Monday, May 06, 2013

పింగళి నాగేంద్రరావు గారి వర్ధంతి



















Rachana Kavita Chakra
ఎందరో మహానుభావుల శీర్షికలో ఇవాళ్టి మన మహామహులు 'పింగళి ' గారు.
వీరి పూర్తి పేరు పింగళి నాగేంద్ర రావు. వీరు, 1901 డిసెంబర్ 29 న శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాంలో జన్మించారు.
చిన్నతనం నుంచీ కృష్ణా జిల్లాలోనే ఉంటూ ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈ కళాశాలలో తొలి విద్యార్థుల బృందంలో నాగేంద్రరావు ఒకరు. మంగినపూడి పురుషోత్తమ శర్మ అనే సుప్రసిద్ధ కవీ, మాధవపెద్ది వెంకట్రామయ్య అనే ప్రఖ్యాత స్టేజీ నటుడు ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళే. ఆంధ్రకంతటికీ గర్వకారణంగా వెలసిన ఆంధ్ర జాతీయ కళాశాల యొక్క తొలి విద్యార్థులలో ఒకడైన కారణం చేత కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మొదలైన వారి పరిచయం లభించింది.
1918లో చదువు పూర్తి చేసి నాగేంద్ర రావు ఖరగ్‌పూర్లోని రైల్వే వర్క్‌షాపు లో అప్రెంటీస్ గా చేరారు.
నాగేంద్ర రావు గారు కాంగ్రెసు సంస్థలో చేరి ఎక్కువ దేశసేవ చేయగలుగుతాడన్నారు.
సబర్మతీలో పదిహేనురోజులున్న తరువాత ఈ నిర్ణయం జరిగింది. నాగేంద్రరావుకు కాంగ్రెసు ఆర్గనైజరు వుద్యోగం, వేతనంతోసహా లభించింది. ఉద్యోగం చేస్తూనే రచనలు చేసేవారు.
తను రచించిన వింధ్యరాణి నాటకం యొక్క విజయం అంతా ఇంతా కాదు. బందరులో డాక్టర్ వి. దుర్గా నాగేశ్వరరావు ఆ నాటకాన్ని డి. వి. సుబ్బారావుతో సహా సినిమాగా తీయటానికి వైజయంతి ఫిలింస్ సంస్థను స్థాపించారు.
ఇది నాగేంద్రరావుకు తొలి సినిమా అనుభవం. భలే పెళ్ళి సినిమాకి పాటలూ, మాటలూ ఆయనవే. ఈ చిత్రంలో డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య, జయంతి గంగన్న, ఇటీవలే పుట్టిల్లు సినిమా తీసి ఉన్న గరికపాటి రాజారావు, సురభి గోవిందరావు కూతుళ్ళూ, తదితరులు నటించారు. అయితే భలే పెళ్ళి నాగేంద్రరావును సినిమా ప్రపంచంలో నిలబెట్టలేకపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో, సినిమాలు తీయటానికి ఫిల్ము కూడా కరువైన ఆ రోజుల్లో మద్రాసు అంతా ఖాళీ అయ్యి సినిమా చిత్రనిర్మాణం బాగా కుంటుపడగా, నాగేంద్రరావు తిరిగి నాటకాలాడించుకోవటానికి బందరు వెళ్ళిపోవలసివచ్చింది.
వింధ్యరాణి చిత్రంగా తయారయ్యే రోజు 1946లో వచ్చింది. జెమిని స్టూడియో సహకారంతో వైజయంతి ఫిలింస్ సంస్థ ఈ చిత్రం తయారు చేయబూనుకున్నది. నాగేంద్రరావు తిరిగి సినిమా రంగానికి వచ్చి సి. పుల్లయ్యగారి పర్యవేక్షణలో వింధ్యరాణి స్క్రిప్టు తయారుచేసాడు.
వింధ్యరాణి తయారవుతున్న సమయంలో నాగేంద్రరావుకు వాహినీ నిర్మాతా, దర్శకుడూ ఐన కె.వి.రెడ్డితో పరిచయం లభించింది. వాహినీ సంస్థ ప్రారంభం నుంచీ ఆ సంస్థలో పని చేస్తూ యోగి వేమనలో కె.వి.రెడ్డికి సహాయదర్శకుడుగా పనిచేసిన కమలాకర కామేశ్వరరావు కూడా బందరు వాసే కావడంతో నాగేంద్రరావును కె.వి.రెడ్డికి పరిచయం చేసాడు. ఈ పరిచయం ఫలితంగా కె. వి. రెడ్డి తాను తీయబోతున్న గుణసుందరికధ సినిమాకి పాటలు మాటలు రాయటానికి నాగేంద్రరావును ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు కె. వి.