Tuesday, November 08, 2011

ఆలాపన--1986



సంగీతం::ఇళయరాజ
రచన::వీటూరి
గానం::S,జానకి , S.P.బాలు
తారాగణం::మోహన్,భానుప్రియ

పల్లవి::

తయ్యా తైయ్యు తయ్యత్తైతక తైతయ తైతయు తైతకతై
తక తయ్యా తైయ్యు తయ్యత్తైతక తైయ్యత్తై తైయ్యత్తై తకతై 
ఇది ఆంగిక వాచిక సాత్వికాభినయ..భంగీలసిత రసాంగ తరంగిత 
ఇది ఆంగిక వాచిక సాత్వికాభినయ..భంగీలసిత రసాంగ తరంగిత భావరాగతాళ త్రిపుటీకౄత భరతనాట్యం
ధింతా ధింతా ధింతా దిత్తా..ధింతా ధింతా ధింతా దిత్తా..ధింతా ధింతా ధింతా దిత్తా..ధింతా ధింతా ధిం
ఇది మనసున పూచే.. ధింతా ధింతా ధింతా దిత్తా..ధింతా ధింతా ధిం..
ఇది మనసున పూచే మధుమయ పణిపులు..ఆ..తనువున వీచే తరగలుగా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అణువణువున ఎగసే అభినయ రసఝరి మణిపురి
తక్కిటధీం..తధిగిటధీం..తత్తధికిట తకధిమి తరికిట తరికిటధీం తరికిటధీం తత్తధికిట తరికిట తరికిటధీం 
ఇది రాగ మనోహర రమ్య వికాసం లలిత లయాత్మక లాశ్యవిషేషం..ఆఆఆఆ  
ఇది రాగమనోహర రమ్యవికాసం లలిత లయాత్మక లాశ్యవిషేషం ఊహలు కిన్నెర తీవెలుమీటే ఒడిశ్శీ

ఇది పదపదమున లయనదములు కదలే 
గమనగతుల భువనములు చలించే 
ఇది పదపదమున లయనదములు కదలే 
గమనగతుల భువనములు చలించే 
కళామయోద్ధత విలాస వీచిక కథక్

ఆవేదన..ఒక ఆరాధన..ఏ శక్తులు శాశించిన 
సాగే ఈ తపన తెలియని ఆవేదన 
ఆవేదన...ఆరాధన
ఆవేదన..ఆ..ఒక ఆరాధన..ఆ..
ఏ శక్తులు శాశించిన సాగే ఈ తపన తెలియని ఆవేదన

దేవత--1964::కల్యాణి:::రాగం



సంగీతం::S.P. కోదండపాణి
రచన::శ్రీ.శ్రీ,వీటూరిసుందరరామమూర్తి
గానం::ఘంటసాల, P. సుశీల

Film Directed By::K.HemaambharadhgaraRao  
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,పద్మనాభం,గీతాంజలి,చిత్తూరు నాగయ్య,హేమలత,నిర్మలమ్మ,రాజనాల,S.V.రంగారావు.అంజలిదేవి,రాజబాబు,గుమ్మడి,కృష్ణకుమారి. 

కల్యాణి:::రాగం

పల్లవి::

NTR::--తొలి వలపే..పదే పదే పిలిచే..ఎదలో సందడి చేసే
సావిత్రి::--తొలి వలపే..పదే పదే పిలిచే..మదిలో మల్లెలు విరిసే

సావిత్రి::--తొలివలపే..ఏ ఏ ఏ ఏ..
ఆ ఆ ఆ..ఆ ఆ ఆ..ఆ ఆ ఆ

చరణం::1

NTR::--ఏమో ఇది ఏమో..
నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు

సావిత్రి::--ఆ అందం..అనుబంధం..నా మనసున నీకై దాచిన
పూచిన కానుకలు!

NTR::ఏమో ఇది ఏమో..
నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు

సావిత్రి::--ఆ అందం..అనుబంధం..నా మనసున నీకై దాచిన
పూచిన కానుకలు!

NTR:: --నీ కన్నుల వెలిగేనే దీపాలు..

సావిత్రి::--అవి నీ ప్రేమకు ప్రతిరూపాలు

NTR::--నీ కన్నుల వెలిగేనే దీపాలు..

సావిత్రి::--అవి నీ ప్రేమకు ప్రతిరూపాలు
మన అనురాగానికి హారతులు

NTR::--తొలి వలపే..పదే పదే పిలిచే..ఎదలో సందడి చేసే
తొలి వలపే..ఏ..

సావిత్రి::--గ రి ని రి గా

NTR::--ఆ.. ఆ.. ఆ

సావిత్రి::--మగనిగమా..

NTR::--ఆ..ఆ..ఆ..

సావిత్రి::--గమ,నీద నీద మా..

NTR::--ఆ.. ఆ.. ఆ..

చరణం::2

సావిత్రి::--యేలా ఈ వేళ..కడువింతగ దోచే
తీయగా..హాయిగ..ఈ జగమూ

NTR::--యవ్వనము..అనుభవము..జతకూడిన వేళా
కలిగిన వలపుల పరవశము

సావిత్రి::--యేలా ఈ వేళ..కడువింతగ దోచే
తీయగా..హాయిగ..ఈ జగమూ

NTR::--యవ్వనము..అనుభవము..జతకూడిన వేళా
కలిగిన వలపుల పరవశము

సావిత్రి::--ఈ రేయి పలికెలే..స్వగతము

NTR::--ఈనాడే బ్రతుకున..శుభదినమూ

సావిత్రి::--ఈ రేయి పలికెలే..స్వగతమూ

NTR::--ఈనాడే బ్రతుకున..శుభదినము
ఈ తనువే..మనకిక చెరి సగము

NTR::--తొలి వలపే..పదే పదే పిలిచే..ఎదలో సందడి చేసే

సావిత్రి::--తొలి వలపే..పదే పదే పిలిచే..మదిలో మల్లెలు విరిసే