Monday, August 01, 2011

అభినందన--1988సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు


లాలలాలలా..లాలాలాలలా..
ప్రేమలేదని ప్రేమించరాదని..ప్రేమలేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ..ప్రియా..జోహారులు..
ప్రేమలేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ..ప్రియా..జోహారులు..లాలలాలలా..లాలాలాలలా..

మనసు మాసిపోతే మనిషే కాదని
కటికరాయికైనా కన్నీరుందని
వలపుచిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియపడిన మనసు తలుపుతట్టి చెప్పని
ముసురుగప్పి మూగవోయి నీవుంటివి
ముసురుగప్పి మూగవోయి నీవుంటివి
మోడుబారి నీడతోడు లేకుంటినీ
ప్రేమలేదని..లలలాలలాలలా

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరప లేకపోతే మరణించాలని
తెలిసికూడ చేయలేని వెర్రివాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూచి రోదించనీ
ప్రేమలేదని ప్రేమించరాదని
ప్రేమలేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ..ప్రియా..జోహారులు..

ఖైదీ కన్నయ్య--1962
సంగీతం::రాజన్ నాగేంద్ర 
రచన::G.కృష్ణమూర్తి,
గానం::P. సుశీల, R.రాజశ్రీ
తారాగణం::కాంతారావు, రాజసులోచన, రాజనాల,గుమ్మడి,గిరిజ,రేలంగి, బేబి సావిత్రి

పల్లవి::

తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ
తెలియని చీకటి తొలగించీ
వెలుగిచ్చేది చదువే సూమా మానవద్దూ

చరణం::1

దొంగల చేతికి దొరకనిదీ
దానము చేసిన తరగనిదీ
దొంగల చేతికి దొరకనిదీ
దానము చేసిన తరగనిదీ
పదుగురిలోనా పరువును పెంచీ
పేరు తెచ్చే పెన్నిధదీ

పాఠాలన్నీ చదివేస్తాను
ఫస్టుగ నేను పాసౌతా

శభాష్‌..

తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ

చరణం::2

అల్లరి చేయుట చెల్లనిదీ
ఎల్లప్పు డాడుట కూడనిదీ
అల్లరి చేయుట చెల్లనిదీ
ఎల్లప్పు డాడుట కూడనిదీ
ఏడువరాదు ఏమరరాదు
వీరుని వలెనే నిలవాలీ

బెదరను నేను అదరను నేను
ఏ దెదురైనా ఎదిరిస్తా

శభాష్‌..

తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ

చరణం::3 

బ్రతుకను బాటను కడదాకా
నడిచియె పోవలె ఒంటరిగా
బ్రతుకను బాటను కడదాకా
నడిచియె పోవలె ఒంటరిగా
యిడుములు రానీ పిడుగులు పడనీ
నీ అడుగులు తడబడునా

పిడుగులు పడినా జడవను నేను
వడి వడగానే అడుగేస్తా

శభాష్‌..

తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ

అభినందన--1988


సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు


ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమక్షీరసాగర మథనం
మింగినాను హలాహలం...
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

పేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళని ఈ ఎదలో ముళ్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

నే నోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటినే మరిచేపోయి
మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగ గానం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమక్షీరసాగర మథనం
మింగినాను హలాహలం...
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

అభినందన--1988
సంగీతం::ఇళయరాజ
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా..కనులలో చూడనా

అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా

కొండా కోన గుండెల్లో..ఎండా వానలైనాము
కొండా కోన గుండెల్లో..ఎండా వానలైనాము
గువ్వా గువ్వ కౌగిళ్ళో..గూడుచేసుకున్నాము
అదే స్నేహము..అదే మోహము
అదే స్నేహము..అదే మోహము
ఆది అంతము..ఏదీ లేని గానము

అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా..కనులలో చూడనా

నిన్న రేపు సందెల్లో..నేడై ఉందామన్నావు
నిన్న రేపు సందెల్లో..నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో..పన్నీరవుదామన్నావు
అదే బాసగా..అదే ఆశ గా
అదే బాసగా..అదే ఆశ గా
ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను

అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా

అభినందన--1988::కీరవాణి::రాగం


సంగీతం::ఇళయరాజా
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు


కీరవాణి రాగం

ఎదుటా నీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు..నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే ఎదలోనా నీవే

మరుపే తెలియని నా హృదయం..తెలిసి వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం..తెలిసి వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం

గాయన్నైనా మాననీవు..హృదయాన్నైనా వీడి పోవు
కాలం నాకు సాయం రాదు..మరణం నన్ను చేరనీదు
పిచ్చివాడ్ని కానీదు

అహహ ఒహొహొ ఉహుహుహు

ఎదుటా నీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు..నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే..ఎదలోనా నీవే

కలలకు బయపడి పోయాను..నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
కలలకు బయపడి పోయాను..నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను

స్వప్నాలన్ని క్షణికాలేగా..సత్యాలన్ని నరకాలేగా
స్వప్నం సత్యమయితే వింత..సత్యం స్వప్నమయ్యెదుందా
ప్రేమకింత బలముందా

అహహ ఒహొహొ ఉహుహుహు

ఎదుటా నీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు..నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే..ఎదలోనా నీవే

అభినందన--1988


సంగీతం::ఇళయరాజా
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,S.జానకి


మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో..ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో..ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో..ఓ..ఓ..

నీవు పిలిచే పిలుపులో..జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో..జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో..తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో..తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో..ఏమిటా సొంపులో

మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో..ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో..ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో..ఓ..ఓ..

