Friday, May 10, 2013

కొత్త జీవితాలు--1980


























సంగీతం::ఇళయరాజా
రచన::సినారె
గానం::S.జానకి, P.సుశీల

పల్లవి:

తననం..తననం..తననం..తననం..త
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తం..తననం..తననం..తననం..తననం
తం తన నంతన తాళంలో..రస రాగంలో
మృదునాదంలో..నవ జీవన భావన పలికెనులే
తం తన నంతన తాళంలో..రస రాగంలో
మృదునాదంలో..నవ జీవన భావన పలికెనులే

నవ భావనయే సుమ మోహనమై
ఆపై వలపై పిలుపై కళలోలుకగ
తం తన నంతన తాళంలో..మృదునాదంలో
నవ జీవన భావన పలికెనులే

చరణం::1

తనన తని నననని నననని తనన
తని నననని నననని తనన
తని నననని నననని తనన..తనన తనన

ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే
మది దోచెనులే...మరు మల్లెలు సైగలు చేసెనులే
ఆ..ఆ..ఆ..ఆ
ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే
మది దోచెనులే..మరు మల్లెలు సైగలు చేసెనులే

కన్నియ ఊహలు వెన్నెలలై..కదలే కదలే విరి ఊయలలై
పున్నమి వేసిన ముగ్గులలో..కన్నులు దాటిన సిగ్గులలో
తేనెలకందని తీయని కోరికలే..చిరు మరులని చిలుకగ

తం తన నంతన తాళంలో..రసరాగంలో మృదునాదంలో
నవ జీవన భావన పలికెనులే

చరణం::2

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
పొంచిన మదనుడు పువ్వుల బాణం..నాటెనులే..ఎద మీటెనులే
పులకింతలు హద్దులు దాటెనులే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
పొంచిన మదనుడు పువ్వుల బాణం..నాటెనులే..ఎద మీటెనులే
పులకింతలు హద్దులు దాటెనులే

మ్రోగెను పరువం రాగిణియై..మురిసే మురిసే చెలి మోహినియై
వన్నెల తుంటల పందిరిలో..వెన్నెల రాయని కౌగిలిలో
ఇద్దరి పెదవుల ముద్దుల అల్లికలే..మృదుమధురిమలోలుకగ

తం తన నంతన తాళంలో..రస రాగంలో మృదునాదంలో
నవ జీవన భావన పలికెనులే
నవ భావనయే సుమమోహనమై
ఆపై వలపై పిలుపై కళలొలుకగ
తం తననం తననం తననం తననం తననం


Kotta Jeevitaalu--1980
Music::iLayaraajaa
Lyrics::Sinaare
Singer's::jaanaki, suSeela


Tananam..Tananam..Tananam..Tananam..ta
aa..aa..aa..aa..aa..aa..aa..aa



tam..tananam..tananam..tananam..tananam
tam tana namtana taalamlo..rasa raagamlo
mrdunaadamlo..nava jeevana bhaavana palikenulae
tam tana namtana taalamlo..rasa raagamlo
mrdunaadamlo..nava jeevana bhaavana palikenulae

nava bhaavanayae suma mohanamai
aapai valapai pilupai kalalolukaga
tam tana namtana taaLamlo..mrdunaadamlo
nava jeevana bhaavana palikenulae

::1

tanana tani nananani nananani tanana
tani nananani nananani tanana
tani nananani nananani tanana..tanana tanana

ullamu jhallana allari temmera veechenulae
madi dochenulae...maru mallelu saigalu chaesenulae
aa..aa..aa..aa
ullamu jhallana allari temmera veechenulae
madi dochenulae..maru mallelu saigalu chaesenulae

kanniya oohalu vennelalai..kadalae kadalae viri ooyalalai
punnami vaesina muggulalo..kannulu daaTina siggulalo
taenelakamdani teeyani korikalae..chiru marulani chilukaga

tam tana namtana taalamlo..rasaraagamlo mrdunaadamlo
nava jeevana bhaavana palikenulae

