రచన: :ఆరుద్ర
సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
గానం::ఘంటసాల.P.సుశీల
తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి,రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం,చలం
రానని రాలేనని ఊరకే అంటావు
రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు
రానని రాలేనని ఊరకే అంటావు
రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు !!
కొంటెచూపు చూడకు
గుండెకోత కోయకు
కోపమందు కులుకుచూపి కోర్కెపెంచకు
కొంటెచూపు చూడకు
గుండెకోత కోయకు
కోపమందు కులుకుచూపి కోర్కెపెంచకు
వేశమైనా మోసమైనా అంతా నీకోసం ...
ఆమె: ఉహూ ... అలాగా
!! రానని రాలేనని ఊరకె అంటావు
రావాలని ఆశలేనిదె ఎందుకు వస్తావు !!
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదటముద్దు తీర్చమని మూల్గుచున్నది
ఆమె: పాపం
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదటముద్దు తీర్చమని మూల్గుచున్నది
గుండెమీద వాలిచూడు గోడువింటావు ..
ఆమె: ష్హ్ ... అబ్బబ్బబ్బా !!
!! రానని రాలేనని ఊరకె అంటావు
రావాలని ఆశలేనిదె ఎందుకు వస్తావు !!
దోరవయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమయిన మనసుపడే బాధ అయ్యయ్యో
దోరవయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమయిన మనసుపడే బాధ అయ్యయ్యోమయిన
కరుణచూపి కరుగకున్న టాటా చీరియో
ఆమె: టాటా చీరియో
!! రానని రాలేనని ఊరకె అంటావు
ఆమె: ఉహూ....
రావాలని ఆశలేనిదె ఎందుకు వస్తావు !!