Friday, January 29, 2016

దారి తప్పిన మనిషి--1981




సంగీతం::విజయభస్కర్ 
రచన::వీటూరిసుందర్‌రామ్మూర్తి 
గానం::.P.సుశీల,K.J.ఏసుదాస్ 
Film Directed By::B.S.Rao
తారాగణం::నరసింహ రాజు, రోజా రమణి,రూప,లక్ష్మిశ్రీ,పండ,పండరీభాయ్,సత్యవాణి,కాకరాల,

పల్లవి:: 

ఊ అన్నా..ఆ అన్నా..ఉలికి ఉలికి పడతావెందుకు
ఊ అన్నా..ఆ అన్నా..ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

చరణం::1

ఉన్న తలపు వలపైనప్పుడు..కన్నె మనసు ఏమంటుంది
చిలిపి చిలిపి కులుకుల కన్నుల నిలిపి తోడు రమ్మంటుంది
కోరికలన్నీ కోయిలలైతే..కొత్త ఋతువు ఏమంటుంది
వయసంతా వసంతమై వలపు వీణ ఝుమ్మంటుంది
పిలుపో..తొలి వలపో..మరుపో..మైమరుపో

ఊ అన్నా..ఆ అన్నా..ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

చరణం::2

ఉన్న కనులు రెండే అయినా..కన్నకలలకు అంతే లేదు
కన్న కలలు ఎన్నైనా..ఉన్న నిజము మారిపోదు
కోరిన వారు కొంగు ముడేస్తే..కలలు పండి నిజమౌతాయి
కల అయినా..నిజమైనా..కలదు కదా కథ తరువాయి
కలయో..ఇది నిజమో..కథయో..వైష్ణవమాయో

ఊ అన్నా..ఆ అన్నా..ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

చరణం::3

నిదురించిన తూరుపులో..నీవేలే పొద్దుపొడుపు
నిను కోరిన నా తలపులలో నీకేలే ముద్దుల ముడుపు
అన్నా..నేవిన్నా..ఔనన్నా..కాదన్నా
అవునంటే నీతో ఉన్నా.. కాదన్నా నీలో ఉన్నా

ఊ అన్నా..ఆ అన్నా..ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దోచి రాగాలెందుకు
ఆహాహాహహా...ఆహాహాహహా

Daari Tappina Manishi--1981
Music::Vijayabhaskar 
Lyrics::Veeturisundarrammoorti
Singer's::P.Suseela,K.J.Esudaas 
Film Directed By::B.S.Rao
Cast::Narasimha Raju,Rojaramani,Roopa,Pandarii bai Panda,Satyavani,LakshmiSrii,
Kakaraala.

::::::::::::::: 

oo annaa..aa annaa..uliki uliki paDataavenduku
oo annaa..aa annaa..uliki uliki paDataavenduku
annannaa enta maaTa manasu daachi raagaalenduku

::::1

unna talapu valapainappuDu..kanne manasu EmanTundi
chilipi chilipi kulukula kannula nilipi tODu rammanTundi
kOrikalannii kOyilalaitE..kotta Rtuvu EmanTundi
vayasantaa vasantamai valapu veeNa jhummanTundi
pilupO..toli valapO..marupO..maimarupO

oo annaa..aa annaa..uliki uliki paDataavenduku
annannaa enta maaTa manasu daachi raagaalenduku

::::2

unna kanulu renDE ayinaa..kannakalalaku antE lEdu
kanna kalalu ennainaa..unna nijamu maaripOdu
kOrina vaaru kongu muDEstE..kalalu paNDi nijamautaayi
kala ayinaa..nijamainaa..kaladu kadaa katha taruvaayi
kalayO..idi nijamO..kathayO..vaishNavamaayO

oo annaa..aa annaa..uliki uliki paDataavenduku
annannaa enta maaTa manasu daachi raagaalenduku

::::3

nidurinchina toorupulO..neevElE poddupoDupu
ninu kOrina naa talapulalO neekElE muddula muDupu
annaa..nEvinnaa..aunannaa..kaadannaa
avunanTE neetO unnaa.. kaadannaa neelO unnaa

oo annaa..aa annaa..uliki uliki paDataavenduku
annannaa enta maaTa manasu daachi raagaalenduku
aahaahaahahaa...aahaahaahahaa