::2

aa..aa..aa..aa..aa..aa..
pomchina madanudu puvvula baanam..naatenulae..eda meetenulae
pulakimtalu haddulu daatenulae
aa..aa..aa..aa..aa..
pomchina madanudu puvvula baanam..naatenulae..eda meetenulae
pulakimtalu haddulu daatenulae

mrogenu paruvam raaginiyai..murisae murisae cheli mohiniyai
vannela tumtala pamdirilo..vennela raayani kaugililo
iddari pedavula muddula allikalae..mrdumadhurimalolukaga

tam tana namtana taaLamlo..rasa raagamlo mrdunaadamlo
nava jeevana bhaavana palikenulae
nava bhaavanayae sumamohanamai
aapai valapai pilupai kaLalolukaga
tam tananam tananam tananam tananam tananam


బంగారు మనిషి--1976



సంగీతం::K.V.మహాదేవన్
రచన::కోసరాజురాఘవయ్య
గానం::S.P.బాలు 
తారాగణం::N.T. రామారావు,లక్ష్మి,అల్లు రామలింగయ్య,ప్రభాకరరెడ్డి,పండరీబాయి,రాజబాబు,రమాప్రభ.

పల్లవి::

వాడికేమి తెలుసురా వంకాయ పులుసూ
హూ ఈ గొట్టాం గాడికేం తెలుసు గోంగూర పులుసూ
ఒరేయ్‌ నాయనా సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా
సూటిగా సొర్గాన్నీ చూపిస్తారా
చూపిస్తా చూపిస్తా ఇప్పుడే ఇక్కడే చూపిస్తారా
సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా 
సూటిగా సొర్గాన్నీ చూపిస్తారా
చూపిస్తా చూపిస్తా ఇప్పుడే ఇక్కడే చూపిస్తారా

చరణం::1

పదవి మత్తులో ఒకడు ఊగుతుంటాడు
పైసా మత్తులో ఒకడు తూగుతుంటాడు
పదవి మత్తులో ఒకడు ఊగుతుంటాడు
పైసా మత్తులో ఒకడు తూగుతుంటాడు 
పదవి మత్తు కాదురా పైసా మత్తు కాదురా
అన్నిటికీ మించిన గమత్తు చూపిస్తారా 
ఆ గమ్మత్తుతో నిన్నూ నిన్నూ నిన్నూ 
నిన్నూనిన్నూ చిత్తుచేస్తానురా
సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా
సూటిగా సొర్గాన్నీ చూపిస్తారా
చూపిస్తా చూపిస్తా ఇప్పుడే ఇక్కడే చూపిస్తారా

చరణం::2

పాముకాటుకైతే మంచి మందు వుందిరా
మనిషికాటు కెక్కడా మందులేదురా
పాముకాటుకైతే మంచి మందు వుందిరా
మనిషికాటు కెక్కడా మందులేదురా
తాగినోడు వాగాడని తోశెయ్యకురా రేయ్‌
తాగినోడు వాగాడని తోశెయ్యకురా 
ఉన్నమాట చెబుతున్నా వినుకోండిరా  
దీని మర్మమేమొ రఘురాముడు 
బలభీముడు ఈ దేవుడైనా చెప్పలేడురా 
సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా
సూటిగా సొర్గాన్నీ చూపిస్తారా
చూపిస్తా చూపిస్తా ఇప్పుడే ఇక్కడే చూపిస్తారా

చరణం::3

మస్తాన్‌ మస్తాన్‌ మాపటికి వస్తాన్‌
మస్తాన్‌ మస్తాన్‌ మాపటికి వస్తాన్‌ 
ఈరణ్ణి పేరణ్ణి ఎత్తుకపోతాన్‌
బొక్కలో వాళ్ళను పెట్టేస్తాన్‌ 
కిక్కురు మనకుండ నొక్కేస్తాన్‌
బొక్కెడు నెత్తురు కక్కిస్తాన్‌ అక్కడే గోరీ కట్టిస్తాన్‌ 
ఝణక ఝణక ఝణ ధనక ధనక ధన 
ఝణక ఝణక ఝణ ఝణ్ ఝణ్ ఝణ్ 
ఝణక ఝణక ఝణ ధనక ధనక ధన 
ఝణక ఝణక ఝణ ఝణ్ ఝణ్ ఝణ్ 
ఝణక ఝణక ఝణ ధనక ధనక ధన 
ఝణక ఝణక ఝణ ఝణ్ ఝణ్ ఝణ్ 
ఝణక ఝణక ఝణ ధనక ధనక ధన 
ఝణక ఝణక ఝణ ఝణ్ ఝణ్ ఝణ్ 

