Tuesday, February 05, 2013

దొరలు దొంగలు--1976



సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ, S.వరలక్ష్మి

పల్లవి::

చెప్పాలనుకున్నానూ..చెప్పలేకపోతున్నానూ
చెప్పాలనుకున్నానూ..చెప్పలేకపోతున్నానూ
కల్లాకపటం తెలియని నన్ను..కన్నులతో కవ్వి౦చవద్దని 
చెప్పాలనుకున్నానూ..చెప్పలేకపోతున్నానూ
చెప్పకుండ...నా మదిలో దూరి
చిందర వందర చెయ్యొద్దని..రె౦డివ్వాలనుకున్నానూ  
రె౦డివ్వాలనుకున్నానూ..ఇవ్వలేక పోతున్నానూ

చరణం::1

ఆడుకునే లతల నడుమ..పాడుకునే పూవులమై
ఆడుకునే లతల నడుమ..పాడుకునే పూవులమై
పరిసరాల నన్నిటిని..పరిమళింప చేద్దామని
పరిమళింప చేద్దామని..నే చెప్పాలనుకున్నానూ చెప్పలేకపోతున్నానూ

చరణం::2

మేలి ముసుగులోని లజ్జ..మెట్లు దిగీ వచ్చిందని
మేలి ముసుగులోని లజ్జ..మెట్లు దిగీ వచ్చిందని
తెలిసికుడా తెలియనట్లే..ఒదిగుంటే ఒళ్ళుమండి
ఒదిగుంటే ఒళ్ళుమండి..రె౦డివ్వాలనుకున్నానూ
ఇవ్వలేక...పోతున్నానూ

చరణం::3

అడగకుండ అందించే..ఆలి౦గన మధురము
అడగకుండ అందించే..ఆలి౦గన మధురము 
అహా..వద్దంటూ అందుకునే..వలపు మరీ మధురము
అని చెప్పాలనుకున్నాను..అన్నీ చెప్పేశాను
ఇవ్వాలనుకున్నాను..అన్నీ ఇచ్చేశాను