సంగీతం::K.V .మహదేవన్ రచన::ఆత్రేయ గానం::ఘంటసాల,P.సుశీల పల్లవి:: చకచకలాడే..నడుముచూడు నడుమును వూపే..నడకచూడు నడకను చూస్తూ వెనకబడే యీ పడుచువానిలో పొగరూ చూడు కోల కన్నుల..కుర్రదానా నీ కోపంలోనే..కోరికవుంది కోరిక దాచిన..కుర్రవాడా నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది కోల కన్నుల..కుర్రదానా నీ కోపంలోనే..కోరికవుంది కోరిక దాచిన..కుర్రవాడా నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది చరణం::1 కరినాగంటి..జడచూడు అది కాటేస్తేనే..మగవాడు సుడిగాలంటి..మగవాడు నన్ను చుట్టెయ్యాలి..ఒకనాడు కరినాగంటి..జడచూడు అది కాటేస్తేనే..మగవాడు సుడిగాలంటి..మగవాడు నన్ను చుట్టెయ్యాలి..ఒకనాడు అది నిజమవుతుందన్నాను నీ గడుసుతనాన్ని..మెచ్చాను కోలకన్నుల కుర్రదానా నీ కోపంలోనే..కోరికవుంది..ఆహా కోరికదాచిన..కుర్రవాడా నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది చరణం::2 చెప్పలేక ఎన్నాళ్ళో..దాచుకున్నాను నువ్వొప్పుకోవని కొన్నాళ్ళు..ఊరుకున్నాను చెప్పలేక ఎన్నాళ్ళో..దాచుకున్నాను నువ్వొప్పుకోవని కొన్నాళ్ళు..ఊరుకున్నాను చెప్పలేనివి చెప్పేటందుకె..కన్నులున్నాయి చెప్పలేనివి చెప్పేటందుకె..కన్నులున్నాయి అవి ఒప్పుకుంటె మనసులు..రెండూ ఒకటవుతాయి అవి ఒప్పుకుంటె మనసులు..రెండూ ఒకటవుతాయి అహహా..అహహా..ఓహో ఓఓఓ..ఓహో ఓఓఓ అహహా..అహహా..ఓహో ఓఓఓ..ఓహో ఓఓఓ
కోలకన్నుల..కుర్రదానా నీ కోపంలోనే..కోరికవుంది కోరిక దాచిన..కుర్రవాడా నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది చరణం::3 పిల్లను చూచిన..అబ్బాయి నీ పెళ్ళికి నేనూ..వస్తాను పెళ్ళికి వచ్చే..అమ్మాయి నా పక్కన పీటే..యిస్తాను పిల్లను చూచిన..అబ్బాయి నీ పెళ్ళికి నేనూ..వస్తాను పెళ్ళికి వచ్చే..అమ్మాయి నా పక్కన పీటే..యిస్తాను నా మనసున..పీటను వేశాను నీ మమతకు..తాళికట్టాను కోలకన్నుల..కుర్రదానా నీ కోపంలోనే..కోరికవుంది చకచకలాడే..నడుముచూడు నడుమును వూపే..నడకచూడు నడకను చూస్తూ..వెనకబడే యీ పడుచువానిలో..పొగరూ చూడు కోల కన్నుల..కుర్రదానా నీ కోపంలోనే..కోరికవుంది కోరిక దాచిన..కుర్రవాడా నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది