Saturday, August 06, 2011

ప్రేమమూర్తులు--1982
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
డైరెక్టర్::A.కోదండ రామిరెడ్డి 
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,లక్ష్మీ,రాధా,మురళిమోహన్. 

పల్లవి::

సిరిసిరి మువ్వల నవ్వు
చెకుముకి రవ్వల వెలుగు
నీ కోసమే సుస్వాగతం అంటున్నవి
వలపుల కథకిది తొలిపలుకు
తొలకరి జల్లుల చిరి చినుకు

సిరిసిరి మువ్వల నవ్వు
చెకుముకి రవ్వల వెలుగు
నీ కోసమే సుస్వాగతం అంటున్నవి 
వలపుల కథకిది తొలి పలుకు 
తొలకరి జల్లుల చిరి చినుకు

చరణం::1

చల్లని మనసే పూచింది
మల్లెల మాలిక కట్టింది
నిను చేరి మెడలో వేసిందీ 

మురిపాల పూలు నీ ఆనవాలు
మురిపాల పూలు నీ ఆనవాలు
మనసేమో మందారం ఇంపైన సంపెంగ వయ్యారం

పూదోటలా విరిబాటలా పయనించుదాం 
కమ్మని కలలు కాపురము చక్కని వలపుల మందిరము

సిరిసిరి మువ్వల నవ్వు
చెకుముకి రవ్వల వెలుగు
నీ కోసమే సుస్వాగతం అంటున్నవి 
వలపుల కథకిది తొలి పలుకు 
తొలకరి జల్లుల చిరి చినుకు

చరణం::2

మోహన మురళి మ్రోగింది
మంజుళ గానం సాగింది
నా మేను నాట్యం మాడిందీ

హృదయాలలోనా కెరటాలు లేచే
హృదయాలలోనా కెరటాలు లేచే
సరిగంగ స్నానాలు సరసాలు జలకాలు ఆడాలి

అనురాగమే ఆనందమై మనసొంతము
అందాలన్నీ హరివిల్లు పూచిన ప్రణయం పొదరిల్లు

సిరిసిరి మువ్వల నవ్వు
చెకుముకి రవ్వల వెలుగు
నీ కోసమే సుస్వాగతం అంటున్నవి 
వలపుల కథకిది తొలి పలుకు 
తొలకరి జల్లుల చిరి చినుకు
ఆహాహా..ఆఆ..లలాలా..

Prema Moortulu--1982 
Music::Chakravarti
Lyrics::Veturi
Director::Kodanda Rami Reddy A.   
Singer's S.P.Baalu,P.Suseela
Cast::SobhanBaabu,Lakshmii,Raadhaa,MuraLiMohan. 

:::

sirisiri muvvala navvu
chekumuki ravvala velugu
nee kOsamE suswaagatam anTunnavi
valapula kathakidi tolipaluku
tolakari jallula chiri chinuku

sirisiri muvvala navvu
chekumuki ravvala velugu
nee kOsamE suswaagatam anTunnavi 
valapula kathakidi toli paluku 
tolakari jallula chiri chinuku

:::1

challani manasE poochindi
mallela maalika kaTTindi
ninu chEri meDalO vEsindii 

muripaala poolu nee Anavaalu
muripaala poolu nee Anavaalu
manasEmO mandaaram impaina sampenga vayyaaram

poodOTalaa viribaaTalaa payaninchudaam 
kammani kalalu kaapuramu chakkani valapula mandiramu

sirisiri muvvala navvu
chekumuki ravvala velugu
nee kOsamE suswaagatam anTunnavi 
valapula kathakidi toli paluku 
tolakari jallula chiri chinuku

:::2

mOhana muraLi mrOgindi
manjuLa gaanam saagindi
naa mEnu naaTyam maaDindii

hRdayaalalOnaa keraTaalu lEchE
hRdayaalalOnaa keraTaalu lEchE
sariganga snaanaalu sarasaalu jalakaalu ADaali

anuraagamE Anandamai manasontamu
andaalannii harivillu poochina praNayam podarillu

sirisiri muvvala navvu
chekumuki ravvala velugu
nee kOsamE suswaagatam anTunnavi 
valapula kathakidi toli paluku 
tolakari jallula chiri chinuku
aahaahaa..aaaaaa..lalaalaa..

ప్రేమమూర్తులు--1982
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
డైరెక్టర్::A.కోదండరామిరెడ్డి    
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,లక్ష్మీ,రాధా,మురళిమోహన్. 