రెడ్డికీ, నాగేంద్రరావుకూ, ఆంధ్రా సినిమా ప్రేక్షకులకుకూడా లాభించిందని చెప్పాలి. కె.వి.రెడ్డికి మరొక రచయిత హంమతి, కాలమతి వగైరా అరడజను హాస్యపాత్రలను యివ్వగలిగి ఉండడు. దర్శకుడు కె. వి. రెడ్డి కానట్టయితే నాగేంద్రరావు సినిమా రచన భలేపెళ్ళి, వింధ్యరాణికి మించి ఎంతో పైకి వెళ్ళలేక పోయివుండవచ్చు. ఈ ఇద్దరి సమ్మేళంతో తయారైన గుణసుందరి కథ అంతకు పూర్వం ఏ తెలుగుచిత్రమూ ఎరగనంత గొప్పవిజయాన్ని సాధించింది.
గుణసుందరి కథ నిర్మాణం నాటికి వాహినీ స్టూడియో తయారై, విజయావారి నిర్వహణ కిందికి వచ్చింది. వాహినీలో మొట్టమొదటి కాల్షీట్ కూడా గుణసుందరి కథదే. గుణసుందరి కథ పూర్తి అయేలోగా విజయా వారు భవిష్యత్తు చిత్రనిర్మాణం ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏర్పాట్ల ప్రకారం నాగేంద్రరావు, కామేశ్వరరావుగారు మొదలైనవారు విజయాసంస్థలోకి తీసుకోబడ్డారు.
అయితే కె.వి.రెడ్డి విజయావారి ద్వితీయచిత్రం "పాతాళభైరవి" దర్శకత్వం చేయటానికి ఒప్పుకున్నప్పుడు నాగేంద్రరావుకు కె.వి.రెడ్డితో కలిసి పనిచెయ్యటానికి మరొక అవకాశం లభించింది. దీని ఫలితమే పాతాళభైరవి. ఈ సినిమా చాలా విజయవంతంగా నడవటమేగాక చిత్రనిర్మాణంలో గొప్ప ప్రమాణాలను సాధించింది. కనుకనే దీనిని ఇండియాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవంలో ప్రదర్శించటానికి ఎన్నుకున్నారు. పాతాళభైరవిలో సీను, అంజి, డింగరి పాత్రల విజయమూ, నేపాళమాంత్రికుడి పాత్ర యొక్క అపురూపకల్పన, నాగేంద్రరావు ప్రతిభకు తార్కాణాలు.
ఆ తర్వాత నాగేంద్రరావు తనను సినిమాలోకి తీసుకురావటానికి తోడ్పడిన కామేశ్వరరావుతో కలిసి విజయవారి నాలుగో చిత్రం చంద్రహారంకు పనిచేశారు. ఈ చిత్రంలో ధూమకేతు, నిక్షేపరాయడు, "ఎంతచెబితే అంతేగాళ్ళు", బుజ్జాయి, చిన్ని మొదలైనపాత్రలు అంతవరకు సినిమాప్రేక్షకులు చూసిన ఏపాత్రకూ తీసిపోవు. ఇవి ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని ఇవ్వగలవు.
వీరు రచించిన పాటలు అజరామరమే. 1971 మే 6న నాగేంద్ర గారు కన్నుమూశారు.
- కవితాచక్ర గారి సౌజన్యం తో అడ్మిన్స్..

అమ్మరాజీనామా--1991



సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణరావు
గానం::K.J.ఏసుదాస్

పల్లవి::

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ  
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో  

చరణం::1

బొట్టుపెట్టి పూజచేసి
గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోతకోత  
విత్తునాటి చెట్టు పెంచితే 
చెట్టు పెరిగి పళ్ళు పంచితే 
తిన్న తీపి మరచిపోయి చెట్టుకొట్టి కట్టెలమ్మితే
లోకమా ఇది న్యాయమా? 
లోకమా ఇది న్యాయమా?

చరణం::2

ఆకుచాటు పిందె ముద్దు
తల్లిచాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నత ల్లే అడ్డు అడ్డు  
ఉగ్గుపోసి ఊసు నేర్పితే 
చేయిబట్టి నడక నేర్పితే 
పరుగు తీసి పారిపోతే
చేయిమార్చి చిందులేస్తే
లోకమా ఇది న్యాయమా? 
లోకమా ఇది న్యాయమా?