Wednesday, September 22, 2010

శ్రీకృష్ణ విజయము--1971::అఠాణ::రాగం































సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావ్
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల

అఠాణ::రాగం 

పల్లవి::

జోహారు శిఖిపింఛ మౌళీ
జోహారు శిఖిపింఛ మౌళీ ఇదె 
జోహారు రసరమ్య గుణశాలి వనమాలి

జోహారు శిఖిపింఛ మౌళీ..ఈ.. 

చరణం::1

కలికి చూపులతోనే చెలులను కరిగించి 
కరకు చూపులతోనే అరులను జడిపించి 
కలికి చూపులతోనే చెలులను కరిగించి 
కరకు చూపులతోనే అరులను జడిపించి
నయగార మొకకంట జయవీర మొకకంట 
నయగార మొకకంట జయవీర మొకకంట 
చిలకరించి చెలువమించి నిలిచిన శ్రీకర  నరవర సిరిదొర

జోహారు శిఖిపింఛ మౌళీ..ఈ..

చరణం::2

నీ నాదలహరిలో నిదురించు భువనాలు 
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు 
నీ నాదలహరిలో నిదురించు భువనాలు 
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నిగమాలకే నీవు సిగబంతివైనావు
ఆఆఆఆఆఆఆఅ
నిగమాలకే నీవు సిగబంతివైనావు 
యుగ యుగాల దివ్యలీల నెరపిన అవతారమూర్తి ఘనసారకీర్తి

జోహారు శిఖిపింఛ మౌళీ..ఈ..

చరణం::3

చకిత చకిత హరిణేక్షణా  వదన చంద్రకాంతు లివిగో 
చలిత లలిత రమణీ చేలాంచల చామరమ్ము లివిగో 
ఝలమ్ ఝళిత సురలలనా నూపుర కలరవమ్ము లివిగో 
మధుకరరవమ్ము లివిగో మంగళరవమ్ము లివిగో 
దిగంతముల అనంతముగ గుబాళించు 
సుందర నందన సుమమ్ము లివిగో

జోహారు శిఖిపింఛ మౌళీ..ఈ..

వరకట్నం--1968



















సంగీతం::T.V.రాజు 
రచన::కొసరాజు రాఘవయ్య 
గానం::ఘంటసాల 
Film Directed By::Nandamoori Taraka RamaRao
తారాగణం::నందమూరి తారకరామారావు,కృష్ణకుమారి,సావిత్రి,నాగభూషణం,రాజనాల,
హేమలత.

పల్లవి::

సై సై జోడెడ్లా బండి..బండి
హోయ్..షోకైన దొరలా బండి
ఖంగు ఖంగు మని గంటల బండి
ఘల్లు ఘల్లుమని గజ్జెల బండి
చుట్టుపక్కల పన్నెండామడ దీనికి
పోటీ లేదండీ..మహా ప్రభో..

చరణం::1

కంటికాటుకెట్టి గట్లున్న గడ్డికోసి
గుత్తంగా రైక తొడిగి కొడవలేసి కోతకు వంగి
వగలాడి వోరగ చుస్తే వులిక్కి పడతది నా యెడ్లు
మహాప్రభో..

చరణం::2

నెత్తిన బుట్టపెట్టి అడుగులో ఆడుగులేసి
సరదాగా సరసాలాడుతూ
పరిగెడుతూ పకపకలాడుతూ
నెరజాణ సైగల చూస్తే కనపడదు ముందు దారి
మహాప్రభో

చరణం::3

మట్టగోచి గట్టిగ దోపి మట్టి తట్ట పైకి లేపి
చీరవేసి మనమీద ఒడుపుగా జబ్బమీద దెబ్బవేసే
చిలక కొలికి కులుకుతూంటే
జల్లు జల్లు మంటుంది నా ఒళ్ళూ..
మహా ప్రభో..

Varakatnam--1968
Music::T.V.Raju
Lyricist::Kosaraju Raghavaiah
Singer's::Ghantasala

pallavi::

sai sai jOdedlaa bandi..bandi
hOy..shOkaina doralaa bandi
khangu khangu mani ganTala bandi
ghallu ghallumani gajjela bandi
chuttu pakkala pannendaamada deeniki
pOtee ledandee..mahaa prabhO..

