Wednesday, April 30, 2008

బంగారు పంజరం--1969





బంగారు పంజరం 1969
సంగీతం::S.రాజేశ్వరరావ్,B.గోపాలం
రచన::దేవులపల్లి్‌కృష్ణశాస్రి
గానం::S.జానకి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువి రా
రాతిరి నా రాజువి రా
పక్కనా నువ్వుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
పక్కనా..నువ్వుంటే..ప్రతిరాత్రి..పున్నమి రా
పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువి రా
రాతిరి నా రాజువి రా

పగలైతే నాలో నీ సొగసంతా దాగెర
పగలైతే నాలో నీ సొగసంతా దాగెర
రేయైతే వెన్నెలగా బయలంత నిండెరా
రాతిరి నా రాజువు రా..రాతిరి నా రాజువు రా

నే కొలిచే దొరవైనా
నను వలచే నా రాజువే
నే కొలిచే దొరవైనా
నను వలచే నా రాజువే
కలకాలం ఈలాగే నిలిచే నీ దాననై
పక్కనా నీవుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
ప్రతిరాత్రి పున్నమి రా..
పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువి రా
మ్మ్ మ్మ్..రాతిరి నా రాజువి రా

బంగారు పంజరం--1969



సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దేవులపల్లికౄష్ణశాస్త్రి
గానం::SP.బాలు.S,జానకి

ఆ....ఆ....ఆ....
మనిషే మారేనా రాజా
మనసే మారేరా
మనసులో...నా మనసులో
సరికొత్త మమతలూరేరా
మనిషే మారేనా రాజా
మనసే మారేరా

రాజా..
ఆ...
ఏచోట దాగేనో
ఇన్నాళ్ళు ఈ సొగసు
ఏచోట దాగేనో
ఇన్నాళ్ళు ఈ సొగసు
ఆ తోటపూవులేనా
అలనాట లతలేనా
మనిషే మారేనా రాజా
మనసే మారేరా

ఆ....ఆ...
ప్రతి పొదలో ప్రతి లతలో
పచ్చనాకుల గూడేరా
ప్రతి పొదలో ప్రతి లతలో
పచ్చనాకుల గూడేరా
గూట గూట దాగుండి
కొత్తగువ్వ పాడేరా
మనిషే మారేరా రాజా
మనసే మారేరా

ఆ...ఆ...
అడుగడుగున జగమంతా
అనురాగపు కనులకు
కులుకుతూ కొత్తపెళ్ళి
కూతిరిలా తోచేనే
కులుకుతూ కొత్తపెళ్ళి
కూతిరిలా తోచేనే
ఆనాటివే పువులైనా
అలనాటివే లతలైనా
మనిషే మారేనే
రాణీ మనసే మారేనే
ఆ...ఆ...ఆ..
ఆ...ఆ...ఆ..
ఆ...ఆ...ఆ...

రాధా కౄష్ణ--1978



సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన:: ?
గానం::SP.బాలు,P.సుశీల

ఆ..హా...లలలలలా
ఆ..హా...లలలల
లా
నీవే జాబిలి
నీ నవ్వే వెన్నెలా
నీవే జాబిలి
నీ నవ్వే వెన్నెలా
ఇటు చూడవా మాటాడవా
ఈ బింకం నీకేలా...
నీవే జాబిలి
నీ నవ్వే వెన్నెలా


మల్లెలు పూచే చల్లని వేళా
మనసులు కలపాలీ...
మల్లెలు పూచే చల్లని వేళా
మనసులు కలపాలీ
అల్లరిచేసే పిల్లగాలిలో
ఆశలు పెంచాలీ..
ఒంటరి తనము ఎంతకాలము
జంటకావాలి నీకొక జంటకావాలి
ఇటు చూడవా మాటాడవా ఈ మౌనం నీకేలా

నీవే జాబిలి
నీ నవ్వే వెన్నెలా
ఇటు చూడవా మాటాడవా
ఈ బింకం నీకేలా...
నీవే జాబిలి
నీ నవ్వే వెన్నెలా

అ-:చల్లని వేళా నీ వొళ్ళంత
వెచ్చగ వుంటుందా
ఆ:-మ్మ్..మ్మ్..వుంటుంది
అ:-నడిరేయైన నిదురే రాక
కలతగ వుంటుందా
ఆ:-అవును అలాగే వుంటుంది
అ:-వుండి వుండి గుండెలలోన
దడ దడ మంటుందా
ఆ:-అరే !! నీకెలా తెలుసు ?
అ:-ఓమై గాడ్ ఇది చాలా పెద్ద జబ్బే..
ఆ:-మ్మ్...
అ:-ఈ పిచ్చికి ఈ ప్రేమకు
ఇక పెళ్ళేఔషదమూ...
ఆ:-హా....నీవే జాబిలీ
నీ నవ్వే వెన్నెలా
ఇటు చూడవా మాటాడవా
ఈ బింకం నీకేలా
ఆ:-నీవే జాబిలీ
నీ నవ్వే వెన్నెలా

త్రిమూర్తులు--1987



సంగీతం::బప్పిలహరి
దర్శకత్వం::K.మురళీమోహనరావు
నిర్మాత::శశిభూషణ్
సంస్థ::మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::వెంకటేష్,అర్జున్,రాజేంద్రప్రసాద్,శోభన,కుష్బూ,అశ్విని


పల్లవి:

ఈ జీవితం చదరంగము
మనుషులనే పావులుగా ఆటాడుకుంటాము మనము
ప్రేమన్నదే చదరంగము
మనుసులనే పావులుతో ఆటాడుకుంటుంది రోజు
ఆ ఆటలో తానోడినా
అది త్యాగమే అనుకోమని
ఆ నేస్తానికి కన్నీరు తుడిచేది స్నేహం
ఈ స్నేహము చదరంగము

చరణం1:

పసి మనసు కలలు కని పాడింది ఓ పాటను
ఆ ఆ అది పెరిగి నిజమెరిగి అణిగింది తనలో తను
చిననాటి కలలన్ని చెరిపేందుకు విధిరాత చెరలాడెను
ఈ జీవితం చదరంగము
మనుషులనే పావులుగా ఆటాడుకుంటాము మనము

చరణం2:

నీ చూపు నా చూపులోన
కలిసింది ఏ వేళనైనా
నిలిచుంది ఈనాటికైనా
వెలిగింది నా వేదన
ఓ పూవు విరబూయగానే
ఓ గాలి చెలరేగగానే
ఆ తావి తన సొంతమౌనా
ఆ తేనె తన విందుకేనా
చివరికది ఎవరిదని తేల్చేది ఈ స్నేహము

ఈ జీవితం చదరంగము
మనుషులనే పావులుగా ఆటాడుకుంటాము మనము

ఏ కళ్ళలో ఏ కళ్ళలో తెలుపున్నదో నలుపున్నదో
అది తెలిసేంతలో చేజారిపోతుంది ప్రేమ
ఈ జీవితం చదరంగము
ఈ జీవితం చదరంగము