బంగారు కుటుంబం--1971


సంగీతం::సత్యం
రచన::వీటూరి
గానం::ఘంటసాల 
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,రాజశ్రీ,రామకృష్ణ,గుమ్మడి,అంజలీదేవి 

పల్లవి::

జీవితాన వరమే బంగారు కుటుంబం
జీవితాన వరమే బంగారు కుటుంబం
మరువరాని మధురమైన అనురాగం కదంబం              
జీవితాన వరమే బంగారు కుటుంబం

చరణం::1

కలసి మెలసి మనసు తెలిసి భార్య మసలగా 
కలసి మెలసి మనసు తెలిసి భార్య మసలగా
పాలకడలి వోలె భాగ్యాలు పొంగగా
పాలకడలి వోలె భాగ్యాలు పొంగగా
నమ్ముకున్నవారే ఆనంద మందగా
నమ్ముకున్నవారే ఆనంద మందగా
పసిపాపల చిరునవ్వులే..పరిమళాలు చిందగా             
జీవితాన వరమే బంగారు కుటుంబం
మరువరాని మధురమైన అనురాగం కదంబం              
జీవితాన వరమే బంగారు కుటుంబం

చరణం::2

ఆలూ మగలే అనురాగ జీవులైనా
వెరపేలేదు సంసార సాగరానా
కలిమి లేములలో కలతలెన్ని కలిగినా
కలిమి లేములలో కలతలెన్ని కలిగినా
చెదిరిపోని కాపురమే భగవానుని దీవెనా                  
జీవితాన వరమే బంగారు కుటుంబం
మరువరాని మధురమైన అనురాగం కదంబం              
జీవితాన వరమే బంగారు కుటుంబం

పట్టిందల్లా బంగారం--1971


సంగీతం::ఘటసాల గారు
రచన::దాశరథి
గానం::S.జానకి
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ ,సత్యనారాయణ,బేబిశ్రీదేవి,సాక్షి రంగారావు,G.ఇందిర.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దీవానా ఆయా హై..మస్తానా ఆయా హై
దిల్ లేనే ఆయా హై..ఏఏఏఏఏఏఏఏ  
దీవానా ఆయా హై..మస్తానా ఆయా హై
దిల్ లేనే ఆయా హై..ఏఏఏఏఏఏ 
దీవానా ఆయా హై..ఏఏ

చరణం::1

చేతిలో..ఓ..మధువుంది..చెంతనే చెలివుందీ..ఈ 
అనుభవించగలవారికి..అంతులేని సుఖముంది 
సుఖముందీ..ఈ..స్వర్గసుఖముందీ..ఆఆఆ  
ముద్దుల ఈ వేళ..హద్దులు నీకేలా
ముద్దుల ఈ వేళ..హద్దులు నీకేలా 
చక్కని చెలికాడా..పక్కకు రావేలా
చక్కని చెలికాడా..పక్కకు రావేలా 
అందమంతా విందు పొందగా..ఆఆ  
దీవానా ఆయా హై..మస్తానా ఆయా హై
దిల్ లేనే ఆయా హై..ఏఏఏఏఏఏఏఏఏ 
దీవానా ఆయా హై..ఏఏ 

చరణం::2

తీరని కోరికలు..తీరే సమయమిదీ..ఈ..ఆఆ 
కలియని హృదయాలూ..కలిసే తరుణమిదీ..ఈఈఇ 
కలిసే..ఏఏఏ,,తరుణమిదీ..ఆ ఆ ఆ ఆ ఆ 
ఎందుకు హైరానా..యిది నీ సుల్తానా
ఎందుకు హైరానా..యిది నీ సుల్తానా 
నాలో సొగసంతా..నీకే నజరానా
నాలో సొగసంతా..నీకే నజరానా
వలపులోని నిషా..పొంగగా..ఆఆ    
దీవానా ఆయా హై..మస్తానా ఆయా హై   
దిల్ వాలా ఆయా హై..మత్ వాలా ఆయా హై
దిల్ లేనే ఆయా హై..ఏఏఏఏఏఏఏఏఏ
దీవానా..ఆహా..మస్తానా..ఓహో