:::1

kantikaatuketti gatlunna gaddikosi
guttangaa raika todigi kodavalesi kOtaku vangi
vagalaadi vOraga chuste vulikki padatadi naa yedlu
mahaaprabhO..

:::2

nettina buttapetti adugulO aadugulesi
saradaagaa sarasaalaadutoo
parigedutoo pakapakalaadutoo
nerajaana saigala chooste kanapadadu mundu daari
mahaaprabhO

:::3

mattagOchi gattiga dOpi matti tatta paiki laepi
cheeravesi manameeda odupugaa jabbameeda debbavese
chilaka koliki kulukutoomte
jallu jallu mamtumdi naa olloo..
mahaa prabhO..

సప్తస్వరాలు --1969



సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,పి.సుశీల
Film Directed By::Vedaantam Raaghavayya
తారాగణం::కాంతారావు,రాజనాల,నాగయ్య,కైకాల సత్యనారాయణ,రాజశ్రీ,
విజయలలిత.

పల్లవి::

అదే నీవంటివి అదే నేవింటిని
గుండె అలలాగ చెలరేగ ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని..ఈఈఈఈ  

చరణం::1

ఎవ్వరు లేని పువ్వులతోట
ఇద్దరు కోరే ముద్దులమూట
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎవ్వరు లేని పువ్వులతోట
ఇద్దరు కోరే ముద్దులమూట 

ఎదలో కదలాడె..పెదవుల తెరవీడి
చెవిలో ఝుమ్మని..రవళించిన ఆ మాట..ఓఓఓఓఓఓ
అదే నీవంటివి..అదే నేవింటిని

చరణం::2

పున్నమిరేయి..పూచిన చోట
కన్నులు చేసే..గారడి వేట
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పున్నమిరేయి..పూచిన చోట
కన్నులు చేసే..గారడి వేట

చూపులు జతచేసి..ఊపిరి శ్రుతిచేసి
తనువే జిల్లన..కవ్వించిన ఆ మాట..ఓఓఓఓఓఓ
అదే నీవంటివి..అదే నేవింటిని

చరణం::3

నిన్నూ నన్నూ..కలిపిన బాట
నీలో నాలో..పలికిన పాట
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిన్నూ నన్నూ..కలిపిన బాట
నీలో నాలో..పలికిన పాట

జాబిలి సిగ్గిలగా..కౌగిలి దగ్గరగా
మనసే ఝల్లన చిలికించిన ఆ మాట..ఓఓఓఓఓఓ
అదే నీవంటివి..అదే నేవింటిని
ఏమి అనలేని..బిడియాన ఔనంటిని
అదే నీవంటివి..అదే నేవింటిని
అహా ఆహాహహా మ్మ్ హు మ్మ్ హు హు హు 

Sapthaswaralu--1969
Music::T.V.Raju
Lyrics::Dr.C.Narayana Reddy
Singer's::Ghantasala, P.Susheela 
Film Directed By::Vedaantam Raaghavayya
Cast::Kaanta Rao,Raajanaala,Kaikaala Satyanaaraayana,naagayya,Raajasri,Vijayalalita.

::::::::::::::::::::::::::::::::::

adE neevanTivi adE nEvinTini
gunDe alalaaga chelarEga aunanTini

adE neevanTivi adE nEvinTini
Emi analEni biDiyaana aunanTini
adE neevanTivi adE nEvinTini..iiiiiiii 

::::1

evvaru lEni puvvulatOTa
iddaru kOrE muddulamooTa
aa aa aa aa aa aa aa aa aaa aa
evvaru lEni puvvulatOTa
iddaru kOrE muddulamooTa

edalO kadalaaDe pedavula teraveeDi
chevilO jhummani ravaLinchina aa maaTa..OOOOOO
adE neevanTivi adE nEvinTini

::::2

punnamirEyi poochina chOTa
kannulu chEsE gaaraDi vETa
aa aa aa aa aa aa aa aa aaa aa
punnamirEyi poochina chOTa
kannulu chEsE gaaraDi vETa

choopulu jatachEsi oopiri SrutichEsi
tanuvaE jillana kavvinchina aa maaTa..OOOOOO
adE neevanTivi adE nEvinTini

