Friday, September 16, 2011

పొగరుబోతు--1976





పాట ఇక్కడ వినండి


సంగీతం::K.V.మహాదేవన్

రచన::Dr.C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల


కట్టుకొన్నా అదే చీర
పెట్టుకొన్నా అవే పూలు
ఇంతగ నిన్నే..వలచే నన్నే
ఎందుకలా..చూస్తావూ?
ఇంకా ఇంకా..ఉడికిస్తావు

కట్టుకొన్నా అదే చీర
పెట్టుకొన్నా అవే పూలు

సేదబావిలో సందరూడు..చిలిపిగ మునకేస్తున్నాడు
ఈ మగువ మనసులో మరో చంద్రుడు..తగని అల్లరి చేస్తున్నాడు
సేదబావిలో సందరూడు..చిలిపిగ మునకేస్తున్నాడు
ఈ మగువ మనసులో మరో చంద్రుడు..తగని అల్లరి చేస్తున్నాడు
చందురుని మునకలు నీటివరకేనా..!
అంగాడి అల్లరి అంతవరకేనా..అంతంతవరకేనా..!!

కట్టుకొన్నా అదే చీర
పెట్టుకొన్నా అవే పూలు
ఇంతగ నిన్నే..వలచే నన్నే
ఎందుకలా..చూస్తావూ?
ఇంకా ఇంకా..ఉడికిస్తావు

మైకం పెంచే మగువేమో..చీకటిలా కమ్మేస్తుందీ
ఇల్లాలిచ్చే వెలుగేమో..ఎన్నో జన్మల వెలుగవుతుంది
మైకం పెంచే మగువేమో..చీకటిలా కమ్మేస్తుందీ
ఇల్లాలిచ్చే వెలుగేమో..ఎన్నో జన్మల వెలుగవుతుంది
వేసిన బంధం కాదంటావా?
వేసిన అందం..వలదంటావా..మరి ఏమంటావు??


కట్టుకొన్నా అదే చీర
పెట్టుకొన్నా అవే పూలు
ఇంతగ నిన్నే..వలచే నన్నే
ఎందుకలా..చూస్తావూ?
ఇంకా ఇంకా..ఉడికిస్తావు

అల్లరి బుల్లోడు--1978





పాట ఇక్కడ వినండి

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల


అతడు::చుక్కల తోటలో ఎక్కడున్నావో..పక్కకు రావే మరుమల్లె పువ్వా
ఆమె::చక్కని జాబిలీ ఎక్కడుంటానూ..నీ పక్కనే చుక్కనై పలకరిస్తానూ

అతడు::నీలి నీలి నీ కురులా..నీలాల మేఘాల..విరిసింది మల్లికా నా రాగ మాలికా
ఆమె::అల్లిబిల్లి నీ కౌగిట..అల్లుకున్న నా మమతా..కొసరింది కోరికా అనురాగ గీతికా

అతడు::నీ మూగ చూపులలో..చెలరేగే పిలుపులలో
ఆమె:: నీ పట్టువిడుపులలో..సుడి రేగే వలపులలో
అతడు::కన్నూ కన్నూ కలవాలీ కలిసి వెన్నెలై పోవాలీ
ఆమె:: చీకటి వెన్నెల నీడలలో దాగుడుమూతలు ఆడాలీ !

అతడు::చుక్కల తోటలో ఎక్కడున్నావో..పక్కకు రావే మరుమల్లె పువ్వా
ఆమె::జాబిలీ ఎక్కడుంటానూ..నీ పక్కనే చుక్కనై పలకరిస్తానూ

అతడు::ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో
కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో
ఆమె::వేచిఉన్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో

అతడు::ఈ పూల వానలలో..తడిసిన నీ అందాలూ
ఆమె:: ఆ..ఆ..ఈ పూట సొగసులలో..కురిసిన మకరందాలూ
అతడు::నీలో తీగలు మీటాలీ నాలో రాగం పలకాలీ
ఆమె:: లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలీ !

అతడు::చుక్కల తోటలో ఎక్కడున్నావో..పక్కకు రావే మరుమల్లె పువ్వా
ఆమె::చక్కని జాబిలీ ఎక్కడుంటానూ..నీ పక్కనే చుక్కనై పలకరిస్తానూ



Allari Bullodu--1978
Music::Chakravarthy
Lyricist::Veturi 
Singer's::SP. Balu P.Susheela 

chukkalato thotalo yekkadunnavo
pakkaku rave marumalle puvvaa
chakkani jabili yekkaduntanu
ne pakkane chukkanai palakaristanu

