Sunday, September 25, 2011

దేశోద్ధారకులు--1973


సంగీతం::K.V.మహాదేవన్
రచన:: మోదుకూరి జాన్సన్
గానం::P.సుశీల,బృందం


స్వాగతం దొరా సుస్వాగతం
స్వాగతం దొరా సుస్వాగతం
తేనెలాంటి మనసులున్న తేలుగు నేలకు
అన్నపూర్ణను మించిన ఆంద్రభూమికీ
స్వాగతం దొరా సుస్వాగతం
స్వాగతం దొరా సుస్వాగతం

పల్లెసీమ పైరగాలి పరవళ్ళూ
కల్లలేని జానపదుల జావళీలు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ గ రీ స ద..
మ ప ద స రి సా ద ప రి మ ప ద
రి స ద ప మ రి స రి మ ప ద స..
పల్లెసీమ పైరగాలి పరవళ్ళూ
కల్లలేని జానపదుల జావళీలు
రైతుబిడ్డ తొలిపాటల రవళులూ
రైతుబిడ్డ తొలిపాటల రవళులూ
తెలుగు సిరులు కురిసి నీకు హారతులివ్వగ

స్వాగతం దొరా సుస్వాగతం
స్వాగతం దొరా సుస్వాగతం

గోదావరీ పాదాలకూ నీళ్ళివ్వగా
పినాకినీ పిలిచి నీకు పీట వేయగా
గోదావరీ పాదాలకూ నీళ్ళివ్వగా
పినాకినీ పిలిచి నీకు పీట వేయగా
కృష్ణవేణి మెచ్చి కడుపు నింపగా
గోదావరీ పాదాలకూ నీళ్ళివ్వగా
పినాకినీ పిలిచి నీకు పీట వేయగా
కన్నతల్లి కడుపుతీపి తాంబూలమివ్వగ

స్వాగతం దొరా సుస్వాగతం
స్వాగతం దొరా సుస్వాగత

అజంతా ఎల్లోరా కన్నియలూ
అజంతా ఎల్లోరా కన్నియలూ
ఓరుగల్లు వీణయతో కొండవీటి తీగచుట్టి
హంపీ అమరావతి గొంతులతో ఆ ఆ ఆ
హంపీ అమరావతి గొంతులతొ
గతస్మృతులను పాడగా గర్వంగా నిలిచినదీ

స్వాగతం దొరా సుస్వాగతం
స్వాగతం దొరా సుస్వాగతం
తేనెలాంటి మనసులున్న తేలుగు నేలకు
అన్నపూర్ణను మించిన ఆంద్రభూమికీ
స్వాగతం దొరా సుస్వాగతం
స్వాగతం దొరా సుస్వాగతం