::::3

ninnoo nannoo kalipina baaTa
neelO naalO palikina paaTa
aa aa aa aa aa aa aa aa aaa aa
ninnoo nannoo kalipina baaTa
neelO naalO palikina paaTa

jaabili siggilagaa kaugili daggaragaa
manasE jhallana chilikinchi aa maaTa..OOOOOO

adE neevanTivi adE nEvinTini
Emi analEni biDiyaana aunanTini
adE neevanTivi adE nEvinTini
ahaa aahaahahaa mm hu mm hu hu hu 

రామరాజ్యం--1973




సంగీతం::ఘంటసాల
రచన::దాశరథి
గానం::P సుశీల
తారాగణం::జగ్గయ్య,సావిత్రి,S.V.వి.రంగారావు,గుమ్మడి, చంద్రమోహన్, రాజబాబు 

పల్లవి::

రావయ్యా..నల్లనయ్యా
నీ రాధ మనవి..వినవయ్యా
రావయ్యా..నల్లనయ్యా
నీ రాధ మనవి..వినవయ్యా
రావయ్యా..నల్లనయ్యా 

చరణం::1

బృందావనిలో..అటలాడి
యమునా తటిపై..పాటపాడే  
వెన్నెలలో..సురపొన్నల నీడల
వెన్నెలలో..సురపొన్నల నీడల 
హాసముతో..విలాసముతో
సదా నిను..కొలుచుటే బాగ్యమయా
సదా నిను..కొలుచుటే బాగ్యమయా 
    
రావయ్యా..నల్లనయ్యా
నీ రాధ మనవి..వినవయ్యా
రావయ్యా..నల్లనయ్యా 

చరణం::2

అనురాగానికి..నీవె నిలయం
ఆత్మీయతకు..నీవె రూపం
అందరికీ..నీ చరణమె శరణం
అందరికీ..నీ చరణమె శరణం
రాగముతో..సరాగముతో
రాగముతో..సరాగముతో
సదా నిను తలచుటే..పుణ్యమయా
సదా నిను తలచుటే..పుణ్యమయా  
    
రావయ్యా..నల్లనయ్యా
నీ రాధ మనవి వినవయ్యా
రావయ్యా..నల్లనయ్యా
నీ రాధ మనవి..వినవయ్యా
రావయ్యా..ఆ ఆ ఆ ఆ ఆ 

రామరాజ్యం--1973




సంగీతం::ఘంటసాల
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::జగ్గయ్య,సావిత్రి,S.V.రంగారావు,గుమ్మడి, చంద్రమోహన్, రాజబాబు 

పల్లవి::

గెలుపుల రాణిని కదరా..ఇక నిను వదలను పదరా
ముసి ముసి నవ్వుల..మిఠారి చూపుల
గుమ్మెత్తిస్తారా..ఆ..సమయమిదే..రా..రా            
గెలుపుల రాణిని కదరా..ఇక నిను వదలను పదరా
ముసి ముసి నవ్వుల..మిఠారి చూపుల
గుమ్మెత్తిస్తారా..ఆ..సమయమిదే..రా..రా   

చరణం::1

కన్ను మూసుకున్నావంటే..నే కల్లోవచ్చి ఊపేస్తా
కళ్ళు తెరచి చూశావంటేనే..నీ వొళ్ళో వచ్చి వాలేస్తా
మనసూ మనసూ కలిపేస్తా..మైకంలో నిను తేలుస్తా
మనసూ మనసూ కలిపేస్తా..మైకంలో నిను తేలుస్తా
వెచ్చవెచ్చనీ కౌగిటిలోనా..ముచ్చటలన్నీ తీరుస్తా   
గెలుపుల రాణిని కదరా..ఇక నిను వదలను పదరా

చరణం::2

ఎన్నడు నీవు చూడని స్వర్గం..ఎదురుగ యిపుడే చూపిస్తా 
నవనవలాడే నా వయసంతా..నీ చేతులకే అందిస్తా
తేనె వాగులో ఈదిస్తా..ఆనందంలో మురిపిస్తా
తేనె వాగులో ఈదిస్తా..ఆనందంలో మురిపిస్తా
ఇలాంటి సుఖమూ ఎక్కడ లేదని..నీ చేతనే చెప్పిస్తా 
గెలుపుల రాణిని కదరా..ఇక నిను వదలను పదరా
ముసి ముసి నవ్వుల..మిఠారి చూపుల
గుమ్మెత్తిస్తారా..ఆ..సమయమిదే..రా..రా