సంగీతం::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు, P.సుశీల
నటీ,నటులు::NTR,జయచిత్ర
పల్లవి::
మూ..మూ..లాల..లాల..లాల..లాలాలా
ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
చల్లని చిరుగాలీ..నిన్నొక సంగతి అడగాలి
చల్లని చిరుగాలీ..నిన్నొక సంగతి అడగాలి
ఈ రాజునేకొమ్మ..వలచెనో
తన ఎదలోన..ఏ బొమ్మ నిలిచెనో
చల్లని చిరుగాలీ..నీకొక సంగతి తెలుపాలీ
చల్లని చిరుగాలీ..నీకొక సంగతి తెలుపాలీ
మనసైన ఒక కొమ్మ..వలచింది
నాలో మాటాడే బొమ్మ..నిలిచింది
చల్లని చిరుగాలీ..నీకొక సంగతి తెలపాలీ
చరణం::1
కొమ్మ అనగానే..సరిపోతుందా
బొమ్మ అనగానే..అయిపోతుందా
పేరేలేదా దానికీ..ఊరే లేదా
పరువం ఉరుకుతుంది..ఆ పచ్చని మేని వంపులలో
బిడియం తొణుకుతుంది..ఆ అడుగులు సాగనీ నడకలలో
ఎవరనుకున్నావు..ఆ బొమ్మా
రవ్వల అందాల..వన రాచగుమ్మా
చల్లని చిరుగాలీ..నిన్నొక సంగతి అడగాలి
చరణం::2
కబురులతోనే..సరిపోయిందా
కవిత లల్లితే..అయిపోయిందా
కన్నియ మనసే..కాస్తా కనుగొన్నావా
ఉదయం..పొంగుతుందీ
ఆ సుధకి..ధరహాస కిరణాలలో
హృదయం..పలుకుతుందీ
ఆ ముదిత..మూగ నయనాలలో
ఎప్పుడో ఎప్పుడో..ఈ నేను
ఆ యదనాగలో..వొదిగిపోయాను
చల్లని చిరుగాలీ
నీకొక సంగతి తెలపాలీ
ఈ రాజు వలచిన కొమ్మా
నా యదలోని ఈ పైడి బొమ్మా
చల్లని చిరుగాలీ ఆహ ఆ ఆహ
ఆహ ఆహ ఆ ఓహో ఓహో
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్