Monday, July 23, 2012

మాతృదేవత--1969




సంగీతం::K.V.మహాదేవన్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల, B.వసంత
తారాగణం::N.T. రామారావు,సావిత్రి,శోభన్‌బాబు,చంద్రకళ,నాగభూషణం

పల్లవి::

పెళ్లి మాట వింటేనే తుళ్ళి తుళ్ళి పడతావే
మూడు ముళ్ళు వేసే వేళ  ముడుచుకుపోతావో
సిగ్గుతో బుగ్గలో ముద్దులు చిలికేవో

పెళ్లి మాట వింటేనే ఒళ్ళు జల్లుమంటుంది
మూడు ముళ్ళు వేసే వేళ ముద్దబంతినవుతాను
సిగ్గుతో చెంగులో మోము దాచుకుంటాను

చరణం::1

విరబూసిన పానుపుపై నీవుంటే
అరమూసిన తలుపు మాటున నేనుంటే
విరబూసిన పానుపుపై నీవుంటే
అరమూసిన తలుపు మాటున నేనుంటే
కొంటె మల్లెలు రమ్మంటే తుంటరి కోరిక ఝుమ్మంటే
కొంటె మల్లెలు రమ్మంటే తుంటరి కోరిక ఝుమ్మంటే
నేల చూపు చూస్తావో తేలి తేలి వస్తావో

పెళ్లి మాట వింటేనే తుళ్ళి తుళ్ళి పడతావే
మూడు ముళ్ళు వేసే వేళ  ముడుచుకుపోతావో

చరణం::2

చెలియా చెలియా అని తీయని పిలుపే వినిపిస్తే
మెలమెల్లగా అడుగులు వేస్తూ నే వస్తే వస్తే
చెలియా చెలియా అని తీయని పిలుపే వినిపిస్తే
మెలమెల్లగా అడుగులు వేస్తూ నే వస్తే వస్తే
నిండు దీపం సగమైతే రెండు మనసులు ఒకటైతే
నిండు దీపం సగమైతే రెండు మనసులు ఒకటైతే
ఎన్ని తలపులూరేను ఎపుడు తెల్లవారేను

పెళ్లి మాట వింటేనే ఒళ్ళు జల్లుమంటుంది
మూడు ముళ్ళు వేసే వేళ ముద్దబంతినవుతాను

చరణం::3

నా బ్రతుకున అల్లిన తీవెవు నీవైతే
నా వలపుల పిల్లనగ్రోవివి నీవైతే
ఇంటి దీపం నీవైతే..కంటి పాపవు నీవైతే
ఎన్ని చంద్రకాంతులో..ఎన్ని పులకరింతలో
ఎన్ని చంద్రకాంతులో..ఎన్ని పులకరింతలో
లాలలాలలలల్లా లాలలాలలాలలా
లలలలలల్లల్లల్లా


Maatru Devata--1969
Music::K.V.Mahaadeva
Lyrics::C. Naaraayana Reddi
Singer::Ghantasala, B.Vasantha

:::

pelli mata vintene tulli tulli padataave
mudu mullu vese vela muduchukupotavo
sigguto buggalo muddulu chilikevo 

pelli mata vintene ollu jallumantundi
mudu mullu vese vela muddabantinavutanu
sigguto chengulo momu dachukuntanu

:::1

virabusina panupupai neevunte
aramusina talupu maatuna nenunte
virabusina panupupai neevunte
aramusina talupu maatuna nenunte
konte mallelu rammante tuntari korika jhummante
konte mallelu rammante tuntari korika jhummante
nela chupu chustavo  teli teli vastavo..

pelli mata vintene tulli tulli padataave
mudu mullu vese vela muduchukupotavo

:::2

cheliyaa cheliyaa ani teeyani pilupe vinipiste
melamellagaa adugulu vestu ne vaste vaste
cheliyaa cheliyaa ani teeyani pilupe vinipiste
melamellagaa adugulu vestu ne vaste vaste
nindu deepam sagamaite rendu manasulu okataite
nindu deepam sagamaite rendu manasulu okataite
yenni talapulurenu yepudu tellavarenu..