పల్లవి::

మా వారు బంగారు కొండా..ఆ
మా వారు బంగారు కొండా..ఆ
మనసైన అందాల దొంగా..ఆ
పొద్దైనా మాపైనా ఎవరున్నా ఎమన్నా
కనుగీటుతు ఉంటారు నను వదలను అంటారు

మా రాధా బంగారు కొండా..ఆ
మా రాధ బంగారు కొండా..ఆ 
మనసైన అందాల దొంగా..ఆ
కడకొంగున కట్టేసి తనచుట్టు తిప్పేసి
చిలిపిగ ఉడికిస్తుంది కిలకిల నవ్వేస్తుంది

మా వారు బంగారు కొండా..ఆ
మా రాధా బంగారు కొండా..ఆ

చరణం::1

మురిపాలను కలబోసి చిరు ముద్దలు పెడుతుంటే
కొనవేలు కొరికింది ఎవరో?
మలి సంధ్యల జిలుగులను మౌనంగా చూస్తుంటే
అరికాలు గిల్లింది ఎవరో?
నిదురలోన నేనుంటే అదను చూసి ముద్దాడి
ఒదిగిపోయి చూసింది ఎవరో?
ఆ తీయని చెలగాట ఆ తీరని దొంగాట
ఆడింది ఇద్దరము ఔనా!ఆహా

మా వారు బంగారు కొండా..ఆ
మా రాధా బంగారు కొండా..ఆ

చరణం::2

గుబురేసిన చీకట్లో గుబులేదో నటియించి
గుండె మీద వాలిపోలేదా..ఆ
గుడిమెట్టు దిగుతుంటే పడిపోతావంటూ
నా నడుమును పెనవేయలేదా..ఆ
సీమంతం కావాలా శ్రీమతిగారు అంటే
సిగ్గుతో తలవాల్చలేదా..ఆ
ఆ సిగ్గు ఏమందో ఆ మదిలో ఏముందో 
ఆ నాడే తెలుసుకోలేదా..

మా రాధ బంగారు కొండా..ఆ 
మనసైన అందాల దొంగా..ఆ

పొద్దైనా మాపైనా ఎవరున్నా ఎమన్నా
కనుగీటుతు ఉంటారు నను వదలను అంటారు

మా వారు బంగారు కొండా..ఆ
మా రాధా బంగారు కొండా..ఆ

PremaMoortuluu--1982 
Music::Chakravarti
Lyrics::Veturi
Director::Kodanda Rami Reddy A.   
Singer's S.P.Baalu,P.Suseela 
Cast::Sobhanbabu,Lakshmii,Radha,MuraliMohan.

:::

maa vaaru bangaaru konDaa..aa
maa vaaru bangaaru konDaa..aa
manasaina andaala dongaa..aa
poddainaa maapainaa evarunnaa emannaa
kanugeeTutu unTaaru nanu vadalanu anTaaru

maa raadhaa bangaaru konDaa..aa
maa raadha bangaaru konDaa..aa 
manasaina andaala dongaa..aa
kaDakonguna kaTTEsi tanachuTTu tippEsi
chilipiga uDikistundi kilakila navvEstundi

maa vaaru bangaaru konDaa..aa
maa raadhaa bangaaru konDaa..aa

:::1

muripaalanu kalabOsi chiru muddalu peDutunTE
konavElu korikindi evarO?
mali sandhyala jilugulanu mounangaa chUstunTE
arikaalu gillindi evarO?
niduralOna nEnunTE adanu chUsi muddaaDi
odigipOyi chUsindi evarO?
A teeyani chelagaaTa A teerani dongaaTa
ADindi iddaramu ounaa!aahaa

maa vaaru bangaaru konDaa..aa
maa raadhaa bangaaru konDaa..aa

:::2

guburEsina chiikaTlO gubulEdO naTiyinchi
gunDe meeda vaalipOlEdaa..aa
guDimeTTu digutunTE paDipOtaavanTuu
naa naDumunu penavEyalEdaa..aa
seemantam kaavaalaa Sreematigaaru anTE
siggutO talavaalchalEdaa..aa
A siggu EmandO aa madilO EmundO 
A naaDE telusukOlEdaa..

maa raadha bangaaru konDaa..aa 
manasaina andaala dongaa..aa

poddainaa maapainaa evarunnaa emannaa
kanugeeTutu unTaaru nanu vadalanu anTaaru

maa vaaru bangaaru konDaa..aa
maa raadhaa bangaaru konDaa..aa