:::

neeli neeli ne kurula neelala meghala
virisindi mallika na raga maalika
allibilli ne kougita allukunna na mamata
kosarindi korika anuraga geetika
ne muga chupulalo chelarege pilupulalo
ne pattu vidupulalo sudirege valapulalo
kannu kannu kalavali kalisi vennelai povali
cheekati vennela needalalo dagudumutalu aadali

:::

aakalaina naku telusu kougilenta teeyanido
kougilintake telusu aakalenta teeranido
vechivunna naku telusu virahamenta teeynido
kachukunna neku telusu kalayikenta kammanido
ee pula vanalalo tadisina ne andaalu
ee puta sogasulalo kurisina makarandaalu
nelo teegalu meetali nalo ragam palakali

lokam marichina maikamlo maname yekam kavali

చల్‌మోహనరంగ--1978




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

సంగీతం::Bశంకర్(Ghazal Sankar)
రచన::జాలాది రాజా రావ్
గానం::SP.బాలు

ఘల్లుఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ..కలహంస నడకల కలికి
సింగారం ఒలకంగా చీర కొంగులు జార రంగైన నవ మోహనాంగి
ఈడు జోడు మనకు ఇంపుగా కుదిరింది..కోపమెందుకే కోమలాంగిరాణి

ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ..కలహంస నడకల కలికి

అందాల గంధాలు పూసేయన..సిందూర కుసుమాలు సిగముడవన
అందాల గంధాలు పూసేయన..సిందూర కుసుమాలు సిగముడవన
చిలకమ్మో కులికి పలుకమ్మో..ఆ..చిలకమ్మో కులికి పలుకమ్మో

నిలువెత్తు నిచ్చెన్లు నిలువేయన..నీ కళ్ళ నెలవళ్ళ నిడేంచన
మడతల్లో మేని ముడతల్లో..ముచ్చట్లో చీరె కుచ్చేట్లో
మడతల్లో మేని ముడతల్లో..ముచ్చట్లో చీరె కుచ్చేట్లో
పసుపు పారణేసి..పట్టే మంచం వేసి
పసుపు పారణేసి..పట్టే మంచం వేసి
దొంతు మల్లెల మీద దొర్లించనా..
అలవేణి అలకల్లె..నెలరాణి కులుకల్లె
కలలెల్లి పోకమ్మ కలికి..

ఈడు జోడు మనకు ఇంపుగా కుదిరింది..కోపమెందుకే కోమలాంగిరాణి
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ ..కలహంస నడకల కలికి

గగనాల సిగపూల పరుపేయన..పన్నీటి వెన్నెల్లో ముంచేయన
గగనాల సిగపూల పరుపేయన..పన్నీటి వెన్నెల్లో ముంచేయన
నెలవంక చూడు నావంక..చిట్టి నెలవంక చూడు నావంక
నీ మేని హోయలన్ని ఒలిపించనా..ఎలమావి తోటేసి కొలువుంచనా
పొద్దులో సందెపోదుల్లో..నిదట్లో ముద్దు ముచ్చట్లో
పొద్దులో సందెపోదుల్లో..నిదట్లో ముద్దు ముచ్చట్లో
నట్టింట దీపాన్ని నడికొండకెకించి..చీకట్లో వాకిట్లో చిందేయన
పొగరంతా ఎగరేసి వగలంతా ఒలకేసి..కవ్వించబోకమ్మ కలికి..

ఈడు జోడు మనకు ఇంపుగా కుదిరింది..కోపమెందుకే కోమలాంగిరాణి
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ..కలహంస నడకల కలికి

ఛైర్మన్ చలమయ్య---1974








సంగీతం::సాలిల్ చౌదరి
రచన::ఆరుద్ర
గానం::SP.బాలు,P.సుశీల

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
నయనాలు కలిసె తొలిసారీ
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరీ
పులకించె మేను ప్రతిసారి

నయనాలు కలిసె తొలిసారీ
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరీ
పులకించె మేను ప్రతిసారి

లాలలాలాలలాలలలలా ఆహా హా

నాలోనా..నీపేరే..
పాడేనూ రాగాలూ

నాలోనా..నీరూపే
చేసేనూ..చిత్రాలే

మదిలో పదేపదేపదే ధ్వనించే
మమతలతోటలలోనా
తొలివలపులు పూవులు పూచే

నయనాలు కలిసె తొలిసారీ
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరీ
పులకించె మేను ప్రతిసారి

నీలాలా..మేఘాలా
నీవేమో..ఎగిరేవూ

దూరానా..తీరానా
నీవేమో..నిలిచేవూ

కలలే ఇదే ఇలా ఇలా నిజమాయే
పరువము బంధము వేసే
మన ప్రణయము బాసలు చేసే

నయనాలు కలిసె తొలిసారీ
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరీ
పులకించె మేను ప్రతిసారి