Tuesday, September 06, 2011

శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ--1966::కీరవాణి::రాగం





















సంగీతం::పెండ్యాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::S.జానకి
కీరవాణి::రాగం 

వల్లభా..ఆ..ఆ..ఆ..ప్రియ వల్లభా
వల్లభా..ఆ..ఆ..ఆ..ప్రియ వల్లభా
నాలో వలెనే నీలోనూ..జిలిబిలి ఊహలు సాగేనా
కలవరములు చెలరేగేనా..ఆ..ఆ..ఆ..ఆ

వల్లభా..ఆ..ఆ..ఆ..ప్రియ వల్లభా

అపుడే విరిసిన పూవులలో..ఒ..ఒ..ఒ..
అపుదే విరిసిన పూవులలో..గుప్పుమనే పరిమళమువలే
బుగ్గలకావిరి తగిలేలా..సిగ్గులుసెగలై చెలగేనా..ఆ..ఆ..ఆ..

వల్లభా..ఆ..ఆ..ఆ..ప్రియ వల్లభా

చంద్రుని చూసిన సంద్రములో..ఓ..ఓ..ఓ..
చంద్రుని చూసిన సంద్రములో
సందడి చేసే అలలవలే..కొల్లగ మమతలు మొంచేనా
చల్లగ వలపులు వీచేనా..ఆ..ఆ..ఆ

వల్లభా..ఆ..ఆ..ఆ..ప్రియ వల్లభా
వల్లభా..ఆ..ఆ..ఆ..ప్రియ వల్లభా
నాలో వలెనే నీలోనూ..జిలిబిలి ఊహలు సాగేనా
కలవరములు చెలరేగేనా..ఆ..ఆ..ఆ..ఆ
వల్లభా..ఆ..ఆ..ఆ..

మహాబలుడు--1969




సంగీతం::కోదండపాణి
రచన::ఆరుద్ర
గానం::SP.బాలు P.సుశీల

ఓ..ఓ..విశాల గగనంలో చందమామా
ప్రశాంత సమయంలో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా..ఆ..ఆ

ఓ..ఓ..విశాల గగనంలో చందమామా
ప్రశాంత సమయంలో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా..ఆ..ఆ

వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవీ
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి
వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవీ
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి
వొలికే మధువు..కొసరే వధువు..రెండూ..నీవే..

ఓ..ఓ..విశాల గగనంలో చందమామా
ప్రశాంత సమయంలో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా..ఆ..ఆ

చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే
నా చక్కదనం దొరలాగ ఏలుతావులే
చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే
నా చక్కదనం దొరలాగ ఏలుతావులే
తీరే..తనివి మీరే అలవి..ఏదో..గారడీ

ఓ..ఓ..విశాల గగనంలో చందమామా
ప్రశాంత సమయంలో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా..ఆ..ఆ

ఓ..ఓ..విశాల గగనంలో చందమామా
ప్రశాంత సమయంలో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా..ఆ..ఆ

తల్లా పెళ్ళామా ?--1969


సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

ఓ..బంగారు గూటిలోని చిలుక
పేదముంగిట్లో వాలానని ఉలుకా
ఓ..బంగారు గూటిలోని చిలుక
పేదముంగిట్లో వాలానని ఉలుకా

ఓ..DON'T BE SILLY

ఓ..వగలొలుకు మగసిరి గోరింకా
తానై రా చిలుక వచ్చిందని కేరింత
ఓ..వగలొలుకు మగసిరి గోరింకా
తానై రా చిలుక వచ్చిందని కేరింత

పవళించగ పూల పానుపు లేదూ
తలవూనగ పట్టు తలగడయే లేదు
జలకలాడగ పన్నీరు లేదు
జలకలాడగ పన్నీరు లేదు
పరిచర్యలు చేయ చెలులైన లేరు
ఓ..బంగారు గూటిలోని చిలుక పేదముంగిట్లో వాలానని ఉలుకా

SWEETNESS OF THE ROSES..BRIGHTNESS OF THE SKY
SMILE IN THE MOON LIGHT..THRILL OF MY LIFE


మెత్తని నీమది విరిపాంపుకాదా
వెచ్చని కైదండ నా అండలేదా
మెత్తని నీమది విరిపాంపుకాదా
వెచ్చని కైదండ నా అండలేదా
కురిసే వెన్నెల పన్నీరుకాదా
కురిసే వెన్నెల పన్నీరుకాదా
కొండంత నీవుండ కోరిక లేలా

ఓ..వగలొలుకు మగసిరి గోరింకా
తానై రా చిలుక వచ్చిందని కేరింత
ఓ..బంగారు గూటిలోని చిలుక
పేదముంగిట్లో వాలానని ఉలుకా

