Sunday, September 19, 2010

పుట్టినిల్లు మెట్టినిల్లు--1973



























సంగీతం::సత్యం 
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు,L.R.ఈశ్వరి 
తారాగణం::కృష్ణ,శోభన్‌బాబు,సావిత్రి,లక్ష్మి,చంద్రకళ,రమాప్రభ,రాజబాబు,నాగయ్య  

పల్లవి::

జమాలంగిడీ జంకా..బొగ్గుల్లో రామచిలకా 
జమాలంగిడీ జంకా..బొగ్గుల్లో రామచిలకా
నిను చూస్తేనే చెడ్డ కాక..అరె..ఛీఛీ..పోవే నోరెత్తక..ఛీ 

చరణం::1

నే చేసిన పాపం ఏంది..నా మీద కోపం ఏంది 
నే చేసిన పాపం ఏంది..నా మీద కోపం ఏంది 
తాళికట్టిన పెళ్లాన్ని..నువ్వు తిట్టినాసరే నీదాన్ని
జమాలంగిడీ జంకా..అసలైన రామచిలకా
జమాలంగిడీ జంకా..అసలైన రామచిలకా 
ఎందుకయ్యా ఇంతకాక..హ్హా
ఓయ్..అమ్మ బాబో తిట్టమాక 

చరణం::2

మొఖమ్మీద రుద్దుకోవు..పౌడరైనా  
లిప్ స్టిక్ దిద్దుకోవు..పెదవులపైన
ఇది శుద్ద నాటు సరుకు..ఇంకొద్దు బాబు నాకు 
నా ఖర్మకొద్ది దొరికావే కొరివి దెయ్యమా..పో పోవే 
ఒరేయ్ జంబలకర పంబ..హా..మామా రక్షింపుము రక్షింపుము  
జంబలకర పంబ..అరె..పలుకుతుంది అంబ 
జంబలకర పంబ..అరె..పలుకుతుంది అంబ 
ఏందిరయ్య..యీ..గోల..ఆ..కాస్త సర్దుకుంటే మేలు చాల

చరణం::3

ఈ మొద్దు రాచిప్పతోటి..ఎలా కాపరం
ముద్దూ ముచ్చట సరదా..ఏలా తీరడం 
మొద్దు..నా..ఆ..సుద్ద మొద్దునా
అవును..ఆ..చెప్పవా మనసు విప్పవా 
ఛీ..ఈ మొద్దు రాచిప్పతో ఎలా కాపరం
ముద్దూ ముచ్చట సరదా..ఏలా తీరడం 
గౌనేసుకున్నదాన్ని..దొరసాని పోజుదాన్ని 
గౌనేసుకున్నదాన్ని..దొరసాని పోజుదాన్ని 
నే కోరి తెచ్చుకుంటా..దీన్నసలు వదులుకుంటా 
జమాలంగిడీ జంకా..బొగ్గుల్లో రామచిలకా 
నిను చూస్తేనే చెడ్డ కాక..ఛీ..అరే..ఛీ..పోవే నోరెత్తక 

చరణం::4

ఒరే..కొడకా  
మగవాళ్ళఆటలింక..సాగవురా 
పెళ్లి మీద పెళ్ళి..పెద్ద డేంజరురా 
మగవాళ్ళ ఆటలింక..సాగవురా 
ఈ పెళ్లిమీద పెళ్ళి..పెద్ద డేంజరురా
ఆ పప్పులిప్పుడుడకవురా..పైన కోర్టులున్నవిరా 
పప్పులిప్పుడుడకవురా..పైన కోర్టులున్నవిరా 
రాజమండ్రి జైలు నీకు..రాసిపెట్టి వుందిరా 
జంబలకర పంబ..అరె పలుకుతుంది అంబ 
జంబలకర పంబ..అరె పలుకుతుంది అంబ 
ఏందిరయ్య యీ గోల..కాస్త సర్దుకుంటే మేలు చాల..హేయ్ 

పుట్టినిల్లు మెట్టినిల్లు--1973






















సంగీతం::సత్యం 
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,శోభన్‌బాబు,సావిత్రి,లక్ష్మి,చంద్రకళ,రమాప్రభ,రాజబాబు,నాగయ్య  

పల్లవి::

చిన్నారి కన్నయ్యా..నా ఆశ నీవయ్యా 
తొలగాలి..మా..కలతలు
నీవే కలపాలీ..మా మనసులు 

చిన్నారి కన్నయ్యా..నా ఆశ నీవయ్యా 
తొలగాలి..మా..కలతలు
నీవే కలపాలీ..మా మనసులు 

చరణం::1

మెట్టినింట నిందలపాలై..పుట్టి నింట చేరాను  
మెట్టినింట నిందలపాలై..పుట్టి నింట చేరాను  
కట్టుకున్న పతికే బరువై..కన్నీరై కరిగేను 
యెంత కాలమో...యీ వియోగము
ఇంతేనా ఈ జీవితం బాబూ..పంతాలా పాలాయెనా

