle pulu vichukonee mama garu puchukonee
andaaka aagite maro ghadiya daatite
anukunnadi cheddamu antu chusukundaamu

:::2

puttinillu vidichi ee putta cherukunti
puttinillu vidichi ee putta cherukunti
puttedaashato ninne chepattaalanukunti
puttedaashato ninne chepattaalanukunti
pattu chikku varaku phalam dakku varaku
pattu chikku varaku phalam dakku varaku

oo pattaana vadalanani ottesukunti 

అమ్మమాట--1972

చిమ్మటలోని ఈ పాట వింటూ లిరిక్స్ చూసుకోండి


సంగీతం::రమేష్‌నాయుడు
రచన::దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం::SP.బాలుP.సుశీల


ఎవరైన చుసారా ఏమనుకొంటారు..
ఎవరైన చూసారా ఏమనుకొంటారు..
కొత్త మురిపెం..పొద్దెరగదని
చెప్పుకొంటారు..ఆపై తప్పుకొంటారూ..ఉ..మ్మ్..
ఎవరైన చుసారా ఏమనుకొంటారు..

ఇటు పూవు చూస్తుందీ..మ్మ్ హు..
అటు గువ చూస్తుందీ..మ్మ్..మ్మ్ హు..
ఇటు పూవు చూస్తుందీ..ఈ..
అటు గువ చూస్తుందీ..గుబురు గుబురుగ
గుండె గుబులుగా..గురివింద పొదచూస్తుందీ..ఈ..
గురివింద పొదచూస్తుందీ..
పూవులాగ నవ్వుకొనీ..గువ్వలాగ రివ్వుమనీ
పూవులాగ నవ్వుకొనీ..గువ్వలాగ రివ్వుమనీ
దిగులన్నీ ఆపొదరిల్లో..పరవసించి పొమ్మంది
అమ్మమ్మా..ఎవరైన చూసారా..ఏమనుకొంటారూ..

అటు పొద్దువాలుతుందీ..మ్మ్ హూ..
మన ముద్దు తీరకుందీ..మ్మ్..హూ..
అటు పొద్దువాలుతుందీ..ఈ..మన ముద్దు తీరకుందీ
ఓయని పిలిచె కోరికలెరిగి..నన్నందుకొనిపోరాదా..ఆ
నన్నందుకొనిపోరాదా.....
నీ నడుమున చేయ్ వేసీ..నిలువెల్లా పెనవేసీ..
నీ నడుమున చేయ్ వేసీ..నిలువెల్లా పెనవేసీ..
నీలాల మబ్బుల్లోకీ..నిన్నెత్తుకొనిపోతానే..ఉయ్..య్య..అమ్మమ్మమ్మో..

ఎవరైన చూసారా ఏమనుకొంటారు..
కొత్త మురిపెం..పొద్దెరగదని
చెప్పుకొంటారు..ఆపై తప్పుకొంటారూ..
ఎవరైన చుసారా ఏమనుకొంటారు..
మ్మ్..మ్మ్..హూ..మ్మ్..హూ..

అమ్మమాట--1972

చిమ్మటలోని ఈ పాట వింటూ లిరిక్స్ చూసుకోండి



సంగీతం::రమేష్‌నాయుడు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల


సర్..సర్..సార్..
ఎప్పుడూ మీ పాఠలంటె..ఎలాగండి సార్
ఈరోజు నే చెపుతాను..హియర్ మీ డియర్ సార్
ఎప్పుడూ మీ పాఠలంటె..ఎలాగండి సార్
ఈరోజు నే చెపుతాను..హియర్ మీ డియర్ సార్

ఒకటీ ఒకటీ కలిపితే రెండు..అది గణితం
మనసూ మనసూ కూడితే..ఒకటే ఇది జీవితం
గిరిగీసుకొని ఉండాలంటాయి గ్రంధాలు
పురివిప్పుకొని ఎగరాలంటాయి అందాలు
ఎప్పుడూ మీ పాఠలంటె..ఎలాగండి సార్
ఈరోజు నే చెపుతాను..హియర్ మీ డియర్ సార్

కళ్ళల్లో చూడండీ..కనిపించును నీలాలు
పెదవుల్లో చూడండీ..అగుపించును పగడాలు
దోసిలినిండా దొరుకుతాయి..దోరనవ్వుల ముత్యాలు
కన్నెమేనిలో..ఉన్నాయి..కన్నెమేనిలో..ఉన్నాయి
ఏ గనిలో దొరకని రతనాలూ..మ్మ్..
ఎప్పుడూ మీ పాఠలంటె..ఎలాగండి సార్
ఈరోజు నే చెపుతాను..హియర్ మీ డియర్ సార్

రాధా మాధవ రాగజీవనం..ఒక బంధం
కలువాజాబిలి వింతకలయికే..అనుబంధం
యుగయుగాలకూమిగిలేదొకటే..అనురాగం
యుగయుగాలకూమిగిలేదొకటే..అనురాగం
చెలిమనసెరిగిన చిన వానిదేలే..ఆనందం
ఎప్పుడూ మీ పాఠలంటె..ఎలాగండి సార్
ఈరోజు నే చెపుతాను..హియర్ మీ డియర్ సార్
ఎప్పుడూ మీ పాఠలంటె..ఎలాగండి సార్
ఈరోజు నే చెపుతాను..హియర్ మీ డియర్ సార్