సంగీత::G.K.వెంకటేష్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,నాగభూషణం,పద్మనాభం,కృష్ణంరాజు,అంజలీదేవి,S. వరలక్ష్మి,గీతాంజలి
పల్లవి::
హొయ్..అల్లరి చూపులవాడే..అందాల నా చందూరూడే
హూయ్..అల్లరి చూపులవాడే..అందాల నా చందూరూడే
ఏడున్నడో కాని వాడు..రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే..చిక్కుల్లో పడ్డానే
అల్లరి చూపులవాడే..అందాల నా చందూరూడే
ఏడున్నడో కాని..వాడు రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే..చిక్కుల్లో పడ్డానే
అల్లరి చూపులవాడే..అందాల నా చందూరూడే
అల్లరి చూపులవాడే..వాడే వాడే
అందాల నా చందూరూడే..ఏడే ఏడే
చరణం::1
అందాలన్నీ దోసిట దూసే..నన్నాడే
ఎందుకే అమ్మీ యింతటి సిగ్గని..అన్నాడే
అందాలన్నీ దోసిట దూసే..నన్నాడే
ఎందుకే అమ్మీ యింతటి సిగ్గని..అన్నాడే
కలగా నన్నే కవ్వించాడే..అలలా నాలో పులకించాడే
అమ్మో..ఏ మందునే..సందిటనే చేరగనే సగమైనానే
ఓ..అల్లరి చూపులవాడే అందాల నా చందూరూడే
ఏడున్నడో కాని వాడు..రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే చిక్కుల్లో పడ్డానే
అల్లరి చూపులవాడే..వాడే వాడే
అందాల నా చందూరూడే..ఏడే ఏడే
చరణం::2
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ లలలలలా
మ్మ్ మ్మ్ మ్మ్ హా..మ్మ్ మ్మ్ మ్మ్ హా..లలలలలాలలా..హోయ్
చెయీ చెయీ కలపాలని..అన్నాడే
రేయీ రేయీ కలవాలని..అన్నాడే
చెయీ చెయీ కలపాలని..అన్నాడే
రేయీ రేయీ కలవాలని..అన్నాడే
ఎదలో వాడే..ఎదుగుతున్నాడే
నిదురే కరువై..వేగుతున్నానే
అమ్మో..ఏ మందునే ఓ యమ్మో యీ తాపం ఓపగలేనే
అల్లరి చూపులవాడే..అందాల నా చందూరూడే
ఏడున్నడో కాని వాడు..రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు..చేశాడే
చెక్కిలినీ నొక్కగనే..చిక్కుల్లో పడ్డానే
అల్లరి చూపులవాడే..వాడే వాడే
అందాల నా చందూరూడే..ఏడే ఏడే
ఏడున్నడో కాని వాడు..రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు..చేశాడే
చెక్కిలినీ నొక్కగనే..చిక్కుల్లో పడ్డానే
సంగీత::G.K.వెంకటేష్
రచన::శ్రీశ్రీ
గానం::L.R.ఈశ్వరి,V.రామకృష్ణ
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,నాగభూషణం,పద్మనాభం,కృష్ణంరాజు,అంజలీదేవి,S. వరలక్ష్మి,గీతాంజలి
పల్లవి::
ఈ..వేళలో నా..మనసు నీదే..వయసు నీదే
ఈ..నిషాలూ..ఖుషీలూ నీకేలే
ఈ..వేళలో నా..మనసు నీదే..వయసు నీదే
ఈ..నిషాలూ..ఖుషీలూ నీకేలే
చరణం::1
నే నుంటినీ నీ వెంటనే..హైహై..నీ వుంటివీ నా కంటనే..మ్మ్ హు
నా జీవితం నీ కోసమే..ఓహో..నీ యవ్వనం నా కోసమే
నీ యవ్వనం..మ్మ్..నా కోసమే..ఆ..హాయ్..
ఈ..వేళలో నా..మనసు నీదే..వయసు నీదే
ఈ..నిషాలూ..ఖుషీలూ నీకేలే
చరణం::2
ఆగేది కాదోయి కాలం..లాగాలి లోలోని సారం
ఆగేది కాదోయి కాలం..లాగాలి లోలోని సారం
నేడుంది నీ కేల రేపు..జీవించు ఈ కోంత సేపు
అహా..అహా..అహా..హా..హా..హా..ఆ
ఈ..వేళలో నా..మనసు నీదే..వయసు నీదే
ఈ..నిషాలూ..ఖుషీలూ నీకేలే
చరణం::3
చేరాలి కారామసాలా..వూగాలి వేగాల ఝాలా
చేరాలి కారామసాలా..వూగాలి వేగాల ఝాలా
సాగాలి గానా బజానా..తానాన తందాన తానా
లలాల..లలాల..లలలలాలలా
ఈ..వేళలో నా..మనసు నీదే..వయసు నీదే
ఈ..నిషాలూ..ఖుషీలూ నీకేలే
సంగీత::G.K.వెంకటేష్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,నాగభూషణం,పద్మనాభం,కృష్ణంరాజు,అంజలీదేవి,S. వరలక్ష్మి,గీతాంజలి
పల్లవి::
చేయివేస్తే చాలు చిర్రుమంటాడప్పా..చూపుతోనే నన్నూ జుర్రు కుంటా డప్పా
ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు..బావా..దారికి రావా
చేయివేస్తే చాలు చిర్రుమంటాడప్పా..చూపుతోనే నన్నూ జుర్రు కుంటా డప్పా
ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు..బావా..దారికి రావా
చరణం::1
రామ చిలక జామ పండు కొరికినప్పుడు..ఏమి రుచులు నాలోన కలిగెనప్పుడు
రామ చిలక జామ పండు కొరికినప్పుడు..ఏమి రుచులు నాలోన కలిగెనప్పుడు
చందమామ మొగలు మీద పొడిచినప్పుడు..వయసు ఎన్నిరేకులో విప్పెనప్పుడు
ఏమని చెప్పను ఎలా మనసు విప్పను..నీకు బదులుగా నేనే చెప్పవలసి వచ్చెను
బావా..దారికిరావా
చేయివేస్తే చాలుచిర్రుమంటాడప్పా..చూపుతోనే నన్నూ జుర్రు కుంటా డప్పా
ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు..బావా..దారికిరావా
చరణం::2
గువ్వలాగ కన్నెమనసు ఎగురుతున్నది..నీ గుండెలోని గూటి కొరకు తిరుగుతున్నది
గువ్వలాగ కన్నెమనసు ఎగురుతున్నది..నీ గుండెలోని గూటి కొరకు తిరుగుతున్నది
లేతవలపు జింక లాగ దుముకు తున్నది..నీ కౌగిలిలో నిలుపుకుంటె వొదిగి వుంటది
మేనత్త కూతురిని ! నీ ముద్దు మరదల్ని..మేనత్త కూతురిని నీ ముద్దు మరదల్ని
జతగా నువులేకుంటే బ్రతుకంతా ఒంటరిని బావా..దారికిరావా
చేయివేస్తే చాలు చిర్రుమంటాడప్పా..చూపుతోనే నన్నూ జుర్రు కుంటా డప్పా
ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు..బావా..దారికిరావా