Saturday, October 16, 2010

దేశోద్ధారకులు--1973






















సంగీత::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరి
తారాగణం: N.T.రామారావు, వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం, పద్మనాభం

పల్లవి::

ఆ ఆ ఆ ఆ హా..ఆ ఆ ఆ ఓహో
ఏదో తాపం..ఒకటే మైకం
ఇంత అందం..ఏం చేసుకుంటానురా
ఇన్ని సొంపులు..ఎలా దాచుకుంటానురా     
ఇంత అందం..ఏం చేసుకుంటానురా
ఇన్ని సొంపులు..ఎలా దాచుకుంటానురా     
ఏదో తాపం..హా..ఒకటే మైకం

చరణం::1

ఒళ్ళు విరుపు ఆవులింత..తెలుసుకోరా ఎందుకో
ఉలికిబాటు మిడిసిపాటు వద్దురా..నన్నందుకో 
ఆహా..ఒళ్ళు విరుపు ఆవులింత..తెలుసుకోరా ఎందుకో
ఉలికిబాటు మిడిసిపాటు వద్దురా..నన్నందుకో 
ఏదో తాపం..అహ్హా..ఒకటే మైకం

చరణం::2

మొన్న రాతిరి యింతమందిలో..మోమాట పడితివి పాపము
నిన్న రాతిరి నేను నవ్వితే..నీకు పెరిగెను కోపము
మొన్న రాతిరి యింతమందిలో..మోమాట పడితివి పాపము
నిన్న రాతిరి నేను నవ్వితే..నీకు పెరిగెను కోపము
మంచుగదిలో ఒంటికింత కాక ఎందుకు..చెప్పరా
మంచుగదిలో ఒంటికింత కాక ఎందుకు..చెప్పరా 
హ్హా..లంచమిస్తా మమతలన్నీ మనసు నాతో..విప్పరా 
అబ్భా..ఏదో తాపం..ఒకటే మైకం
ఇంత అందం..ఏం చేసుకుంటానురా..ఆ
ఇన్ని సొంపులు..ఎలా దాచుకుంటానురా     
ఏదో తాపం..మ్మ్..హు..ఒకటే మైకం
హ్హా హ్హా హ్హా హ్హా హ్హా