Wednesday, June 06, 2007

మల్లేశ్వరి--1951::కాఫీ:;రాగం



సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
రచన::దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి
గానం::భానుమతి


రాగం:::కాఫీ...

:::::::::::::::::::::::::::::::::::::::::::::::


పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
భళిరా రాజా ఆ ఆ ఆ ఆ

ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారగ వినునే
పిలిచినా బిగువటరా..
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారగ వినునే
పిలిచినా బిగువటరా
గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందెల రవళుల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
అందగాడా ఇటు తొందర చేయగా

పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా

మల్లేశ్వరి--1951::బౄందావనీ::సారంగ::రాగం



సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
రచన::దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి
గానం::ఘంటసాల,భానుమతి


రాగం::బౄందావనీ~సారంగ
(హిందుష్తానీ~కర్నాటక)


ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
హెయ్ పరుగులు తియ్యాలి ఓ గిత్తలు ఉరకలు వెయ్యాలి
హెయ్ పరుగులు తియ్యాలి ఓ గిత్తలు ఉరకలు వెయ్యాలి
హెయ్ బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి
మన ఊరు చేరాలి
ఓ ఓ హోరుగాలి కారుమబ్బులు
హోరుగాలి కారుమబ్బులు ముసిరేలోగా మూగేలోగా
ఊరు చేరాలి మన ఊరు చేరాలి

గలగల గలగల కొమ్ముల గజ్జెలు
గణగణ గణగణ మెళ్ళో గంటలు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గలగల గలగల కొమ్ముల గజ్జెలు
గణగణ గణగణ మెళ్ళో గంటలు
వాగులు దాటి వంకలు దాటి ఊరు చేరాలి
మన ఊరు చేరాలి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అవిగో అవిగో నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు అదిగో అదిగో
అదిగో అదిగో..
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పచ్చని తోటలు మెచ్చిన పువ్వులు
ఊగే గాలుల తూగే తీగలు అవిగో అవిగో ఓ..
కొమ్మల ఊగె కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో
అవిగో అవిగో ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

మల్లేశ్వరి--1951:::రాగమాలిక



చక్కటి రాగాలతో మనసును రాగమాలిక చేసిన ఈ పాటను
స్వర్గీయ భానుమతి గారి తో చేరి మన ఘంటసాల గారు
ఆలపించిన మధురమైన ఈ రాగమాలికను ,
సాలూరి రాజేశ్వర రావ్ గారు స్వరపరచగా ,
దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారి రచనలో
ఈ పంచవన్నెల రాగాలను మీరూ విని ఆనందించండి :)

రాగం : ఆభేరి .

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగిచూసేవు...
ఏడ తానున్నాడో బావా..
జాడ తెలిసిన పోయిరావా ....
అందాల ఓ మేఘమాల ఆ..
చందాల ఓ మెఘమాల

రాగం : భీంపలాశ్రీ .

గగన సీమల తేలు ఓ మేఘమాల
మావూరు గుడిపైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైన నాతోమనసు చల్లగా చెప్పిపోవా
నీలాల ఓ మేఘమాలా ఆ.. రాగాల ఓ మేఘమాలా

రాగం : కళంగడ . హిందుస్తానీ కర్నాటక రాగం .

మమతలెరిగిన మేఘమాలానా
మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్లు నాకళ్లు దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూచేనే
బావకై చెదరి కాయలు కాచెనే...
నీలాల ఓ మేఘమాలా ఆ.. రాగాలా ఓ మేఘమాలా

రాగం : కీరవాణి .

మనసు తెలిసిన మేఘమాలా
మరువలేనని చెప్పలేవామల్లితో
మరువలేనని చెప్పలేవా
కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని
మల్లిరూపె నిలిచేనే నా చెంత మల్లి మాటే పిలిచేనే

రాగం : హంసానంది .

జాలి గుండెల మేఘమాలా
బావ లేనిది బ్రతుకజాల...
కురియు నా కన్నీరు
గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసిపోవా
కన్నీరు ఆనవాలుగ బావ మ్రోల

మల్లేశ్వరి--1951::కల్యాణి::రాగం


సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి
డైరెక్టర్::BN.రెడ్డి
గానం::భానుమతి


రాగం::కల్యాణి !! 

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా
అలలు కొలనులో గల గల మనినా
అలలు కొలనులో గల గల మనినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హౄదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

మల్లేశ్వరి--1951::కానడ::రాగం



సంగీతం::సాలూరు
రచన::దేవునిపల్లి క్రిష్ణ శాస్త్రి

గానం::భానుమతి

కానడ::రాగం
(హిందుస్తానీ ~ కర్నాటక)


ఎవరు ఏమని విందురు
ఎవ్వరేమని కందురు
ఈ జాలి గాధ ఈ విషాద గాధ
నెలరాజా వెన్నెల రాజా
నెలరాజా వెన్నెల రాజా
వినవా ఈ గాధ ఆ ఆ
నెలరాజా వెన్నెల రాజా

ఏనాడో ఏకమై కలసిపోయిన జంట
ఏ కౄరదైవము ఎడబాటు చేసెనే ఏ ఏ
ఊరు గుడిలో రావి బావల
నాటి వలపుల మాటలన్ని
నేలపాలై పోయెనే ఏ ఏ
గాలిమేడలు కూలెనే
నెలరాజా వెన్నెల రాజా
వినవా ఈ గాధ ఆ ఆ
నెలరాజా వెన్నెల రాజా

