Monday, March 04, 2013

పరమానందయ్య శిష్యుల కథ--1966







సంగీతం::ఘంటసాల గారు
రచన::వెంపటి సదాశివ బ్రహ్మం గారు
గానం::ఘంటసాల గారు , S.జానకి గారు

పల్లవి::

ఎనలేని ఆనందమీరేయి 
మనకింక రాబోదు ఈ హాయి
ఎనలేని ఆనందమీరేయి 
మనకింక రాబోదు ఈ హాయి

చరణం::1

మురిపించనా ప్రేమ కురిపించనా
నా కౌగిటిలో నిన్ను కరిగించనా 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 
మురిపించనా ప్రేమ కురిపించనా
నా కౌగిటిలో నిన్ను కరిగించనా

మురిపించి నీ ప్రేమ కురిపించినా
మురిపించి నీ ప్రేమ కురిపించినా 
పరవశమై ఈ మేను మరచేపోనా

ఎనలేని ఆనంద మీరేయి మనకింక రాబోదు ఈ హాయి

చరణం::2


శృంగారజలధి తరంగాల తేలించి
ఉయ్యాల లూగించి లాలించనా 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 
శృంగారజలధి తరంగాల తేలించి
ఉయ్యాల లూగించి లాలించనా

కనుదోయికే విందు నీ అందము
కనుదోయికే విందు నీ అందము
ప్రేమానురాగాలె ఈ బంధము

హోయ్..ఎనలేని ఆనంద మీరేయి మనకింక రాబోదు ఈ హాయి
ఆ ఆ ఆ ఆ ఆ