Tuesday, November 20, 2007

రామాలయం--1971



























సంగీత::ఘంటసాల
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి,జిక్కి
తారాగణం::జగ్గయ్య,శోభన్‌బాబు,జమున,విజయనిర్మల,చంద్రమోహన్,సూర్యకాంతం

పల్లవి::

చిన్నారి మరదలికి పెళ్ళౌతుందీ..ఈ
చిట్టెమ్మ త్వరలో ఇల్లాలౌతుందీ
చిట్టెమ్మ త్వరలో ఇల్లాలౌతుందీ 
ముత్యాల పందిట..రతనాల ముంగిట
ముత్యాల పందిట..రతనాల ముంగిట 
ముద్దుల గుమ్మకు..ముక్కుతాడు పడుతుందీ

చిన్నారి మరదలికి..పెళ్ళౌతుందీ..ఈ
చిట్టెమ్మ త్వరలో..ఇల్లాలౌతుందీ
చిట్టెమ్మ త్వరలో..ఇల్లాలౌతుందీ

చరణం::1

నా..బుగ్గా గిల్లిన పిల్ల..ఓయమ్మ
నా..కొంగూ లాగిన పిల్ల..ఓయమ్మ
నా..బుగ్గా గిల్లిన పిల్ల..ఓయమ్మ
నా..కొంగూ లాగిన పిల్ల..ఓయమ్మ 
స్నానాల గదిలోనా..నేనున్న సమయానా
స్నానాల గదిలోనా..నేనున్న సమయానా
చిన్ని కృష్ణునిలాగా..చీరలెత్తుకుపొయిన పిల్ల
అమ్మకుచెల్లా...అమ్మో ఏం పిల్లా
ఈ బుల్లెమ్మా బుగ్గలు...చిదిమి
చల్ల చల్లంగ కౌగిట...అదిమి
ఈ బుల్లెమ్మా...బుగ్గలు చిదిమి
చల్ల చల్లంగ...కౌగిట అదిమి
దారికి తెచ్చే చినవాడు..వారంలోగా వస్తాడు 
చిన్నారి మరదలికి...పెళ్ళౌతుందీ,,ఈ 
చిట్టెమ్మ త్వరలో..ఓ..ఇల్లాలౌతుందీ 
చిట్టెమ్మ త్వరలో..ఓ..ఇల్లాలౌతుందీ  

చరణం::2

మొన్నా మొన్నటిదాకా...ఓయమ్మ 
హోయ్..ఓణీలెరుగనిదమ్మా...ఈ బొమ్మ
మొన్నా మొన్నటిదాకా...ఓయమ్మ
హోయ్..ఓణీలెరుగనిదమ్మా...ఈ బొమ్మ 
హా హా హా హా... 
పెళ్ళి ఊసంటేనే..తుళ్ళి తుళ్ళి పడుతుందీ
పెళ్ళి ఊసంటేనే..తుళ్ళి తుళ్ళి పడుతుందీ
ఉన్నమాటంటేనే..ఉలికి ఉలికి చూస్తుందీ
అమ్మకుచెల్లా...ఎన్నాళ్ళీ సిగ్గూ
ఆ మూడు ముళ్ళూ పడగానే..తన ముద్దులన్నీ తీరగానే
ఆ మూడు ముళ్ళూ పడగానే..తన ముద్దులన్నీ తీరగానే
ఏడాదికి ఒక పాపను ఎత్తుకుని...వస్తుందీ
అది ఆడపిల్లే అవుతుందీ..మా బుజ్జిగాడిపాలౌతుందీ
అది ఆడపిల్లే అవుతుందీ..బుజ్జిగాడిపాలౌతుందీ
అది ఆడపిల్లే అవుతుందీ..బుజ్జిగాడిపాలౌతుందీ
హ హ హ హ హ  

రంగేళీ రాజా--1971




















సంగీత::ఘంటసాల
రచన::దాశరథి
గానం::ఘంటసాల
తారాగణం::నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు,కాంచన,చలం,గుమ్మడి,లక్ష్మీరాజ్యం,ముక్కామల
కృష్ణమూర్తి,సత్యనారాయణ,వందన,జయకుమారి.

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
ఇలాటి రోజు మళ్ళీ...రానే రాదూ
ఇలాటి హాయి ఇంక..లేనే లేదూ
చలాకి చిన్నదీ...బలేగ వున్నది 
హుషారు చూపుతున్నది..హోయ్ 
మజాలు...చేయమన్నదీ..ఈఈఈ  

చరణం::1

కుర్రదాని బుగ్గలు..గులాబి మొగ్గలు 
అందమైన నవ్వులు..అవాయి చువ్వలు
ఎవరి గుండెలోకి...దూకునో..ఒహోహోయ్   
ఊరించీ..ఊగించీ..ఊరించీ..ఊగించీ 
తీరని మోహాల తేలించునో..ఓ..హో. 
ఇలాటి రోజు..మళ్ళీ రానే రాదూ 
ఇలాటి హాయి..ఇంక లేనే లేదూ
చలాకి చిన్నదీ..బలేగ వున్నది 
హుషారు చూపుతున్నది..ఓయ్ 
మజాలు...చేయమన్నదీ..ఒహోయ్  
అహ్హా..ఒహో..మ్మ్..హా 

చరణం::2

పొంగిపొరలు వయసుతో..బుజాలు కలుపుకో 
నిన్నుకోరు మనసుతో..నిజాలు తెలుసుకో
మధువులోనె మహిమ...వున్నదీ..ఒహోహోయ్ 
కైపుంటే..వలపుంటే..కైపుంటే..వలపుంటే
లేనిది ఏముందీ..యీ లోకంలో..అహా హా హా హా 
ఇలాటి రోజు..మళ్ళీ రానే రాదూ 
ఇలాటి హాయి..ఇంక లేనే లేదూ
చలాకి చిన్నదీ..బలేగ వున్నదీ  
హుషారు..చూపుతున్నదీ..హోయ్ 
మజాలు...చేయమన్నదీ..ఈ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్