సంగీతం::S రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల, S.జానకి
తారాగణం::చలం,రోజారమణి, జగ్గయ్య,ప్రభాకర రెడ్డి,పండరీబాయి,రాజబాబు,
రావు గోపాల రావు,జయలక్ష్మి
పల్లవి::
నీ ఆశా అడియాసా చెయ్ జారే మణిపూసా
నీ ఆశా అడియాసా చెయ్ జారే మణిపూసా
బ్రతుకంతా అమవాసా లంబాడోళ్ళ రాందాసా
నీ ఆశా అడియాసా చెయ్ జారే మణిపూసా
ఓ ఓ..ఓ..
చరణం::1
తలచినదీ ఒకటైతే జరిగినదీ వేరొకటీ
తలచినదీ ఒకటైతే జరిగినదీ వేరొకటీ
చితికినదీ నీ మనసూ అతుకుటకూ లేరెవరూ
నీ ఆశా అడియాసా చెయ్ జారే మణిపూసా
బ్రతుకంతా అమవాసా లంబాడోళ్ళ రాందాసా
చరణం::2
గుండెలలో గునపాలూ గుచ్చారే నీ వాళ్ళూ
గుండెలలో గునపాలూ గుచ్చారే నీ వాళ్ళూ
కన్నులలో గోదారీ కాలువలే కట్టిందీ
నీ ఆశా అడియాసా చెయ్ జారే మణిపూసా
బ్రతుకంతా అమవాసా లంబాడోళ్ళ రాందాసా
బ్రతుకంతా అమవాసా లంబాడోళ్ళ రాందాసా
సంగీతం::K.చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,జయసుధ,రోజారమణి,కైకాల సత్యనారాయణ,జయమాలిని,మోహన్‌బాబు.
ఆభేరి::రాగం
పల్లవి::
ఏమని వర్ణించనూ..ఏమని వర్ణించనూ
నీకంటి వెలుగును..వెన్నంటి మనసును
వెన్నెల నవ్వునూ..నీ ఇలవేల్పును
ఏమని వర్ణించనూ..ఉ..
ఆ..ఆహహ..ఆ
పైరగాలిలాగా చల్లగా ఉంటాడు
తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు
తీర్చిన బొమ్మలా తీరైనవాడూ
తీర్చిన బొమ్మలా తీరైనవాడూ
తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు
ఏమని వర్ణించనూ..ఊ..
చరణం::1
రాముడు కాడమ్మా..నిందలు నమ్మడూ
కృష్ణుడు కాడమ్మా..సవతులు ఉండరూ
నువ్వు పూజించు దేవుళ్ల..లోపాలు లేనివాడు
నీ పూజ ఫలియించి..నీ దేవుడైనాడు
నీ పూజ ఫలియించి..నీ దేవుడైనాడు
ఏమని వర్ణించనూ..ఊ..
చరణం::2
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కళ్లు లేవనీ నీకు కలతింక వలదమ్మా
తన కళ్లతో జగతి చూపించగలడమ్మా
కళ్లు లేవనీ నీకు కలతింక వలదమ్మా
తన కళ్లతో జగతి చూపించగలడమ్మా
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
నా అన్న రూపాన్ని చూపితే చాలును
ఏమని ఊహించనూ నా అన్న రూపునూ
నాకున్న వెలుగును వెన్నంటి మనసునూ
నా ఇలవేల్పును..ఏమని ఊహించనూ..ఊ..