pelli mata vintene ollu jallumantundi
mudu mullu vese vela muddabantinavutanu

:::3

na bratukuna allina teeve neevaite
na valapula pillanagrovi neevite
inti deepam neevaite kanti papavu neevaite
yenni chandrakaantulo yenni pulakarintalo
yenni chandrakaantulo yenni pulakarintalo
laalalaalalalallaa laalalaalalaalalaa
lalalalalallallallaa

మాతృదేవత--1969






సంగీతం::K.V.మహాదేవన్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల 

పల్లవి::

విధి ఒక విషవలయం 
విషాద కధలకు అది నిలయం 
విషాద కధలకు అది నిలయం 
విధి ఒక విషవలయం

చరణం::1

పూవు మాటున పొంచిన ముళ్ళు నాటే దాకా తెలియదు 
కడలి కడుపున బడబానలము రగిలే దాకా తెలియదు
పచ్చని తరువు సుడిగాలి పాలై విరిగే దాకా తెలియదు

విధి ఒక విషవలయం 
విషాద కధలకు అది నిలయం 
విషాద కధలకు అది నిలయం 
విధి ఒక విషవలయం

చరణం::2

కలలోనైనా ఎడబాటెరుగని కులసతి ఎంతగా వగచేనో
ఇన్నేళ్ళాయెను నాన్న ఏడని కూతురెంతగా వేచేనో
కలలోనైనా ఎడబాటెరుగని కులసతి ఎంతగా వగచేనో
ఇన్నేళ్ళాయెను నాన్న ఏడని కూతురెంతగా వేచేనో
గుండె చెరువుగా కుమిలిన మా యమ్మ పండుటాకులా మిగిలేనో

విధి ఒక విషవలయం 
విషాద కధలకు అది నిలయం 
విషాద కధలకు అది నిలయం 
విధి ఒక విషవలయం

చరణం::3

చెట్టుకొకటిగా చెదరిన గువ్వలు చివరికి గూటికి చేరేనా
అంతులేని ఈ అజ్ఞాత వాసం ఏనాటికైనా తీరేనా
మమతలు నిండిన మా కాపురమే మళ్లి కళకళలాడేనా
మళ్లీ కళకళలాడేనా

MaatruDevata--1969
Music::K.V.Mahaadeva
Lyrics::C. Naaraayana Reddi
Singer::Ghantasala

:::

vidhi oka vishavalayam
vishada kadhalaku adi nilayam
vishada kadhalaku adi nilayam
vidhi oka vishavalayam

:::1

puvu matuna poochina mullu naate daakaa teliyadu
kadali kadupuna badabaanalamu ragile daakaa teliyadu
pachani taruvu sudigaali paalai virige daakaa teliyadu

vidhi oka vishavalayam
vishada kadhalaku adi nilayam
vishada kadhalaku adi nilayam
vidhi oka vishavalayam

:::2

kalalonainaa yedabaaterugani kulasati yentagaa vagacheno
innellaayenu nanna yedani kuturentagaa vecheno
kalalonainaa yedabaaterugani kulasati yentagaa vagacheno
innellaayenu nanna yedani kuturentagaa vecheno
gunde cheruvugaa kumilina ma yamma pandutaakulaa migileno..

vidhi oka vishavalayam
vishada kadhalaku adi nilayam
vishada kadhalaku adi nilayam
vidhi oka vishavalayam

:::3

chettukokatiga chedarina guvvaluchivariki gutiki cherenaa
antuleni ee ajnyata vasam yenatikainaa teerenaa
mamatalu nindina ma kapurame malli kalakalalaadena
malli kalakalalaadenaa

మాతృదేవత--1969


















సంగీతం::K.V.మహాదేవన్
రచన::C. నారాయణ రెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T. రామారావు,సావిత్రి,శోభన్‌బాబు,చంద్రకళ,నాగభూషణం

పల్లవి::

కన్నియనుడికించ తగునా భ్రమరా
కన్నియనుడికించ తగునా భ్రమరా
అన్నెము పున్నెము ఎరుగని కలువల
కన్నియనుడికించ తగునా భ్రమరా
అన్నెము పున్నెము ఎరుగని కలువల
కన్నియనుడికించ తగునా భ్రమరా

