సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణం రాజు,జగ్గయ్య,రాజబాబు,పద్మనాభం,శారద,భారతి,రమాప్రభ,నిర్మల,హలం
పల్లవి::
కలగా అనురాగమే..వెన్నెలగా
కలగా అనురాగమే..వెన్నెలగా
కళకళ లాడే...కాపురం
అది కళ్యాణ నిలయం కాదా
కలగా అనురాగమే..వెన్నెలగా
చరణం::1
పతి మనసే..గంగా తరంగమై
సతివలపే యమునా లహరియై కలిసిపోతే..ఏఏఏ
అంతకు మించిన మధుర సంగమం కలదా
అంతకు మించిన రాగభావనం కలదా
అది నిర్మలానంద నిలయం...కాదా
కలగా అనురాగమే...వెన్నెలగా
చరణం::2
పతి మమత సిరిమల్లె..పందిరియై
బ్రతుకంత వసంత యామినియై..ఈఈ
పతి మమత సిరిమల్లె..పందిరియై
బ్రతుకంత వసంత యామినియై నిలిచిపోతే..ఏఏఏ
అంతకు మించిన నవ్యనందనం..కలదా..ఆ
అంతకు మినిచిన దివ్యజీవనం..కలదా..ఆ
అది నిత్య సౌభాగ్య నిలయం..కాదా
కలగా అనురాగమే..వెన్నెలగా
కళకళ లాడే...కాపురం
అది కళ్యాణ నిలయం..కాదా
కలగా అనురాగమే..వెన్నెలగా