చిన్నారి కన్నయ్యా..నా ఆశ నీవయ్యా 
తొలగాలి..మా..ఆ..కలతలు
నీవే కలపాలీ..మా మనసులు 

చరణం::2

రామయ్యకు దూరమైన..సీతలాగ వున్నాను 
రామయ్యకు దూరమైన..సీతలాగ వున్నాను 
చిక్కు ప్రశ్నలెన్నోవేసి..చిక్కులలో చిక్కాను 
బోసి నవ్వుతో..బుంగ మూతితో మార్చాలీ 
మీ మామను బాబూ..చేర్చాలి మీ నాన్నను

చిన్నారి కన్నయ్యా..నా ఆశ నీవయ్యా 
తొలగాలి..మా..కలతలు
నీవే కలపాలీ..మా మనసులు 

పుట్టినిల్లు మెట్టినిల్లు--1973


























సంగీతం::సత్యం 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::కృష్ణ,శోభన్‌బాబు,సావిత్రి,లక్ష్మి,చంద్రకళ,రమాప్రభ,రాజబాబు,నాగయ్య  

పల్లవి::

ఓహో..ఓహో..అహా,,అహా..ఏహేయ్ 

ఆహా బోల్తా పడ్డావు..బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా
ఆహా..బోల్తా పడ్డావు బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా
ఏమి సిగ్గా..కందె బుగ్గా..
తుళ్ళి..పడకోయ్ మల్లెమొగ్గా
బోల్తా పడ్డావు..బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా

చరణం::1

యేటుగాడి వనుకున్నా..వోరబ్బా 
కన్నెజింక చేత తిన్నావు..దెబ్బ 
కోప మొద్దూ..ఊ..తాప.మొద్దూ 
ఉన్న మాటే..ఏ..ఉలక వద్దూ 
బోల్తా పడ్డావు..బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా  
ఓహో..బోల్తా పడ్డావు..బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా

చరణం::2

సరదాగా అన్నాను..చిన్నోడా 
కలకాలం కావాలి..నీ నీడ 
హో..సరదాగా అన్నాను చిన్నోడా 
కలకాలం కావాలి..నీ నీడ 
కలుపు చేయీ..కలుగు హాయీ 
పోరు నష్టం..పొందు లాభం
బోల్తా పడ్డావు..బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా 
ఓహో..బోల్తా పడ్డావు..బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా
ఏమి సిగ్గా..ఆ..కందె బుగ్గా..ఆ
తుళ్ళి పడకోయ్..ఈ..మల్లెమొగ్గా

పంజరంలో పసిపాప--1973















సంగీతం::S.హనుమంతరావు 
రచన::కోట సత్యరంగయ్యశాస్త్రి
గానం::B.వసంత
తారాగణం::రామకృష్ణ,నాగయ్య,జ్యోతిలక్ష్మి,రాజనాల,త్యాగరాజు,మీనాకుమారి  

పల్లవి::

శ్రీ వెంకటేశా దేవా..ఆఆ
కరుణించి కాపాడరావా..ఆఆ 
కరుణించి కాపాడరావా..ఆఆ 
శ్రీ వెంకటేశా దేవా 
కరుణించి కాపాడరావా..ఆఆఆఆ 
కరుణించి కాపాడరావా..ఆఆ 
శ్రీ వెంకటేశా దేవా 
కరుణించి కాపాడరావా..ఆఆఆఆ 
కరుణించి కాపాడరావా

చరణం::1

అమ్మవు నీవే..నాన్నవు నీవే 
నీవే నా దేవుడవని..అమ్మచెప్పెను
అమ్మవు నీవే..నాన్నవు నీవే 
నీవే నా దేవుడవని..అమ్మచెప్పెను
నీవు తప్ప దిక్కెవ్వరు..వేరేలేరు తండ్రి..ఈ  
నీవు తప్ప దిక్కెవ్వరు..వేరేలేరు తండ్రి..ఈ 
చల్లని దయచూచి నన్ను..ఏలుకొనుముస్వామి

శ్రీ వెంకటేశా దేవా 
కరుణించి కాపాడరావా..ఆఆఆఆ  
కరుణించి కాపాడరావా

చరణం::2

అమ్మా..ఆఆఆఆఆ
పసిపాపను అయ్యయ్యో..పంజరాన పట్టుబడితి 
అడుగడుగున ఆపదలలో..చిక్కుకుంటిని
పసిపాపను అయ్యయ్యో..పంజరాన పట్టుబడితి 
అడుగడుగున ఆపదలలో..చిక్కుకుంటిని
గుడిలోనికి నీ చెంతకు చెరుకుంటిని..ఈ 
గుడిలోనికి నీ చెంతకు చెరుకుంటిని..ఈ 
నమ్మితి నీ పాదములను వదలనింక..స్వామి 

శ్రీ వెంకటేశా దేవా 
కరుణించి కాపాడరావా..ఆఆఆఆ  
కరుణించి కాపాడరావా