Thursday, January 21, 2016

సంకల్పం--1995




సంగీతం::కోటి
రచన::భువనచంద్ర
గానం::S.P.బాలసుబ్రహ్మణ్యం,K.S.చిత్ర
Film Directed By::A.M.Ratnam
తారాగణం::జగపతి బాబు,జయసుధ,గౌతమి,సుదాకర్,చంద్రమోహన్,

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా
గోదారికీ వరదొచ్చిందిలే కౌగిళ్ళకీ కబురందిందిలే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

ఉల్లిపూల నావగట్టి మల్లెపూల గొడుగుబట్టి ఉరేగాలంట వెన్నెల్లో..ఓఓఓ
నారుమల్ల చీరగట్టి నల్ల మబ్బు కాటుకెట్టి ఊగేయాలంట ఊహల్లో..ఓఓఓ
సూదంటు చూపులున్నవాడు నా వన్నెకాడు
లేలేత బుగ్గలిచ్చి అల్లరి ముద్దులు ఉబ్బిన క్షణమున

అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా

చరణం::1

ఆ..ఆ..ఆ..ఆఆఆఆ.. 
కూసింది కన్నెపిట్ట కసెక్కే కౌగిలి వలపున వాటంగా వలపివ్వని
ఊగింది మల్లెమొగ్గ సురుక్కు చూపులు తడిమిన వాకిట్లో విడిదిమ్మనీ
పెదవులలో చెలీ సఖీ స్వరాలు శ్రుతించనా
మధువులలో ప్రియా ప్రియా పదాలు లిఖించనా
రవికకు రాగాలు నేర్పించనా
మదనుడి మాన్యాలు రాసివ్వనా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా

చరణం::2

తుళ్ళింది లేత ముళ్ళు తపించే తుంటరి తుమ్మెద వెచ్చన్ని ఒడి చేరగా
కొట్టింది తేనె జల్లు వలేసే ఒంపున నడుమున వయ్యారి నిలదీయగా
అలసటలే తెలియని సుఖాల మదింపులో
బిడియములే ఎరుగని నరాల బిగింపులో
నడుముకి నాట్యాలు నేర్పించనా
పరువపు శంఖాలు పూరించనా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా
గోదారికీ వరదొచ్చిందిలే కౌగిళ్ళకీ కబురందిందిలే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

Sankalpam--1995
Music::Koti
Lyrics::Bhuvanachandra
Singer's::S.P.Balu,K.S.Chitra
Film Directed By::A.M.Ratnam
Cast::Jagapatibabu,Goutami,Jayasudha,Sudhakar,Chandramohan.

:::::::::::

aa..aa..aa..aa..aa..aa..aa..aa
achchaTlO muchchaTlammaa muchchaTlO achchaTlamma
sandiTlO chappaTlammaa mungiTlO muchchaTlammaa
gOdaarikee varadochchindilE kaugiLLakee kaburandindilE
aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa

ullipoola naavagaTTi mallepoola goDugubaTTi urEgaalanTa vennellO..OOO
naarumalla cheeragaTTi nalla mabbu kaaTukeTTi oogEyaalanTa oohallO..OOO
soodanTu choopulunnavaaDu naa vannekaaDu
lElEta buggalichchi allari muddulu ubbina kshaNamuna

achchaTlO muchchaTlammaa muchchaTlO achchaTlamma
sandiTlO chappaTlammaa mungiTlO muchchaTlammaa

::::1

aa..aa..aa..aaaaaaaaaaa.. 
koosindi kannepiTTa kasekkE kaugili valapuna vaaTangaa valapivvani
oogindi mallemogga surukku choopulu taDimina vaakiTlO viDidimmanee
pedavulalO chelee sakhee svaraalu Srutinchanaa
madhuvulalO priyaa priyaa padaalu likhinchanaa
ravikaku raagaalu nErpinchanaa
madanuDi maanyaalu raasivvanaa
aa..aa..aa..aa..aa..aa..aa..aa
achchaTlO muchchaTlammaa muchchaTlO achchaTlamma
sandiTlO chappaTlammaa mungiTlO muchchaTlammaa