చరణం::1

తీవియ ఒడిలో ఒదిగినది తేనెలు ఎదలో పొదిగినది 
తీవియ ఒడిలో ఒదిగినది తేనెలు ఎదలో పొదిగినది 
రేకులు విరిసి విరియనిది..రేకులు విరిసి విరియనిది
ఏ కన్ను సైగల పాపలెరుగనిది

కన్నియనుడికించ తగునా భ్రమరా
అన్నెము పున్నెము ఎరుగని కలువల
కన్నియనుడికించ తగునా 

చరణం::2

గాలి సోకగా కలవర పడురా
అలలు కదలగా ఉలికులికి  పడురా
గాలి సోకగా కలవర పడురా
అలలు కదలగా ఉలికులికి  పడురా
అల చందమామను తిలకించగానే
నిలువెల్ల తొలి సిగ్గు గిలిగింతలిడురా

కన్నియనుడికించ తగునా 

చరణం::3

మనసార పిలిచే పిలుపే పిలుపు
మనువులు కలిపే వలపే వలపు
మనసార పిలిచే పిలుపే పిలుపు
మనువులు కలిపే వలపే వలపు
వలపు లేని పరువపు సయ్యాటలు
వలపు లేని పరువపు సయ్యాటలు
సెలయేటి కెరటాల నురుగుల మూటలు

కన్నియనుడికించ తగునా భ్రమరా
అన్నెము పున్నెము ఎరుగని కలువల
కన్నియనుడికించ తగునా 

Maatru Devata--1969
Music::K.V.Mahaadeva
Lyrics::C. Naaraayana Reddi
Singer::P.Suseela

:::

kanniyanudikincha tagunaa bhramaraa
kanniyanudikincha tagunaa bhramaraa
annemu punnemu erugani kaluvala
kanniyanudikincha tagunaa bhramaraa
annemu punnemu erugani kaluvala
kanniyanudikincha tagunaa bhramaraa

:::1

teeviya odilo odiginadi tenelu edalo podiginadi 
teeviya odilo odiginadi tenelu edalo podiginadi
rekulu virisi viriyanidi..rekulu virisi viriyanidi
E kannu saigala paapaleruganidi

kanniyanudikincha tagunaa bhramaraa
annemu punnemu erugani kaluvala
kanniyanudikincha tagunaa 

:::2

gaali sokagaa kalavara paduraa
alalu kadalagaa ulikuliki  paduraa
gaali sokagaa kalavara paduraa
alalu kadalagaa ulikuliki  paduraa
ala chandamaamanu tilakinchagaane
niluvella toli siggu giligintaliduraa

kanniyanudikincha tagunaa 

:::3

manasaara piliche pilupe pilupu
manuvulu kalipe valape valapu
manasaara piliche pilupe pilupu
manuvulu kalipe valape valapu
valapu leni paruvapu sayyaatalu
valapu leni paruvapu sayyaatalu
selayeti kerataala nurugula mootalu

kanniyanudikincha tagunaa bhramaraa
annemu punnemu erugani kaluvala
kanniyanudikincha tagunaa 

సీతారామ కళ్యాణం--1961














సంగీతం::గాలిపెంచెల నరసింహారావు
రచన::సముద్రాల రాఘవాచార్య 
గానం::P.లీల
తారాగణం::N.T.రామారావు,B.సరోజాదేవి,గుమ్మడి,నాగయ్య,కాంతారావు,గీతాంజలి,హరనాధ్

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను
మురిపాలు వెలబోయు భామలలోన
మురిపాలు వెలబోయు భామలలోన

సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను

చరణం::1

బంగారు రంగారు మైజిగిలోన
బంగారు రంగారు మైజిగిలోన
పొంగారు వయసూ పొంకములోన
సంగీత నాట్యాల నెైపుణిలోన
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ 
సంగీత నాట్యాల నెైపుణిలోన
నా సాటి నెరజాణ కనరాదుగా

సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను

చరణం::2

మగువల నొల్లని మునియైనా..ఆ
మగువల నొల్లని మునియైనా
నా నగుమోమునుగన చేజాచడా
యాగము యోగము దానములన్నీ
యాగము యోగము దానములన్నీ
నా బిగికౌగిలి సుఖమునకేగా

సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను