సంగీతం::K.V. మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::కృష్ణ,గుమ్మడి,ప్రభాకరారెడ్డి,గిరిబాబు,శారద,కాంచన, జయమాలిని,పద్మనాభం
పల్లవి::
ఇది మైకమా..ఆ..ఆ..బింకమా..ఇదే ఇదే నీకు అందమా

ఇది స్వప్నమా..ఆ..సత్యమా..ఇదే ఇదే పూర్వపుణ్యమా

చరణం::1
పూలదండకే ఇంత పులకరింతా
చల్లగాలికే ఇంత జలదరింతా
పూలదండకే ఇంత పులకరింతా
చల్లగాలికే ఇంత జలదరింతా
కళ్ళు తెరుచుకున్నా..కలవరింతా
కళ్ళు తెరుచుకున్నా..కలవరింతా
కలలు రాకపోయినా పలవరింత
ఇది మైకమా..ఆ..ఆ..బింకమా..ఇదే ఇదే నీకు అందమా
ఇది స్వప్నమా..ఆ..సత్యమా..ఇదే ఇదే పూర్వపుణ్యమా
చరణం::2
పరిచింది నీ నవ్వు పాలపుంత
పాకింది బుగ్గలలో జేవురింతా
పరిచింది నీ నవ్వు పాలపుంత
పాకింది బుగ్గలలో జేవురింతా...ఆ
కాచుకుంది ఒంటరిగా కౌగిలింతా..ఆ
కాచుకుంది ఒంటరిగా కౌగిలింతా..ఆ
కానుక ఇస్తుంది కన్నెవయసునంతా
ఇది మైకమా..ఆ..ఆ..బింకమా..ఇదే ఇదే నీకు అందమా
ఇది స్వప్నమా..ఆ..సత్యమా..ఇదే ఇదే పూర్వపుణ్యమా
చరణం::3
నా చూపే వస్తుంది నీ వెంట
నీ రూపే ఉంటుంది నా చెంత
నా చూపే వస్తుంది నీ వెంట
నీ రూపే ఉంటుంది నా చెంత
నీతోనే నిండింది హృదయమంతా..ఆ
నీతోనే నిండింది హృదయమంతా
నాతోడై ఉండాలి కాలమంతా