Wednesday, November 23, 2011

అభిమానవంతులు--1973
























సంగీత::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::P.సుశీల,V.రామకృష్ణ  
తారాగణం::S.V.రంగారావు,కృష్ణంరాజు,రాజబాబు, శారద,అంజలీదేవి, రమాప్రభ 

పల్లవి::

ఉయ్యాలా..జంపాలా..ఉయ్యాలా..జంపాలా 
ఊగరా ఊగరా..ఆఆఆఆఆ..హోయ్
ఊగరా ఊగరా...అందాల బాబూ 
కన్నుల్లో కలలెన్నో...కదిలేటి వేళ
ఊగరా ఊగరా..ఉయ్యాలా..జంపాలా..ఆఆ
ఉయ్యాలా..జంపాలా..ఆఆ

చరణం::1

భోగాలు భాగ్యాలు విడిచీ..ఈ..తనవారినందరినీ మరిచీ 
నిరుపేదనగు నన్ను మెచ్చిందిరా..ఆ..మీ అమ్మ నా వెంట వచ్చిందిరా
అలనాడు గౌరి ఆ శివుని కోరి..తనతండ్రి నెదిరించి రాలేదా..ఆ
మగువలకు ఆ తల్లి ఆదర్శమే కాదా..ఆఆ
ఉయ్యాలా..జంపాలా..ఆ..ఉయ్యాలా..జంపాలా

చరణం::2

బంగారు వుయ్యాల లేదురా..నీకు అద్దాల మేడలు లేవురా 
మీ అమ్మ ఒడి నీకు ఉయ్యాలరా మీ నాన్న హృదయమే అద్దాలమేడరా
అనురాగమొలికే పతి చెంతవుంటే..చిరునవ్వు చిలికే పసిపాపవుంటే
ఇల్లాలి కింకేమి కావాలిరా..ఆఆ..ఉయ్యాలా...జంపాలా  
ఊగరా ఊగరా..అందాల బాబూ..కన్నుల్లో కలలెన్నో కదిలేటివేళ
ఊగరా ఊగరా..ఉయ్యాలా..ఆఆ..జంపాలా..ఉయ్యాలా..జంపాలా