మొలకసిగ్గు బుగ్గలో..మొదటి ముద్దు ఎప్పుడో
మొలకసిగ్గు బుగ్గలో..మొదటి ముద్దు ఎప్పుడో
మన్మదునితో జన్మవైరం సాగినపుదో
ఆరిపోని తాపము..అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము..అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో

మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో..ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో..ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో..ఓ..ఓ..

శ్రీనివాస కల్యాణం--1987
సంగీతం::K.V.మహదేవన్
రచ::వేటూరి
గానం::S.P.బాలు, P.సుశీల

పల్లవి:

ఎందాక ఎగిరేవమ్మా..ఆ..ఆ..గోరింక..గోరింక
సందే వాలినాక గూటికి చేరుకోక
సందే వాలినాక గూటికి చేరుకోక
ఎందాక ఎగిరేవమ్మా..ఆ..ఆ..గోరింక..గోరింక

జోడుగువ్వ వాకిలి కాసే..నీడలెక్కి చీటకి మూసే
పెందరాలే ఇంటికి చేరు..పెత్తనాలు చాలునింకా

ఎందాక..ఎందాక..ఎగిరేవమ్మా..ఆఆఆ 
గోరింక..అహ..గోరింక

చరణం::1

రాసకార్యమంటూ..నువ్వూ దేశమేలబోతే
వేగుచుక్క వెక్కిరింతలో..కునుకైనా రాదే

మూసుకున్న రెప్పల వెనకే..చూసుకోవే నన్ను
పిల్లగాలి గుస గుస నేనై..జోల పాడుతానూ

ఎందుకులే దోబూచాట..తొందరగా రావేమంట
కోరగానే తీరిపోతే కోరిక..విలువేమిటంట

ఎందాక..ఎందాక..ఎగిరేవమ్మా..ఆఆఆ
గోరింక..అహ..గోరింక
సందే వాలినాక గూటికి చేరుకోక
ఎందాక ఎగిరేవమ్మా..ఆఆఅ 
గోరింక..గోరింక

చరణం::2

ఊసుబోని ఏకాంతంలో..తోసిపోకు నన్ను
తోడులేని కలల బరువుతో..ఈడునీదలేను

దారం నీ చేతిని ఉన్నా..గాలిపఠం నేను
దూరం ఎంతైనా కానీ..నిన్ను వీడిపోను

తీసుకుపో నీతో బాటే..కాదంటే నామీదొట్టే
తీసుకుపో నీతో బాటే..కాదంటే నామీదొట్టే

ఊరించే దూరం ఉంటే..అదో కమ్మదనమేనంట

ఎందాక..ఎందాక ఎగిరేవమ్మా..ఆఆఆ 
గోరింక అహ..గోరింక
సందే వాలినాక..గూటికి చేరుకోక
ఎందాక ఎగిరేవమ్మా..ఆఆఆఆ
అహా..గోరింక..మ్మ్..గోరింక..అహా

శ్రీనివాస కళ్యాణం--1987
సంగీతం::K.V. మహాదేవన్
రచన::వేటూరి 
గానం::S.P.బాలు , S.జానకి

పల్లవి::

ఆహా..ఆఆఆ..ఆహాఆఆఆఆ 
తొలిపొద్దుల్లో హిందోళం..మలిపొద్దుల్లో భూపాళం 
తొలిపొద్దుల్లో హిదోళం..మలిపొద్దుల్లో భూపాళం
తొలిపొద్దుల్లో హిందోళం..మలిపొద్దుల్లో భూపాళం 
తొలిపొద్దుల్లో హిదోళం..మలిపొద్దుల్లో భూపాళం

నేనుగా మారిన నీకోసం..నీడైపోయిన నా ప్రాణం 
నీకే అంకితం నీదే జీవితం..నీకే అంకితం నీదే జీవితం 
తొలిపొద్దుల్లో హిందోళం..మలిపొద్దుల్లో భూపాళం

చరణం::1

పచ్చని దేవత..పలికే చోట 
కుంకుమ పువ్వులు..చిలికే చోట 
తెల్లని మబ్బులు..కురిసే చోటా..ఆ
లోకపు హద్దులు..ముగిసే చోటా 

రెండవ చెవినే పడకుండా..మాట ఇచ్చుకుంటా 
మూడోకంట పడకుండా..ముద్దు ఇచ్చుకుంటా 
రెండవ చెవినే పడకుండా..మాట ఇచ్చుకుంటా 
మూడోకంట పడకుండా..ముద్దు ఇచ్చుకుంటా 

నేనుగా మారిన నీకోసం..నీడైపోయిన నాప్రాణం 
నీకే అంకితం నీదే జీవితం 
తొలిపొద్దుల్లో హిందోళం..మలిపొద్దుల్లో భూపాళం

చరణం::2

కాలం కదలక..నిలిచే చోటా 
కడలే అలలను..మరిచే చోట 
రాతిరి ఎండలు..కాసే చోటా..ఆ 
ప్రేమలు కన్నులు..తెరిచే చోటా

ఆమని కోయిల వినకుండా..పాటలల్లుకుంట 
వెన్నెల పూవుల పొదరింట..నిన్ను అల్లుకుంట 
ఆమని కోయిల వినకుండా..పాటలల్లుకుంట
వెన్నెల పూవుల పొదరింట..నిన్ను అల్లుకుంట

నేనుగా మారిన నీకోసం..నీడైపోయిన నాప్రాణం 
నీకే అంకితం నీదే జీవితం 
తొలిపొద్దుల్లో హిందోళం..మలి పొద్దుల్లో భూపాళం
తొలిపొద్దుల్లో హిందోళం..మలిపొద్దుల్లో భూపాళం