Thursday, October 28, 2010

ఉండమ్మా బొట్టుపెడతా--1968



సంగీతం::K.V.మహాదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రీ  
గానం::ఘంటసాల,P.సుశీల   

పల్లవి::

శ్రీశైలం మల్లన్న శిరసూచేనా
చేనంత గంగమ్మ వానా..
శ్రీశైలం మల్లన్న శిరసూచేనా
చేనంత గంగమ్మ వానా..
తిరుమలపై వెంకన్న కనువిప్పేనా
కరుణించు ఏండా వెన్నెలలైనా
తిరుమలపై వెంకన్న కనువిప్పేనా
కరుణించు ఏండా వెన్నెలలైనా
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసూచేనా
చేనంత గంగమ్మ వానా..

చరణం::1

కదిలొచ్చీ కలిసొచ్చీ తలుపులు తీసేరో
కలవారి కోడళ్ళు..
నడుమొంచి చెమటోర్చి..నాగళ్ళు పట్టేరు 
నా జూకు దొరగారు..నాజూకు దొరగారు 
అంటకుండ నలిగేనా ధాన్యాలు..వంచకుండ వంగేనా ఆవళ్ళూ

ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసూచేనా
చేనంత గంగమ్మ వానా..

చరణం::3

ఏటికైన ఏతాము ఎత్తేవాళ్ళం మేమూ అన్నదమ్ములం
ఏడేడు గరిసెల్లు నూర్చే వాళ్ళం మేము అక్కాచెల్లెళ్ళం 
ఏటికైన ఏతాము ఎత్తేవాళ్ళం మేమూ అన్నదమ్ములం
మేమూ అన్నదమ్ములం....
ఏడేడు గరిసెల్లు నూర్చే వాళ్ళం మేము అక్కాచెల్లెళ్ళం 
మేము అక్కాచెల్లెళ్ళం....
గాజుల చేత్తుల్లో రాజనాలపంట 
గాజుల చేత్తుల్లో రాజనాలపంట 
కండరాలు కరిగిస్తే కరువే రాదంటా.. 

ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసూచేనా
చేనంత గంగమ్మ వానా..
తిరుమలపై వెంకన్న కనువిప్పేనా
కరుణించు ఏండా వెన్నెలలైనా
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసూచేనా
చేనంత గంగమ్మ వానా. 

ఉండమ్మా బొట్టుపెడతా--1968



సంగీతం::K.V.మహాదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రీ 
గానం::ఘంటసాల,P.సుశీల   

పల్లవి::

గంగమ్మ రా గంగమ్మ రా గంగమ్మ రా
పాతాళ గంగమ్మ రా రా రా 
ఉరుకురికీ ఉరుకురికీ రారారా
పగబట్టే పామల్లే పైకీ పాకీ
పరిగెత్తే జింకల్లే ధూకీ ధూకీ

పాతాళ గంగమ్మ రా రా రా 
ఉరుకురికీ ఉబికుబికి రారారా
పగబట్టే పామల్లే పైకీ పాకీ
పరిగెత్తే జింకల్లే ధూకీ ధూకీ 
పాతాళ గంగమ్మ రా రా రా 

చరణం::1

వగరుస్తూ గుండే దాక తగిలింది నేలా  
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేలా
వగరుస్తూ గుండే దాక తగిలింది నేలా  
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేలా

కోరిన ఈ చేనికీ సొమ్మసిల్లిన భూమికీ
గోదారి గంగమ్మా సేద తీర్చావమ్మా

పాతాళ గంగమ్మ రా రా రా 
ఉరుకురికీ ఉరుకురికీ రారారా
పాతాళ గంగమ్మ రా రా రా

చరణం::2

శివమూర్తీ జఠనుండి చెదరీ వచావు
శ్రీదేవి దయలాగ సిరులే తెచ్చావు
శివమూర్తీ జఠనుండి చెదరీ వచావు
శ్రీదేవి దయలాగ సిరులే తెచ్చావు
అడుగడుగున బంగారం..ఆకుపచ్చని శింగారం
అడుగడుగున బంగారం..ఆకుపచ్చని శింగారం
తొడగవమ్మ ఈ నేలకు సస్యశ్యామల వేశం 
పాతాళ గంగమ్మ రారారా..
ఓ......