Friday, April 13, 2012

ఊరికి ఉపకారి--1972


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::P.సుశీల
తారాగణం::చలం, ఆరతి, గుమ్మడి, కృష్ణంరాజు, అంజలీదేవి 

పల్లవి::

ఎంతమంచి వాడివిరా చక్కని రాజా
నీ దెంత మంచి మనసురా చల్లని రాజా 
ఎంతమంచి వాడివిరా చక్కని రాజా
నీ దెంత మంచి మనసురా చల్లని రాజా..చల్లని రాజా 

చరణం::1

ముద్దబంతిపువ్వు నీ ముందరున్నదీ
దాని ముద్దు ముచ్చట నిన్నె తీర్చమన్నదీ
ముద్దబంతిపువ్వు నీ ముందరున్నదీ
దాని ముద్దు ముచ్చట నిన్నె తీర్చమన్నదీ
చేరదీయకుంటె అది చిన్నపోతదీ
చేరదీయకుంటె అది చిన్నపోతదీ 
నీ చెయ్యి తగిలితే చాలు పొంగిపోతదీ    
ఎంతమంచి వాడివిరా చక్కని రాజా
నీ దెంత మంచి మనసురా చల్లని రాజా..చల్లని రాజా  

చరణం::2

కళ్ళు కళ్ళు మాటలాడు బాస తెలుసుకో
కన్నెవయసు దాచలేని ఆశ తెలుసుకో
కళ్ళు కళ్ళు మాటలాడు బాస తెలుసుకో
కన్నెవయసు దాచలేని ఆశ తెలుసుకో
మూగమనసు ఆగకచేసే సైగ తెలుసుకో
మూగమనసు ఆగకచేసే సైగ తెలుసుకో
తెలుసుకొని ఇకనైనా తెలివిగా మసలుకో   
ఎంతమంచి వాడివిరా చక్కని రాజా
నీ దెంత మంచి మనసురా చల్లని రాజా..చల్లని రాజా 

చరణం::3

పైరగాలి తీరు చూడూ..పరిగెత్తే ఏరుచూడూ
పైరగాలి తీరు చూడూ..పరిగెత్తే ఏరుచూడూ 
పరవశాన ఊసులాడూ పావురాల జంటచూడూ
పరవశాన ఊసులాడూ పావురాల జంటచూడూ
ఈడొచ్చిన చిన్నొడికి..ఈడొచ్చిన చిన్నోడికి ఇంతసిగ్గు తగదురా  
ఇంతకంటె యిడమరిసి ఏమని చెప్పేదిరా..ఏమని చెప్పేదిరా