సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
రచన::పింగళి
గానం::A.M.రాజా,P.లీల
Film Directed By::L.V.Prasaad
తారాగణం::N.T.R.,రేలంగి,A.N.R.,రమణారెడ్డి,S.V.రంగారావు,అల్లురామలింగయ్య,బాలకృష్ణ,గుమ్మడి,ఋష్యేద్రమణి,జమున,సావిత్రి,మీనాక్షీ,
ఆభేరి:::రాగం
రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ
సామంతము గల సతికీ ధీమంతుడ నగు పతినోయ్
సామంతము గల సతికీ ధీమంతుడ నగు పతినోయ్
సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే
రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా
రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్
మనమూ మనదను మాటే అననీ ఎదుటా ననదోయ్
రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చ్హటలేమో
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చ్హటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా
రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