::::2

tuLLindi lEta muLLu tapinchE tunTari tummeda vechchanni oDi chEragaa
koTTindi tEne jallu valEsE ompuna naDumuna vayyaari niladeeyagaa
alasaTalE teliyani sukhaala madimpulO
biDiyamulE erugani naraala bigimpulO
naDumuki naaTyaalu nErpinchanaa
paruvapu Sankhaalu poorinchanaa
aa..aa..aa..aa..aa..aa..aa..aa
achchaTlO muchchaTlammaa muchchaTlO achchaTlamma
sandiTlO chappaTlammaa mungiTlO muchchaTlammaa
gOdaarikee varadochchindilE kaugiLLakee kaburandindilE
aa..aa..aa..aa..aa..aa..aa..aa

Tuesday, January 19, 2016

శివ--1989



సంగీతం::ఇళయరాజ 
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు,K.S.చిత్ర
Film Directed By::Ram Gopal Varma
Film Produced By::Akkineni Venkat
తారాగణం::అక్కినేనినాగార్జున,అమల,రఘువర్మ,మురళిమోహన్,కోటశ్రీనివాస్ రావ్,గొల్లపూడిమారుతిరావు,తణికిళ్ళభరణి,శుభలేకసుధాకర్,నిర్మలమ్మ.

పల్లవి::

ఎన్నియల్లో..మల్లియల్లో..ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో..తుళ్ళింతల్లో..ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు
శృంగార వీణ రాగాలే..హోయ్
ఎన్నియల్లో మల్లియల్లో..ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్ళింతల్లో..ఎన్నెన్ని కావ్యాలో

చరణం::1

సిగ్గేయగా..బుగ్గ మొగ్గ..మందార ధూళే దులిపే
జారేసినా..పైటంచునా..అబ్బాయి కళ్ళే నిలిపే
సందిళ్ళకే చలి వేస్తుంటే..అందించవా సొగసంతా
ఒత్తిళ్ళతో ఒలి చేస్తోంటే..వడ్డించనా వయసంతా
వెలుగులో కలబడే కళలు కన్నా
తనువులో తపనలే కదిపిన కధకళి లోనా
ఎన్నియల్లో..మల్లియల్లో..ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో..తుళ్ళింతల్లో..ఎన్నెన్ని కావ్యాలో

చరణం::2

ఈ చీకటే..ఓ చీరగా..నా చాటు అందాలడిగే
ఈ దివ్వెలా..క్రీనీడలే..నీ సోకులన్నీ కడిగే
నీ మబ్బులే గుడి కడుతుంటే..జాబిల్లిలా పడుకోనా
తబ్బిబుతో తడబడుతుంటే..నీ గుండెలో నిదరోనా 
ఉదయమే అరుణమై..ఉరుముతున్నా 
చెదరని నిదరలో..కుదిరిన పడకలలోనా
ఎన్నియల్లో..మల్లియల్లో..ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో..తుళ్ళింతల్లో..ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు
శృంగార వీణ రాగాలే..హోయ్
ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
లలలల..లలలలలా

Siva--198 
Music::Ilayaraja
Lyrics::Vetoorisundararaamamoorti
Singer's::::S.P.BaluP.K.S.Chitra
Film Directed By::Ram Gopal Varma
Film Produced By::Akkineni Venkat
Cast::AkkineniNagarjuna,Amala,Raghuvarma,Muralimohan,Kotasreenivasrao,Gollapoodimaarutirao,Tanikillabharani,Subhalekasudhakar,Nirmalamma.

::::::::::

enniyallO..malliyallO..ennenni andaalO
kavvintallO..tuLLintallO..ennenni kaavyaalO
ompullO unna hampi Silpaalu
oLLanTukunTe chaalu naaTyaalu
SRngaara veeNa raagaalE..hOy
enniyallO malliyallO..ennenni andaalO
kavvintallO tuLLintallO..ennenni kaavyaalO

::::1

siggEyagaa..bugga mogga..mandaara dhooLE dulipE
jaarEsinaa..paiTanchunaa..abbaayi kaLLE nilipE
sandiLLakE chali vEstunTE..andinchavaa sogasantaa
ottiLLatO oli chEstOnTE..vaDDinchanaa vayasantaa
velugulO kalabaDE kaLalu kannaa
tanuvulO tapanalE kadipina kadhakaLi lOnaa
enniyallO..malliyallO..ennenni andaalO
kavvintallO..tuLLintallO..ennenni kaavyaalO

::::2

ee cheekaTE..O cheeragaa..naa chaaTu andaalaDigE
ee divvelaa..kreeneeDalE..nee sOkulannee kaDigE
nee mabbulE guDi kaDutunTE..jaabillilaa paDukOnaa
tabbibutO taDabaDutunTE..nee gunDelO nidarOnaa 
udayamE aruNamai..urumutunnaa 
chedarani nidaralO..kudirina paDakalalOnaa

enniyallO..malliyallO..ennenni andaalO
kavvintallO..tuLLintallO..ennenni kaavyaalO
ompullO unna hampi Silpaalu
oLLanTukunTe chaalu naaTyaalu
SRngaara veeNa raagaalE..hOy
enniyallO malliyallO ennenni andaalO
lalalala..lalalalalaa

Monday, January 18, 2016

పండంటి జీవితం--1981




సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందర్‌రాంమూర్తి
గానం::S.జానకి
Film Directed By::Taatineni Raama Rao
తారాగణం::శోభన్‌బాబు,కే.సత్యనారాయణ,గిరిబాబు,సుజాత,విజయశాంతి,పి.ఎల్. నారాయణ 

పల్లవి::

పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి 
పలికారు వీడ్కోలు..కన్నీళ్ళకి 
పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి 
పలికారు వీడ్కోలు..కన్నీళ్ళకి 
తూరుపు పడమర లేక..సూర్యుడే లేడని..ఈ 
భార్యని భర్తని కలపని..జీవుడే ఉండడని..ఈ 
ఆ ఆ ఆ ఆ ఆ

పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి 
పలికారు వీడ్కోలు..కన్నీళ్ళకి 
పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి 

చరణం::1

ఇలకు జారని పిలుపు..ఊ..కడలి చేరని వాగు..ఊ 
ఇలకు జారనిపిలుపు..కడలి చేరని వాగు
భర్త ఒడిని గుడి కట్టని..భార్య బ్రతుకు లేదని..ఈ
తెలిసింది నా జీవన సంధ్యా సమయంలో 
అందుకనే అందుకనే వస్తున్నా ఉదయించిన హృదయంతో 
ఉదయించిన హృదయంతో..ఓఓఓఓఓ

పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి 
పలికారు వీడ్కోలు..కన్నీళ్ళకి 
పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి 

చరణం::2

పసుపు కుంకుమ చిందే..ఏఏఏ..పడతి జన్మ ధన్యం..మ్మ్ మ్మ్ మ్మ్ 
పసుపు కుంకుమ చిందే..పడతి జన్మ ధన్యం
పతి మమతే ఏనాటికి..పతికి నిత్య సౌభాగ్యం
తెలిసింది అరుంధతి..మెరిసిన ఈ సమయంలో..ఓఓ 
అందుకనే అందుకనే వస్తున్నా పండిన నా ప్రణయం తో
పండిన నా ప్రణయం తో....ఓఓఓ

పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి 
పలికారు వీడ్కోలు..కన్నీళ్ళకి 
తూరుపు పడమర లేక..సూర్యుడే లేడని..ఈ 
భార్యని భర్తని కలపని..జీవుడే ఉండడని..ఈ 

Pandanti Jeevitham--1981
Music : Chakravarthy
Lyrics : Veturi Sundararama Murthy
Singer's::S.Janaki
Film Directed By::Taatineni Raama Rao
Cast::Sobhanbabu,Sujatha,Vijayasaanti,Giribabu,K.Satyanarayana,P.L.Naraayana.

::::::::::::::::

pilichaaru maavaaru..innaaLLaki 
palikaaru veeDkOlu..kanneeLLaki 
pilichaaru maavaaru..innaaLLaki 
palikaaru veeDkOlu..kanneeLLaki 
toorupu paDamara lEka..sooryuDE lEDani..ii 
bhaaryani bhartani kalapani..jeevuDE unDaDani..ii 
aa aa aa aa aa

pilichaaru maavaaru..innaaLLaki 
palikaaru veeDkOlu..kanneeLLaki 
pilichaaru maavaaru..innaaLLaki 

::::1

ilaku jaarani pilupu..U..kaDali chErani vaagu..U 
ilaku jaaranipilupu..kaDali chErani vaagu
bharta oDini guDi kaTTani..bhaarya bratuku lEdani..ii
telisindi naa jeevana sandhyaa samayamlO 
andukanE andukanE vastunnaa udayinchina hRdayamtO 
udayinchina hRdayamtO..OOOOO

pilichaaru maavaaru..innaaLLaki 
palikaaru veeDkOlu..kanneeLLaki 
pilichaaru maavaaru..innaaLLaki 

::::2

pasupu kunkuma chindE..EEE..paDati janma dhanyam..mm mm mm 
pasupu kunkuma chindE..paDati janma dhanyam
pati mamatE EnaaTiki..patiki nitya saubhaagyam
telisindi arundhati..merisina ii samayamlO..OO 
andukanE andukanE vastunnaa panDina naa praNayam tO
panDina naa praNayam tO....OOO

pilichaaru maavaaru..innaaLLaki 
palikaaru veeDkOlu..kanneeLLaki 
toorupu paDamara lEka..sooryuDE lEDani..ii 
bhaaryani bhartani kalapani..jeevuDE unDaDani..ii

Thursday, January 14, 2016

నాకూ స్వతంత్రం వచ్చింది--1975




సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం 
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::V.రామకృష్ణ,కోరస్
Film Directed By::P.Lakshmi Deepak  
Film Producer By::M.Prabhakar Reddy 
తారాగణం::కృష్ణంరాజు,రవికాంత్,జయప్రద,గుమ్మడి వెంకటేశ్వరరావు,నాగభూషణం,పద్మనాభం,రాజబాబు,M.ప్రభాకర్ రెడ్డి,అల్లు రామలింగయ్య,రావు గోపాల్ రావు,త్యాగరాజు,సాక్షి రంగారావు,కాకరాల,మాడా,షావుకారు జానకి,ప్రభ,శుభ,K.విజయ.

పల్లవి:: 

ఓహో..
ఓ..గంగమ్మ తల్లీ..మా బంగారు తల్లీ
కెరటాలకు ఎదురీదరా..సుడిగాలి నెదరించరా
ఈ సంద్రాన్ని ఏలాలిరా..మన జాలర్ల కెదురేదిరా

చరణం::1

ఆటూ పోటులూ..ఆటపాటలై పోవాలి
ఎండ వాన..పండు యెన్నెల్లే కావాలి
పంజరమైనా..సొరసేపైనా..వలవిసిరేస్తే సిక్కాలి

కెరటాలకు ఎదురీదరా..సుడిగాలి నెదరించరా
ఈ సంద్రాన్ని ఏలాలిరా..మన జాలర్ల కెదురేదిరా

చరణం::2

వానమబ్బులు వాలే..సోటికి పోదాము 
కండబలంతో..గుండెబలంతో..సాగేము
పడవే యిల్లై..నలుగురు మొకటై
పగలు రేయి..గడిపేము

కెరటాలకు ఎదురీదరా..సుడిగాలి నెదరించరా
ఈ సంద్రాన్ని ఏలాలిరా..మన జాలర్ల కెదురేదిరా

చరణం::3

యెల్ల కాలము సల్లగ సూడు..గంగమ్మా
మా పసుపు కుంకుమ..కాపాడమ్మా..ఓయమ్మా
కడుపున దాచిన..సంపదనంతా
కరువు తీరగ..ఇవ్వమ్మా

కెరటాలకు ఎదురీదరా..సుడిగాలి నెదరించరా
ఈ సంద్రాన్ని ఏలాలిరా..మన జాలర్ల కెదురేదిరా

Nakoo Swathanthram Vachindi--1975
Music::Chellapilla Satyam
Lyrics::D.C.Naryana Reddi
Singer's::V.Raamakrishna,Coras
Film Directed By::P.Lakshmi Deepak  
Film Producer By::M.Prabhakar Reddy  
Caste::Krishnamraju,Ravikanth,Jayapradha,Gummadi Venkateshwara Rao,Nagabhushanam,Padmanabham,Rajababu,M Prabhakar Reddy,Allu Ramalingaiah,Rao Gopal Rao,Thyagaraju,Sakshi Rangarao,Kakarala,Jaggarao,Mada,Savukaru Janaki,Prabha,Subha,K Vijaya.

::::::::::::::::

OhO..
O..gangamma tallii..maa bangaaru tallii
keraTaalaku edureedaraa..suDigaali nedarincharaa
ii sandraanni Elaaliraa..mana jaalarla kedurEdiraa

::::1

ATuu pOTuluu..ATapaaTalai pOvaali
enDa vaana..panDu yennellE kaavaali
panjaramainaa..sorasEpainaa..valavisirEstE sikkaali

keraTaalaku edureedaraa..suDigaali nedarincharaa
ii sandraanni Elaaliraa..mana jaalarla kedurEdiraa

::::2

vaanamabbulu vaalE..sOTiki pOdaamu 
kanDabalamtO..gunDebalamtO..saagEmu
paDavE yillai..naluguru mokaTai
pagalu rEyi..gaDipEmu

keraTaalaku edureedaraa..suDigaali nedarincharaa
ii sandraanni Elaaliraa..mana jaalarla kedurEdiraa

::::3

yella kaalamu sallaga sooDu..gangammaa
maa pasupu kunkuma..kaapaaDammaa..Oyammaa
kaDupuna daachina..sampadanantaa
karuvu teeraga..ivvammaa

keraTaalaku edureedaraa..suDigaali nedarincharaa
ii sandraanni Elaaliraa..mana jaalarla kedurEdiraa

Wednesday, January 06, 2016

నవగ్రహ పూజామహిమ--1964



సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::G.కృష్ణమూర్తి
గానం::ఘంటసాల,బృందం
Film Directed By::B.VithalaaCharya
తారాగణం::కాంతారావు, వాసంతి, నాగయ్య,రాజనాల,గీతాంజలి, లక్ష్మి, వాణిశ్రీ

పల్లవి::

శరణు శరణు గ్రహదేవులారా శరణు
మీ మహిమలను తెలుసుకున్నాను
దాసోహమన్నాను కనులు తెరిచాను
కనులు తెరిచాను

నా మొరను మీరాలకించి
అపరాధము మన్నించి
కావరా మీ దయజూపి 

నా మొరను మీరాలకించి
అపరాధము మన్నించి
కావరా మీ దయజూపి

చరణం::1 

చేతులారా నేనే..చేసినానపచారం 
చేతులారా నేనే..చేసినానపచారం 
దోషమంతా నాదే..దోషఫలమూ నాదే
కరుణతో నను..ఆదరించిన 
నిరపరాధులకా యీ దందన 

నా మొరను..మీరాలకించి
అపరాధము..మన్నించి
కావరా మీ..దయజూపి

1::సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్  
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్  

సూర్యం ప్రణమామ్యహమ్

2::శ్వేతాశ్వ రథమారూఢం కేయూర మకుటోజ్వలమ్ 
జటాధర శిరోరత్నం తం చంద్రం ప్రణమామ్యహమ్ 

చంద్రం ప్రణమామ్యహమ్

3::ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభమ్ 
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ 

మంగళం ప్రణమామ్యహమ్

4::ప్రియాంగుకలికా శ్యామం రూపేణా ప్రతిమం బుధమ్  
సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్  


బుధం ప్రణమామ్యహమ్

5::దేవనామ్ చ ఋషీనామ్ చ గురు కాంచన సన్నిభమ్ 
బుద్ధిభూతం త్రిలోకేశం తం గురుం ప్రణమామ్యహమ్ 


గురుం ప్రణమామ్యహమ్


6::హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ 
సర్వశాస్త్ర ప్రవక్తారం తం శుక్రం ప్రణమామ్యహమ్ 

శుక్రం ప్రణమామ్యహమ్

7::నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజమ్ 
ఛాయా మర్తాండ సంభూతం తం శనిం ప్రణమామ్యహమ్ 


శనిం ప్రణమామ్యహమ్

8::అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ 

రాహుం ప్రణమామ్యహమ్

9::ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకమ్ 
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ 

కేతుం ప్రణమామ్యహమ్

ప్రణమామ్యహమ్, ప్రణమామ్యహమ్, ప్రణమామ్యహమ్