మంచి-చెడు--1963



సంగీతం::M.S.విశ్వనాధం-రామమూర్తి
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల

Film Directed By::T.R.Ramanna
తారాగణం::N.T.రామారావు,B.సరోజాదేవి,నాగభూషణం,పద్మనాభం


పల్లవి::

పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం

కడలిపొంగెను నాకోసం..తల్లిఒడినే పరచెను నాకోసం
పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం

పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం
కడలిపొంగెను నాకోసం..తల్లిఒడినే పరచెను నాకోసం
పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం

పెను చీకటి తొలిగెనులే..నేడు వెలుగై వెలుగునులే
నవ్యజీవిత ప్రాభాతం..నన్నే రమ్మని పిలిచెనులే
నవ్యజీవిత ప్రాభాతం..నన్నే రమ్మని పిలిచెనులే
పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం

ఉదయ భానుని కాంతులలో..గఘనమలిదిన రంగులలో
విశ్వశించిని కన్నానూ..వింటావా అనిని విన్నాను
విశ్వశించిని కన్నానూ..వింటావా అనిని విన్నాను
పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం

జగతి సఖలం నాదైనా..బ్రతుకు పూవు బాటైనా
తల్లిమనసే గుడినాకూ..తల్లిసేవే గురినాకూ
తల్లిమనసే గుడినాకూ..తల్లిసేవే గురినాకూ

పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం
కడలిపొంగెను నాకోసం..తల్లిఒడినే పరచెను నాకోసం
పుడమి పుట్టెను నాకోసం..పూలు పూచెను నాకోసం

మంచి-చెడు--1963



సంగీతం::M.S.విశ్వనాధన్ - రామ్మూర్తి
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల

Film Directed By::T.R.Ramanna
తారాగణం::N.T.రామారావు,B.సరోజాదేవి,నాగభూషణం,పద్మనాభం


పల్లవి::

ఈ ఆలస్యానికి కారణ మేమంటే
ఈ ఊరికి వస్తుండగ దారిలో ఒక దోంగ
తన అనుచరులతో నన్ను అడ్డగించాడు
కాని ఆ దోంగ ఎవరు? ఎందుకొచ్చాడు?
అనేది వివరంగా చెపుతాను

తోడు నీడ ఎవరులేని ఒంటరి..
వాడు లోకమనే పాఠశాల చదువరీ
చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ
వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ

తోడు నీడ ఎవరులేని ఒంటరి..
వాడు లోకమనే పాఠశాల చదువరీ
తోడు నీడ ఎవరులేని ఒంటరి..
వాడు లోకమనే పాఠశాల చదువరీ
చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ
వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ
చిత్తమున మెత్తదనం కలదుమరీ

కన్నె సొమ్ము దోచుకొనే చోరుడు
కన్నతల్లి అనే మాటవినీ కట్టుబడు
కన్నె సొమ్ము దోచుకొనే చోరుడు
కన్నతల్లి అనే మాటవినీ కట్టుబడు
ఉన్నదంత యిచ్చి ఊరడించునూ
తానె ఊరుచేరువరకు తోడువచ్చును
ఊరు చేరువరకు తోడు వచ్చును

తోడు నీడ ఎవరులేని ఒంటరి..
వాడు లోకమనే పాఠశాల చదువరీ
లోకమనే పాఠశాల చదువరీ

ఆకలైన పులిలాగే ఉరుకును
కాని మచ్చికతో మనసు నిచ్చివేయును
కళా హృదయమున్న మేలి రసికుడు
సదా కనులలోనే కదలాడే యువకుడు
కనులలోనే కదలాడే యువకుడు

తోడు నీడ ఎవరులేని ఒంటరి..
వాడు లోకమనే పాఠశాల చదువరీ
లోకమనే పాఠశాల చదువరీ

రేపు వాని మనసు మారవచ్చును
వాడు మాపుమాని పగలు తిరగవచ్చును
తల్లిమనసు చల్లదనం తెలియును
వాని ఉల్లమున ప్రేమ మధువు ఒలుకును
ఉల్లమున ప్రేమ మధువు ఒలుకును

తోడు నీడ ఎవరులేని ఒంటరి..
వాడు లోకమనే పాఠశాల చదువరీ
లోకమనే పాఠశాల చదువరీ
చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ
వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ
చిత్తమున మెత్తదనం కలదుమరీ

ఊరు దోచు పెద్దమనిషి వచ్చెను
తనకు నోరుకలదు కనుక గోల చేసేను
కరుణలేని కటికరాయి రూపము
దోంగ వీనికన్న మేలటన్న సత్యము
వీనికన్న మేలటన్న సత్యము