ఆ రావి ఆ బావి ఆ స్వామి సాక్షిగా ఆ ఆ
ఆనాటి బాసలు అన్ని కలలాయెనే ఏ ఏ ఏ
నడిచి వచ్చే వేళ తెలవని అడుగనైనా అడుగలేదని

ఎంతగా చింతించెనో ఏమనుచు దు:ఖించెనో
పొగిలి గుండెలు పగిలెనే
తుదకు భాదలు మిగెలెనే
నెలరాజా వెన్నెల రాజా
వినవా ఆ ఆ ఆ
నెలరాజా వెన్నెల రా
జా

విప్రనారాయణ--1954::కల్యాణి :: రాగం





సంగీతం::సాలూరు
రచన::దేవునిపల్లి క్రిష్ణ శాస్త్రి
గానం::భానుమతి

కల్యాణి :: రాగం 


రారా నాసామి రారా
రారా నాసామి రారా
రారా నాసామి రారా
రార రాపేల చేసేవురా..ఇటురారా నాసామి రారా
రార రాపేల చేసేవురా..ఇటురారా నాసామి రారా


ఎంతసేపని తాలుజాలర
ఎంతసేపని ఈ ఈ ఈ ఈ
ఎంతసేపని తాలుజాలర
మోహమింక నే నిలుపలేనురా
మోహమింక నే నిలుపలేనురా
చెంతచేరి ఎమ్మోవి ఆనర ఆ ఆ ఆ
చెంతచేరి ఎమ్మోవి ఆనర
చెంత నువ్వే చేరి మానరార
రారా నాసామి రారా
చెంత నువ్వే చేరి మానరార
రారా నాసామి రారా
రార రాపేల చేసేవురా ఇటురారా నాసామి రారా


మూడితివిక దయలుంచరా మువ్వగోపాల నా మోహమెంచరా
మూడితివిక దయలుంచరా మువ్వగోపాల నా మోహమెంచరా
వేడుక ఏమి కౌగిలించరా ఆ ఆ ఆ ఆ
వేడుక ఏమి కౌగిలించరా
వింత సేయక గారవించర
రారా నాసామి రారా
వింత సేయక గారవించర
రారా నాసామి రారా
రార రాపేల చేసేవురా ఇటురారా నాసామి రారా
సామి రారా సామి రారా సామి
రారా

మల్లేశ్వరి--1951:::రాగం::పహడి::యదుకుల కాంభోజి::రాగం



సంగీతం::సాలూరి
రచన::దేవునుపల్లి క్రిష శాస్త్రి
గానం::భానుమతి


రాగం::: పహడి !!!
యదుకుల కాంభోజి::రాగం


హు హు హు హు
ఔనా నిజమేనా ఔనా నిజమేనా
మరచునన్న మరువలేని మమతలన్ని కలలేనా
రాణివాసమేగేవా బావమాట మరచేవా
ఔనా నిజమేనా ఔనా


మనసులోన మరులు గొలిపి కడకు మాయమాయేనా
ప్రాణమున్న మల్లి పోయి రాతిబొమ్మ మిగిలేనా
ఔనా నిజమేనా ఔనా హు హు హు హు హు హు
ఔనా కలలేనా ఔనా కలలేనా
నాటి కథలు వ్యధలేనా నీటిపైని అలలేనా
నాటి కథలు వ్యధలేనా నీటిపైని అలలేనా
బావ నాకు కరువేనా బ్రతుకు ఇంక బరువేనా
బావ నాకు కరువేనా బ్రతుకు ఇంక బరువేనా
ఔనా కలలేనా


పగలులేని రేయివోలె పలుకు లేని రాయివోలె
బరువు బ్రతుకు మిగిలేనా వలపులన్ని కలలేనా
ఔనా కలలేనా ఔనా కల
లేనా

మల్లేశ్వరి--1951::ఖమాస్::రాగం


సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
రచన::దేవునిపల్లి క్రిష్ణ శాస్త్రి
గానం::P.భానుమతి


రాగం:::ఖమాస్ !!!!

ఎందుకే నీకింత తొందర
ఎందుకే నీకింత తొందర
ఇన్నాళ్ళ చెరసాల తీరే తీరునే
ఎందుకే నీకింత తొందర
ఓ చిలుక నా చిలుక ఆ ఆ
ఓ చిలుక నా చిలుక ఓ రామచిలుక ఆ ఆ
వయ్యారి చిలుక గారాల మొలక
ఎందుకే నీకింత తొందర

భాధలన్ని పాత గాధలైపోవునే ఏ ఏ ఏ
భాధలన్ని పాత గాధలైపోవునే
వంతలన్ని వెలుగు పుంతలో మాయునే
ఎలాగో ఓలాగ ఈరేయి దాటెనా
ఈరేయి దాటెనా
ఈ పంజరపు బ్రతుకు ఇక నీకు తీరునే
ఎందుకే నీకింత తొందర


ఆ తోట ఆ తోపు ఆకుపచ్చని గూడు
ఆ వంక గొరవంక అన్ని వున్నాయిలే ఏ ఏ ఏ
ఆ వంక గొరవంక అన్ని వున్నాయిలే
చిరుగాలి తరగలా చిన్నారి పడవలా
పసరు రెక్కల పరిచి పరిగెత్తి పోదామె
ఎందుకే నీకింత తొందర