Wednesday, May 27, 2015

ఘర్షణ--1988



సంగీతం::ఇళయరాజా 
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు, K.S.చిత్ర 
తారాగణం::ప్రభు,కార్తీక్,అమల,నిరోష

పల్లవి::

నీవే అమర స్వరమే..సాగే శ్రుతిని నేనే
నీ మనసు నీ మమత..వెలిసేనే నా కోసం
నీలో సర్వం...నా సొంతం
నీవే అమర స్వరమే..సాగే శ్రుతిని నేనే

చరణం::1

పలికే నీ అధరాలు..చిలికేనే మధురాలు
నింగి వీడి నేల జారిన..జాబిలి
మురిసే నీలో అందం..కురిసే ఊహల గంధం
మల్లె పూల..బంధమీవు ఓ చెలి
అంతులేనిదీ కథ..అందరాని సంపద
రాగ బంధనం..అనురాగ చందనం
అంతులేనిదీ కథ..అందరాని సంపద
రాగ బంధనం..అనురాగ చందనం
నా ధ్యాసలు నీవే..నీ బాసలు నేనే
నా ఊహలు నీవే..నీ ఊపిరి నేనే
నీలో సర్వం..నా సొంతం 
నీవే అమర స్వరమే..సాగే శ్రుతిని నేనే

చరణం::2

మెరిసే వన్నెల లోకం..చిందే చల్లని గానం
తీయనైన ఆశలన్నీ..నీ వరం
తరగని చెరగని కావ్యం..ఊహలకిది అనుబంధం
భావ రాగ భాష్యమే..ఈ జీవితం
పలకరించు చూపులు..పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరి..ఆలపించెనే
పలకరించు చూపులు..పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరి..ఆలాపించెనే
నూరేళ్ళు నీతో..సాగాలి నేనే
నీ గుండెల్లోనా..నిండాలి నేనే
నీలో సర్వం..నా సొంతం

నీవే అమరస్వరమే..సాగే శ్రుతిని నేనే
నీ మనసు నీ మమత..వేలిసేనే నీకోసం
నీలో సర్వం..నా సొంతం
నీవే అమర స్వరమే..సాగే శ్రుతిని నేనే