Friday, September 02, 2011

గోవుల గోపన్న--1968










సంగీతం::ఘంటసాల
రచన::కొసరాజు 
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, రాజశ్రీ, భారతి, రేలంగి, చలం, సూర్యకాంతం

పల్లవి::

ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ 
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా..నాతో సరి పోలవురా
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

చరణం::1

కల్లా కపటం ఎరుగని..గంగి గోవును నేను
ఏది చెప్పినా కాదని..ఎదురు చెప్పలేను
పారేసిన గడ్డి తిని..బ్రతుకు గడుపుతున్నాను
పారేసిన గడ్డి తిని..బ్రతుకు గడుపుతున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

చరణం::2

కమ్మనైన గుమ్మపాలు..కడవలతో ఇస్తున్నా
నా దూడల కాదని..మీ కడుపులు నిండిస్తున్నా
వయసుడిగిన నాడు..నన్ను కటిక వాని పాల్జేస్తే
వయసుడిగిన నాడు..నన్ను కటిక వాని పాల్జేస్తే
ఉసురు కోల్పోయి..మీకే ఉపయోగిస్తున్నాను

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

చరణం::3

నా బిడ్డలు భూమి చీల్చి..దుక్కి దున్నుతున్నవోయి 
నా ఎరువున పైరు పెరిగి..పంట పండుతున్నదోయి
నా చర్మమే మీ కాలికి..చెప్పులుగా మారునోయి
నా చర్మమే మీ కాలికి..చెప్పులుగా మారునోయి
నా వల్లే ఢంకాలకు..నాదం పుట్టించునోయి 

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

చరణం::4

నా కొమ్ములే దువ్వెనలై..మీ తల చిక్కులను తీర్చు
నే కల్పించిన విభూది..మీ నొసటను రాణించు
నా రాకయే మీ ఇంట్లో..శుబములెన్నో కలిగించు
నా రాకయే మీ ఇంట్లో..శుబములెన్నో కలిగించు
నా చేయుతయే చివరకు..వైతరణిని దాటించు

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరి పోలవురా
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా