Thursday, January 31, 2008

చక్రవాకం--1974



సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల

వెళ్ళిపో వెళ్ళిపో
వెళ్ళాలంటే వెళ్ళిపో
ఓ కుళ్ళుమోమొతు పిల్లగా
మళ్ళివచ్చేదాకా
నీ కళు కాస్తా ఇచ్చిపో
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో
ఉండిపో ఉండిపో వుండాలంటే వుండిపో
ఓ ఒళ్ళుపొగరుపిల్లా...
వెళ్ళలేని కళ్ళల్లో
నువ్వు వెన్నెలల్లే ఉండిపో....
నువ్వు వెన్నెలల్లే ఉండిపో....

వెన్నెలతో నన్ను పోల్చకూ
అది సగం రోజులుంటుందీ నెలకు
వెన్నెలతో నన్ను పోల్చకూ
అది సగం రోజులుంటుందీ నెలకు
ఆ మిగితాసగం నేనుంటానులే
ఒద్దికంటే ఇద్దరం పంచుకోవాలిలే
ఉండిపో ఉండిపో ఉండాలంటే ఉండిపో
ఓకుళ్ళుమొతు పిల్లగా
మల్లి వచ్చే దాకా
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో...
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో...


పోతే పో...నాకే అన్నావుగా
మరి బుంగమూతి పెట్టుకు
కూర్చోన్నావేంటి మరి
నీకే నువు టవునుకెలతావు
స్నేహితులని..సినిమాలకనీ...
పగలంతా హాయిగాతిరిగి
రాత్రికి మత్తుగా నిద్రపోతావు..
నే నొంటరిగా ఎలావుండనూ...

మగాడివి నీకేమి
పగలంతా తిరుగుతావు
మాపటికి అలసిపోయి
మత్తుగా నిదరోతావ్
ఆ...హా...ఆ...ఆ...
మగాడివి నీకేమి
పగలంతా తిరుగుతావు
మాపటికి అలసిపోయి
మత్తుగా నిదరోతావ్
ఆడపిల్లవు నీకేమి
అద్దమెదుట కూర్చోంటావ్
ఆడపిల్లవు నీకేమి
అద్దమెదుట కూర్చోంటావ్
రోజు రోజుకో కొత్త పోంగు
చూసుకొంటూ..గడిపేస్తావ్
సరే వెళ్ళో వెళ్ళిపో
వెళ్ళాలంటే వెళ్ళిపో
ఓ ఒల్లుపొగరుపిల్లా
వెళ్ళలేని కళ్ళల్లోనువు
వెన్నెలల్లే ఉండిపో
నువు వెన్నెలల్లే ఉండిపో...

నీ జతలో నేనే మగాడినీ
నువు లేకుంటే నాకు
నేనే పగాడిని
నీ జతలో నేనే మగాడినీ
నువు లేకుంటే నాకు
నేనే పగాడిని
పగవాడితో పోరు
తెలిసినట్లూంటుంది
పడుచువాడితో పొత్తు
ప్రాణాలు తీస్తాది
ఐతే...ఉండిపో ఉండిపో
ఉండాలంటే వుండిపో
సరే... వెళ్ళిపో వెళ్ళిపో
వెళ్ళాలంటే వెళ్ళిపో
ఓ ఒల్లుపొగరు పిల్లా
వెళ్ళలేని కళ్ళల్లో
ఓ కుళ్ళుమొతు పిల్లగా
మల్లివచ్చేదాకా
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో.....

మండే గుండెలు--1979




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::K.Bapayya
తారాగణం::కృష్ణ,(ఘట్టమనేని శివరామ కృష్ణ),శోభన్‌బాబు,K.సత్యనారాయణ,గుమ్మడి 
వెంకటేశ్వరరావు,చంద్రమోహన్,అల్లురామలింగయ్య,M.ప్రభాకర్రెడ్డి,నూతన్‌ప్రసాద్,అంజలీదేవి,జయసుధ,జయప్రద,మాధవి. 

పల్లవి::

చల్లా చల్లని..చందమామా
ఇలా వేడెక్కిపోతే..ఏలాగమ్మా
చల్లా చల్లని..చందమామా
ఇలా వేడెక్కిపోతే..ఏలాగమ్మా

అత్తమీద కోపం..దుత్తమీద చూపేది
అన్యాయం అన్యాయం..చల్లారమ్మా
అత్తమీద కోపం..దుత్తమీద చూపేది
అన్యాయం అన్యాయం..చల్లారమ్మా
దపా..దపా..దప దప దప
దపా..దపా..దప దప దప
చల్లా చల్లని..చందమామా 
ఇలా వేడెక్కిపోతే..ఏలాగమ్మా

చరణం::1

దిబ్బరొట్టె వున్నాది..తినుకోనూ
చేప పులుసు..వున్నాది నంజుకోనూ
దిబ్బరొట్టె వున్నాది..తినుకోనూ
చేప పులుసు..వున్నాది నంజుకోనూ

తిని చూడు ఒకసారి..రవ్వంతా
దెబ్బకు దిగుతుంది..వేడంతా
తినిచూడు ఒకసారి..రవ్వంతా
దెబ్బకు దిగుతుంది..వేడంతా

దిగకుంటె నీమీద..ఒట్టేనూ
తినకుంటే..నేనీడే ఛస్తానూ
దిగకుంటె నీమీద..ఒట్టేనూ
తినకుంటే..నేనీడే ఛస్తానూ
దపా..దపా..దప దప దప
దపా..దపా..దప దప దప

అల్లరల్లరి...సత్యభామా
అసలే వేడెక్కి..వున్నాను ఊర్కోవమ్మా
అల్లరల్లరి...సత్యభామా
అసలే వేడెక్కి..వున్నాను ఊర్కోవమ్మా

అత్త మీద కోపం..చూపెందుకు 
నాకు దుత్తల్లే నువ్వే..దొరికావమ్మా
అత్తమీద కోపం..చూపెందుకు 
నాకు దుత్తల్లే నువ్వే..దొరికావమ్మా
భామా భామా భామా..భామా భామా
భామా భామా భామా..భామా భామా

అల్లరల్లరి...సత్యభామా
అసలే వేడెక్కి..వున్నాను ఊర్కోవమ్మా

చరణం::2

దిబ్బరొట్టెకన్నా..నీ బుగ్గలున్నవి
చేప పులుసు కన్నా..నీ పెదవులున్నవి
దిబ్బరొట్టెకన్నా..నీ బుగ్గలున్నవి
చేప పులుసు కన్నా..నీ పెదవులున్నవి

రెండిట్లో చల్లార్చే..గుణమున్నదీ
ఊర్కొంటే వుసిగొలిపే..దుడుకున్నది
రెండిట్లో చల్లార్చే..గుణమున్నదీ
ఊర్కొంటే వుసిగొలిపే..దుడుకున్నది

చవి చూడమంటావ..రవ్వంతా
నెమరేసుకొంటావు..రాత్రంతా
చవి చూడమంటావ..రవ్వంతా
నెమరేసుకొంటావు..రాత్రంతా
దపా..దపా..దప దప దప
పదా..పదా..పద పద పద

చల్లా చల్లని..చందమామా
ఇలా వేడెక్కిపోతే..ఏలాగమా
అల్లరల్లరి...సత్యభామా
అసలే వేడెక్కి..ఉన్నాను ఊర్కోవమ్మా

అత్త మీద కోపం..దుత్తమీద చూపేది
అన్యాయం అన్యాయం..చల్లారమ్మా
అత్త మీద కోపం..చూపెందుకు 
నాకు దుత్తల్లే..నువ్వే దొరికావమ్మా
దపా..దపా..దప దప దప
భామా భామా భామ..భామ భామ
లాలా లాలా లలలలా
లా లలలలాల లల్లలల్లా

Mande Gundelu--1979
Music::K.V.Mahadevan
Lyrics::Acharya-Atreya
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.Baapayya 
Cast::Krishna,Sobhanbabu,K.Satyanarayana,Chandramohan,Gummadi,M.Prabhakar Reddi,Nootanprasaad,Alluraamalingayya,Jayasudha,Jayaprada,Maadhavi,Anjalidevi.

:::::::::::::::::::::::::::::::::::::

challaa challani..chandamaamaa
ilaa vEDekkipOtE..Elaagammaa
challaa challani..chandamaamaa
ilaa vEDekkipOtE..Elaagammaa

attameeda kOpam..duttameeda choopEdi
anyaayam anyaayam..challaarammaa
attameeda kOpam..duttameeda choopEdi
anyaayam anyaayam..challaarammaa
dapaa..dapaa..dapa dapa dapa
dapaa..dapaa..dapa dapa dapa
challaa challani..chandamaamaa 
ilaa vEDekkipOtE..Elaagammaa

::::1

dibbaroTTe vunnaadi..tinukOnuu
chEpa pulusu..vunnaadi nanjukOnuu
dibbaroTTe vunnaadi..tinukOnuu
chEpa pulusu..vunnaadi nanjukOnuu

tini chooDu okasaari..ravvantaa
debbaku digutundi..vEDantaa
tinichooDu okasaari..ravvantaa
debbaku digutundi..vEDantaa

digakunTe neemeeda..oTTEnuu
tinakunTE..nEneeDE Chastaanuu
digakunTe neemeeda..oTTEnuu
tinakunTE..nEneeDE Chastaanuu
dapaa..dapaa..dapa dapa dapa
dapaa..dapaa..dapa dapa dapa

allarallari...satyabhaamaa
asalE vEDekki..vunnaanu UrkOvammaa
allarallari...satyabhaamaa
asalE vEDekki..vunnaanu UrkOvammaa

atta meeda kOpam..choopenduku 
naaku duttallE nuvvE..dorikaavammaa
attameeda kOpam..choopenduku 
naaku duttallE nuvvE..dorikaavammaa
bhaamaa bhaamaa bhaamaa..bhaamaa bhaamaa
bhaamaa bhaamaa bhaamaa..bhaamaa bhaamaa

allarallari...satyabhaamaa
asalE vEDekki..vunnaanu UrkOvammaa

::::2

dibbaroTTe kannaa..nee buggalunnavi
chEpa pulusu kannaa..nee pedavulunnavi
dibbaroTTe kannaa..nee buggalunnavi
chEpa pulusu kannaa..nee pedavulunnavi

renDiTlO challaarchE..guNamunnadii
UrkonTE vusigolipE..duDukunnadi
renDiTlO challaarchE..guNamunnadii
UrkonTE vusigolipE..duDukunnadi

chavi chooDamanTaava..ravvantaa
nemarEsukonTaavu..raatrantaa
chavi chooDamanTaava..ravvantaa
nemarEsukonTaavu..raatrantaa
dapaa..dapaa..dapa dapa dapa
padaa..padaa..pada pada pada

challaa challani..chandamaamaa
ilaa vEDekkipOtE..Elaagamaa
allarallari...satyabhaamaa
asalE vEDekki..unnaanu UrkOvammaa

atta meeda kOpam..duttameeda choopEdi
anyaayam anyaayam..challaarammaa
atta meeda kOpam..choopemduku 
naaku duttallE..nuvvE dorikaavammaa
dapaa..dapaa..dapa dapa dapa
bhaamaa bhaamaa bhaama..bhaama bhaama
laalaa laalaa lalalalaa
laa lalalalaala lallalallaa

Tuesday, January 29, 2008

చక్రవాకం--1974



సంగీతం::KV.మహాదేవన్
రచన
::ఆచార్య ఆత్రేయ
గానం
::ఘంటసాల,P.సుశీల

ఈ నదిలా నా హౄదయం
పరుగులు తీస్తుందీ
ఏ ప్రేమకడలినో...
ఏ వెచ్చని ఒడినో...
వెతుకుతు వెళుతుండీ....
వెతుకుతు వెళుతుందీ..

వలపువాన తెల్లదనం తెలియనిదీ
వయసు వరదపొంగు సంగతే ఎరగనిదీ
వలపువాన తెల్లదనం తెలియనిదీ
వయసు వరదపొంగు సంగతే ఎరగనిదీ
కడలి కెరటాల గలగలలూ రేగనిదీ
గట్టు సరిహద్దు కలతపడీదాటనిదీ
ఏ మబ్బు మెరిసిందో ఏ జల్లు కురిసిందో
ఎంతగా మారినదీ ఎందుకో ఉరికినది
ఎంతగా మారినదీ ఎందుకో ఉరికినది

ఈ నదిలా నా హౄదయం
పరుగులు తీస్తుందీ...
ఏ ప్రేమ కడలినో
ఏ వెచ్చని ఒడినో...
వెతుకుతు వెళుతోందీ
వెతుకుతు వెళుతోందీ !!!

అడవి పిల్లల్లే ఎక్కడో పుట్టినదీ
అడుగడుగునా సొగసు వాగు చేసుకొన్నదీ
అడవి పిల్లల్లే ఎక్కడో పుట్టినదీ
అడుగడుగునా సొగసు వాగు చేసుకొన్నదీ
వలపు మలపులో ఒక వంపు తిరిగినదీ
వలపు మలపులో ఒక వంపు తిరిగినదీ
ఏ మనిషికీ మచ్చికకు రానన్నదీ
ఏ తోడు కలసినదో ఏ లోటు తెలిసినదో
వింతగా మారినదీవెల్లువై ఉరికినదీ
వింతగా మారినదీవెల్లువై ఉరికినదీ

ఈ నదిలా నా హౄదయం
పరుగులు తీస్తుందీ...
ఏ ప్రేమ కడలినో
ఏ వెచ్చని ఒడినో...
వెతుకుతు వెళుతోందీ
వెతుకుతు వెళుతోందీ
!!!

Monday, January 28, 2008

చక్రవాకం--1974::చక్రవాకం::రాగం



సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల
రాగం ::: చక్రవాకం


వీణలోనా తీగలోనా ఎక్కడున్నది నాదమూ
అది ఎలాగైనది రాగము
వీణలోనా తీగలోనా ఎక్కడున్నది నాదమూ
అది ఎలాగైనది రాగము వీణలోనా తీగలోనా

మాటలోనా మనసులోనా ఎక్కడున్నది భావము
అది ఎప్పుడవును గానము
మాటలోనా మనసులోనా ఎక్కడున్నది భావము
అది ఎప్పుడవును గానము
నాదమునకు స్వరమే రాగము మనసులోని మాటే భావము
రాగ భావము లేకమైనది రమ్యమైన గానము
వీణలోనా తీగలోనా...

గతజన్మ శౄతి చేసుకొన్నదీ
అది ఈ జన్మ సంగీతమైనదీ
సరిగమ పదనిసా నిదపమగరిదా
రాగాల ఆరోహణవరోహణైనది
అనురాగ హౄదయాల అన్వేషనైనది
వీణలోనా తీగలోనా

గుండెలోనా గొంతులోనా
ఎక్కడున్నదీ ఆవేదన అది ఎలాగవును సాధన
గీతమునకు బలమే వేదన వేదన రాగమునకు మెరుగే సాధన
గుండె గొంతుక లేకమైనది నిండురాగాలాపన
వీనలోనా తీగలోనా..
.

Wednesday, January 23, 2008

గంగా-మంగా--1973




సంగీతం::రమేష్ నాయుడు
రచన:: దాశరథి
గానం::ఘంటసాల,P.సుశీల.
రాగం:: ?


తొలివలపులలో ఏ చెలికైన అలకవుండునని విన్నాను
ఆది కవుల కల్పనను కున్నాను
ఆది కవుల పైత్యమనుకున్నాను
నీలో నాపై అలకను చూసివలపు చేష్టలనుకున్నాను
నీ చెలిమి కోరుతూ వున్నాను

మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు
ప్రతి మగువకిలాగే చెపుతారు
ఆడది తానై చెంతకువస్తే అలిగేపనులే చేస్తారు
ఆ అలకే వలపనుకుంటారు

కోరినవాడ్ని కొంగుముడేసి తిప్పదలచుకుంటారు
మరో మగువతో మాట్లాడగనే మూతి
ముడుచుకుంటారు మొగము తిప్పుకుంటారు
ప్రేమ పేరుతో చెక్కిలినొక్క సరసమాడుతువుంటారు
నిజం తెలిస్తే భుజం తడుముకొని నీతులు పలుకుతూ వుంటారు
సాకులు చెపుతూ వుంటారు

!!తొలివలపులలో ఏ చెలికైన అలకవుండునని విన్నాను
ఆది కవుల కల్పనను కున్నాను
మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు
ప్రతి మగువకిలాగే చెపుతారు!!

ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు
లోపల మమత పైన కలతతో సతమౌతూ వుంటారు
కుతకుతలాడుతు వుంటారు
తేనెటీగలో వున్న గుణాలు మగవారలలో వుంటాయి
వీలుదొరికితే వారి తలపులు దారి తప్పుతు వుంటాయి
పెడదారి పట్టుతూ వుంటాయి

కలలోనైన నా కన్నులలో వెలుగుతున్నది నీ రూపం
నీ అందాలను ఆరాధిస్తు పూజించడమే నాధ్యేయం
జీవించడమే నా గమ్యం

కోరినవాడు దూరమౌదురని గుబులుపడును నా మనసు
నీ హృదయంలో నాపై ప్రేమ నిండుగా
వుందని తెలుసు అది పొంగుతుందని తెలుసు
ఆ...ఆ...ఆ...ఆ...లలలా
మ్మీ...మ్మీ...మ్మీ
!!

Friday, January 18, 2008

శారద--1973

























సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::చక్రవర్తి,రామారావు బృందం


రా, రారా, రా, రా, రా, రా...
అటో..ఇటో తేలిపోవాలి..అటో ఇటో తేలి పోవాలి
ఇటో..అటో తేలిపోవాలి..అటో ఇటో తేలి పోవాలి

ఏకులాగ వచ్చావ్..నువు
మేకులాగ మారావ్..హటో దూర్‌ హటో
గెటవుట్‌...

అటో ఇటో..అటో ఇటో తేలి పోవాలి

నీ ముక్కు పిండేస్తాం..నీడొక్కచింపేస్తాం
నీ కళ్లు పీకేస్తాం..నీ కాళ్లు నరికేస్తాం
ముక్కు పిండేస్తాం, డొక్క చింపేస్తాం, కళ్లు పీకేస్తాం...
కాళ్లు నరికేస్తాం...

అటో ఇటో తేలి పోవాలి..అటో ఇటో తేలి పోవాలి

అటో ఇటో తేలిపోతుంది..
ఇక అమీ తుమీ తెలిసి పోతుంది
అద్దెకు తెచ్చిన గాడిదలు గుర్రాలౌతాయా
బాడుగకొచ్చిన బడుద్దాయిలు భరతం పడతారా!
నా భరతం పడతారా!
కొమ్ములూడ గొడతాను..కోరలు పీకేస్తాను
దమ్ములుంటె రమ్మను దుమ్ము రేగ కొడతాను
తా..తంతా..తంతా కలిపి తంతా...
తండ్రిని మించిన దైవం లేడను దేశంరా మనది

తండ్రిం శరణం గచ్ఛామి..తండ్రిం శరణం గచ్ఛామి!
మొగుడే భార్యకు పరమేశ్వరుడను దేశం గద మనది
మొగుడుం శురణ గచ్ఛామి..మొగుడుం శరణం గచ్ఛామి
ఇంటిల్లిపాది ఇంపుగ వుండే సంఘంరా మనది
కలసీ, మెలసీ కమ్మగ బతికిన ఇంటికి సాటేది..
మన ఇంటికి సాటేదీ ...
అటో ఇటో తేల్చి పారేశావ్‌ ...
ఆరని వెలుగు ఇంట్లో నిలపావు..నా రాజా
ఇల్లు నిలిపావు..నా ఇల్లు నిలిపావు ...

శారద--1973::చారుకేశి::రాగం



















సంగీతం :: చక్రవర్తి
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల


రాగం::చారుకేశి
హిందుస్తానీ కర్నాటక !

వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ
వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ
వనమెల్ల వేచేనురా
నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా


కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని
గున్న మావి పూయనన్నదీ నీవు రావని
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కదలాడే యమునా నది
నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా

రావేలా రావేలా !!

మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని
నా నీడ తానన్నదీ రాడు రాడేమని
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రావేల చిరుజల్లుగా
నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా

రావేలా రావేలా !!

శారద--1973




















సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల


బృందం:: రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా

నందకిషోరా..నవనీత చోరా
బృందావన సంచార

బృందం:: రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ గుడిలో గంటలు మోగినవి..నా గుండెల మంటలు రేగినవి
నీ గుడిలో గంటలు మోగినవి..నా గుండెల మంటలు రేగినవి
ఇన్నాళ్లు చేశాను ఆరాధనా..ఇన్నాళ్లు చేశాను ఆరాధనా
దాని ఫలితమా నాకీ ఆవేదనా

బృందం:: రాధాలోలా..గోపాలా..
గాన విలోలా యదుబాలా

శారద: :నందకిషోరా..నవనీత చోరా
బృందావన సంచార

బృందం:: రాధాలోలా..గోపాలా..
గాన విలోలా యదుబాలా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మనిషిని చేసి..మనసెందుకిచ్చావు?
ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు?

బృందం::ఆ ఆ ఆ....

మనిషిని చేసి..మనసెందుకిచ్చావు?
ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు?

మనసులు పెనవేసి..మమతలు ముడివేసి
మగువకు పతి మనసే..కోవెలగా చేసి
ఆ కోవెల తలుపులు మూశావా?...

బృందం:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ కోవెల తలుపులు మూశావా?...
నువు..హాయిగ..కులుకుతు చూస్తున్నావా?

బృందం:: ఆ ఆ ఆ ఆ..

నీ గుడిలో గంటలు మోగినవి..నా గుండెల మంటలు రేగినవి

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ గుడిలో గంటలు మోగాలంటే..
నీ మెడలో మాలలు నిలవాలంటే..
నీ సన్నిధి దీపం వెలగాలంటే..
నే నమ్మిన దైవం నీవే అయితే..
నా గుండెల మంటలు ఆర్పాలి..
నా స్వామి చెంతకు చేర్చాలి..

బృందం:: రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా
రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా
రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా
గోపాలా..గోపాలా..గోపాలా

శారద--1973

























సంగీతం::చక్రవర్తి
రచన::C.నారాయణ రెడ్డి
గానం::V.రామకృష్ణ


శారద నను చేరగా
శారద నను చేరగా

ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా
ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా
ఓ...శ్రావణ..నీరదా..శారదా...

శారదా నను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా

ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది చంద్ర తాపమది
ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది చంద్ర తాపమది
ఏమి ఆ..హొయలూ!
ఏమి కులుకు..సెలఏటి పిలుపు..అది ఏమి అడుగు..
కలహంస నడుగు హోయ్..ఏమి ఆ..లయలూ!
కలగా కదిలే ఆ.. అందం
కలగా కదిలే..ఆ..అందం..
కావాలన్నది నా హౄదయం..
కావాలన్నదీ..నా హౄదయం..
ఓ...శ్రావణ నీరదా..శారదా...

శారదా నను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా
ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా

నీలికళ్ళలో నా నీడ చూసుకొని
పాలనవ్వులో పూలు దోచుకొని పరిమళించేనా!
చెండువోలే విరిదండవోలే నిను గుండె కద్దుకొని..నిండు ముద్దుగొని పరవశించేనా..
అలలైపోంగే అనురాగం
అలలైపోంగే అనురాగం
పులకించాలి కలకాలం పులకించాలి కలకాలం
ఓ...శ్రావణా..నీరదా..శారదా...

శారదా నను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా
ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బు
గ్గా

శారద--1973




















సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి

దర్శకత్వం::K.విశ్వనాధ్
గానం::ఘంటసాల,P.సుశీల


పల్లవి::

శోభన్:: కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి
శారద:: ఆ వధువు వలపే విరిసేది ఈనాడే తొలిసారి
శోభన్:: అందుకే అందుకే తొలిరేయి..అంతహాయి అంతహాయి అంతహాయి

చరణం::1

శోభన్:: వెన్నెల కాచే మోమునుదాచి..చీకటి చేసేవు ఎందుకని?
శోభన్:: వెన్నెల కాచే మోమునుదాచి..చీకటి చేసేవు ఎందుకని?

శారద:: ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా..ఈ మోము జాబిలి దేనికని?

శోభన్:: అల్లరి చూపులతోనే నను..అల్లుకు పోయే వెందుకని?
శోభన్:: అల్లరి చూపులతోనే నను..అల్లుకు పోయే వెందుకని?

శారద:: ఆ..అల్లికలోనే తీయని విడదీయని బంధం వున్నదని..

శోభన్:: అందుకే అందుకే తొలిరేయి..అంతహాయి అంతహాయి అంతహాయి

చరణం::2

శోభన్::నీ పెదవీ కనగానే..నా పెదవీ పులకించింది ఎందుకని?
శోభన్::నీ పెదవీ కనగానే..నా పెదవీ పులకించింది ఎందుకని?

శారద:: విడి విడిగా వుండలేక..విడి విడిగా వుండలేక..
పెదవులు రెండూ...అందుకని

శోభన్:: ఎదురు చూసే పూలపానుపు ఓపలేక..ఉసురుసురన్నది ఎందుకని?
ఇద్దరినీ తన కౌగిలిలో..ముద్దు ముద్దుగా...అందుకని

శారద:: అందుకే అందుకే తొలి రేయి..అంత హాయి..అంత హాయి!
ఇద్దరు: అంత హాయి..అంత హాయి..అంత హాయి..అంత హాయి!

శారద--1973

























సంగీతం::చక్రవర్తి
రచన
::దాశరథి
గానం
::V.రామక్రిష్ణ ,P.సుశీల

శ్రీమతిగారికి తీరనివేళా
శ్రీవారి చెంతకు చేరని వేళా
శ్రీమతిగారికి తీరనివేళా
శ్రీవారి చెంతకు చేరని వేళా
చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు
మల్లెపూలు ఎందుకు మంచిగంధం ఎందుకు
ఎందుకూ.....ఇంకెందుకూ

శ్రీమతిగారికి తీరని వేళ
శ్రీవరికెందుకు ఈగోలా
శ్రీమతిగారికి తీరని వేళ
శ్రీవరికెందుకు ఈగోలా
చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే
మల్లెతావి చెప్పవే మంచి మాట చెప్పవే
చెప్పవే....చెప్పవే....

ఓ...చందమామా...
ఓ...చల్లగాలీ...
ఓ...చందమామా...
ఓ...చల్లగాలీ...
నాపైనా మీరైనా
చూపాలి జాలీ...
నాపైనా మీరైనా
చూపాలి జాలీ...
లలలలలలల హహహహా
బెట్టుచేసే అమ్మగారిని
బెట్టుచేసే అమ్మగారిని
గుట్టుగా నా చెంత చేర్చాలి
మీరే చెంత చేర్చాలి

శ్రీమతిగారికి తీరని వేళ
శ్రీవరికెందుకు ఈగోలా
చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే
మల్లెతావి చెప్పవే మంచి మాట చెప్పవే
చెప్పవే....చెప్పవే....

ఓ...దేవదేవా...
ఓ...ధీనబంధో...
ఓ...దేవదేవా
ఓ...దీనబంధో
ఒకసారి మావారి ఈ బాధ చూడు
ఒకసారి మావారి ఈ బాధ చూడు
ఆ...ఆ...ఆ...మ్మ మ్మ మ్మహూ...
అలకలోనే అలసిపోతే
అలకలోనే అలసిపోతే
ఇంతరేయి నవ్విపోయేను
ఎంతో చిన్నబోయేనూ...

శ్రీమతిగారికి తీరినవేళా
శ్రీవారి చెంతకు చేరినవేళా
చల్లగాలి ఎందుకు
చందమామ ఎందుకు
మల్లెపోలు ఎందుకూ
మంచిగంధం ఎందుకు
ఎందుకూ...ఇంకెందుకూ
...

Tuesday, January 15, 2008

ఖైదీ కాళిదాసు--1977





సంగీతం :: చక్రవర్తి
గానం
::S.P.బాలు,P.సుశీల
రచన::మైలవరపు గోపి

ఎవరీ చక్కనివాడు..ఎంతకూ చిక్కనివాడు..
ఎప్పటికి దారికొస్తాడో..
ఎవరీ చక్కనిచుక్క..సోకు దీని కాలికి మొక్క..
కాదన్నా వెంట పడుతుందీ..
హా..కాదన్నా వెంట పడుతుందీ..2

కదలిక ఉందీ..మబ్బులో కదలిక ఉందీ..
నీటికీ వేగం ఉందీ..గాలికీ చలనం ఉందీ..
విడిలోన ఉలుకూ పలుకూ లేకుందీ..
కదలిక ఉంది..మబ్బులో కదలిక ఉంది..
నీటికీ వేగం ఉంది..గాలికీ చలనం ఉంది..
విడిలోన ఉలుకూ పలుకూ లేకుందీ..

వయసొచ్చింది..దానితో వలపొచ్చింది
హా.. వయసొచ్చింది..దానితో వలపొచ్చిందీ
అందుకే చిన్నది తొందర పడుతోందీ..
అందుకే చిన్నది తొందర పడుతోందీ..

ఎవరీ చక్కనివాడు..ఎంతకూ చిక్కనివాడు..
ఎప్పటికి దారికొస్తాడో..
ఎవరీ చక్కనిచుక్క..సోకు దీని కాలికి మొక్క..
కాదన్నా వెంట పడుతుందీ..
హా..కాదన్నా వెంట పడుతుందీ..

కన్నేసిందీ..కళ్ళతో కట్టేసిందీ..
చూపుతో చంపేస్తుందీ..నవ్వుతో బ్రతికిస్తుందీ..
అమ్మమ్మో కుర్రది చాలా టక్కరిదీ..
కన్నేసింది..కళ్ళతో కట్టేసింది..
చూపుతో చంపేస్తుంది..నవ్వుతో బ్రతికిస్తుంది..
అమ్మమ్మో కుర్రది చాలా టక్కరిదీ..

వీడితో అవుననిపించీ కొంగుముడి వెయ్యకపోతే
వీడితో అవుననిపించీ కొంగుముడి వెయ్యకపోతే
ఎందుకీ ఆడజన్మ ఓయమ్మా..
ఎందుకీ ఆడజన్మ ఓయమ్మా..

ఎవరీ చక్కనివాడు..ఎంతకూ చిక్కనివాడు..
ఎప్పటికి దారికొస్తాడో..
ఎవరీ చక్కనిచుక్క..సోకు దీని కాలికి మొక్క..
కాదన్నా వెంట పడుతుందీ..
హా..కాదన్నా వెంట పడుతుందీ
..

Monday, January 14, 2008

చెల్లెలి కాపురం--1971



సంగీతం::K.V..మహాదేవన్
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::S.జానకి
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,మణిమాల,నాగభూషణం,ఛాయాదేవి,నిర్మల,K.V.చలం.
అల్లు రామలింగయ్య   

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
బలె బలే మా..అన్నయ్యా బంగారం లాంటన్నయ్య 
హోయ్..బలె బలే మా అన్నయ్యా బంగారం లాంటన్నయ్య 
ఇలాంటి వాడు లోకంలో..నూటికి కోటికి ఒకడయ్యా
ఇలాంటి వాడు లోకంలో..నూటికి కోటికి ఒకడయ్యా
హోయ్..బలె బలే మా అన్నయ్యా - బంగారం లాంటన్నయ్య 

చరణం::1

చల్లని వార్త పంపాడూ..కొల్లగ ఆశలు పెంచాడూ
చల్లని వార్త పంపాడూ..కొల్లగ ఆశలు పెంచాడూ
చీకటి పాలౌ చెల్లి బ్రతుకున..వేయి దీపములు వెలిగించాడూ
బలె బలే మా అన్నయ్యా..బంగారం లాంటన్నయ్య 
హోయ్..బలె బలే మా అన్నయ్యా బంగారం లాంటన్నయ్య 

చరణం::2

ఎన్నెన్నో పుస్తకాలు రాస్తాడూ..ఎంతెంతో పేరు తెచ్చుకుంటాడూ
ఎన్నెన్నో పుస్తకాలు రాస్తాడూ..ఎంతెంతో పేరు తెచ్చుకుంటాడూ
మెడ నిండా దండలతో..మేళ తాళాలతో
మెడ నిండా దండలతో..మేళ తాళాలతో
ఊరూర అన్నయ్యా ఊరేగుతూ వస్తాడూ..ఆ ఆ  
బలె బలే మా అన్నయ్యా..బంగారం లాంటన్నయ్య 
ఇలాంటి వాడు లోకంలో..నూటికి కోటికి ఒకడయ్యా
హోయ్..బలె బలే మా అన్నయ్యా బంగారం లాంటన్నయ్య

Saturday, January 12, 2008

మనసు-మాంగల్యం--1971




సంగీతం::పెండ్యలనాగేశ్వరరావు 
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::అక్కినేని,జమున,జగ్గయ్య,అంజలీదేవి,పద్మనాభం,రమణారెడ్డి,చంద్రమోహన్,రామకృష్ణ,గీతాంజలి.

పల్లవి::

పో పో పో..ఎంతదూరంపోతావో  
పో పో పో..ఎంతదూరంపోతావో
పోయి పోయి..చూడు నువ్వెక్కడ వుంటావో  
నా...పక్కనె వుంటావు
రా రా రా..ఎంత దూరం వస్తావో 
రా రా రా..ఎంత దూరం వస్తావో  
వచ్చి వచ్చి..చూడు నన్నందుకుంటావో  
నా..సొంతమవుతావో..రా రా రా 

చరణం::1

మరునీ విల్లునుండి అమ్ములాగ..బెదరీ తుళ్ళిపడే లేడిలాగ
మరునీ విల్లునుండి అమ్ములాగ..బెదరీ తుళ్ళిపడే లేడిలాగ
పరుగుతీసేవు పారిపొయ్యేవు..పరువమే నీదని గర్వమా  
నిన్ను...పట్టుకోలేననీ...పందేమా  
మరుపేరాని తీపి తలపులాగ..అలుపే లేని కోడె వలపులాగ
మరుపేరాని తీపి తలపులాగ అలుపే లేని కోడె వలపులాగ
ఉరకలు వేసేవు తరముకు వచ్చేవు..మగసిరే నీదని  
గర్వమా...నన్ను గెలిచుకోవలేననీ పంతమా
రా రా రా..ఎంత దూరం వస్తావో  
వచ్చివచ్చి..చూడునన్నందుకుంటావో  
నా..సొంతమవుతావో..రా రా రా 

చరణం::2

వయసూ వెంటబడే సొగసునీవు..మనసు కోరుకునే మమతనీవు 
వయసూ వెంటబడే సొగసునీవు..మనసు కోరుకునే మమతనీవు
రెండూ కలవాలి రెండూ గెలవాలి..మనసులో సొగసులే తెలియాలి  
తీపి మమతలో...వయసునే మరవాలి..ఆహాహా  
రా రా రా..ఎంత దూరం వస్తావో 
పో పో పో..ఎంతదూరంపోతావో..హాహాహా  

Thursday, January 10, 2008

హేమాహేమీలు--1974



సంగీతం::రమేష్‌నాయుడు
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,S.P.శైలజ 
తారాగణం::అక్కినేని,కృష్ణ,సత్యనారాయణ,గుమ్మడి,పద్మనాభం,విజయనిర్మల,జరీనావహబ్,రమాప్రభ 

పల్లవి::

నువ్వంటే..నాకెంతో ఇష్టం
జువ్ జువ్వునలాగే..నీ చూపంటే మరీ మరీ ఇష్టం
నువ్వంటే..నాకెంతో ఇష్టం
జువ్ జువ్వునలాగే..నీ చూపంటే మరీ మరీ ఇష్టం

నేనంటే ఎందరికో..ఇష్టం
నన్నెదిరించే మొనగాడంటే..నాకెంతో ఇష్టం
నేనంటే ఎందరికో..ఓఓఓ..ఇష్టం

Red Lion Red Lion..Reach us to Red Lion 

చరణం::1

జూ..ఊ..జూజూ..లలలలాలల..జూజూ 
నీ పేరంటే..ఎందరికో..ఓఓఓ..భయం
నీ తోడుంటే..నాకేమో ప్రియం
నీ పేరంటే..ఎందరికో..ఓఓఓ..భయం
నీ తోడుంటే..నాకేమో ప్రియం
నీ మాటే మధురసం..నీ నడకే పాదరసం
నీ మాటే మధురసం..హహహా..నీ నడకే పాదరసం

మధురసం కోరుకుంటే..మరేమి పరవాలేదు
పాదరసం తాగావంటే..ప్రాణానికే నష్టం

నేనంటే ఎందరికో..ఇష్టం
నన్నెదిరించే మొనగాడంటే..నాకెంతో ఇష్టం

నువ్వంటే నాకెంతో ఇష్టం..Is it?
జువ్ జువ్వునలాగే..నీ చూపంటే మరీ మరీ ఇష్టం
నువ్వంటే నాకెంతో..ఓఓఓఓ..ఇష్టం

Red Lion Red Lion... Reach us to Red Lion 

చరణం::2

పా..పప..లలలా..లల
పా..పప

నీ సొగసంటే..ఎందరికో..ఓఓఓ..నిషా
అది చూస్తుంటే..నాకేమో తమాషా
నీ సొగసంటే..ఎందరికో..ఓఓఓ..నిషా
అది చూస్తుంటే..నాకేమో తమాషా

నీ పరువం నాగిని..అది నీతోనే ఆగనీ
నీ పరువం నాగిని..అది నీతోనే ఆగనీ
మాటలతో కవ్విస్తే..మనసు ఊరుకోదు
తాపం మరింత పెరిగితే..తట్టుకోవడం కష్టం

నువ్వంటే నాకెంతో..ఇష్టం
జువ్ జువ్వునలాగే..నీ చూపంటే.. మరీ మరీ ఇష్టం


Saturday, January 05, 2008

బలి పీఠం--1975::శంకరాభరణ::రాగం



సంగీతం::చక్రవర్తి
రచన::దేవులపల్లి కౄష్ణశాస్త్రి
గానం::S.P.బాలు,P.సుశీల


శంకరాభరణ::రాగం

కుశలమా నీకు కుశలమేనా
మనసు నిలుపుకోలేకా
మరి మరి అడిగాను
అంతే అంతే అంతే


కుశలమా నీకు కుశలమేనా
ఇన్నినాళ్ళు వదలలేకా
ఎదో ఎదో వ్రాసాను అంతే అంతే అంతే

!! కుశలమా !!
చిన్నతల్లి ఏమందీ
నాన్న ముద్దు కావాలంది
పాలు గారు చెక్కిలిపైన
పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవుల పైన
దేవిగారికొకటి
ఒకటేనా.....ఒకటేనా
హహ...ఎన్నైనా....ఆ...
హాయ్ ఎన్నెన్నో......
మనసు నిలుపుకోలేక మరి మరి
అడిగాను అంతే అంతే అంతే


!! కుశలమా .. హాయ్ !!
పెరటిలోని పూల పానుపు
త్వర త్వరగా రమ్మంది
పొగడ నీడ పొదరిల్లు
దిగులు దిగులుగా ఉంది
ఎన్ని కబురులొచ్చేనో
ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కల పైన
నీలి మబ్బు పాయలపైనా
అందేనా ఒకటైనా
అందెనులే తొందర తెలిసెనులే


!! కుశలమా
!!

బలిపీఠం--1975::యదుకుల కాంభోజి::రాగం






సంగీతం!!చక్రవర్తి
రచన::దాశరథి
గానం::V.రామకృష్ణ ,P.సుశీల


రాగం::యదుకుల కాంభోజిపహడి(లేక) హిందుస్తానీ
పహడిలో తరుచు ప్రతిధ్వని వుంటుంది


చందమామ రావే జాబిల్లి రావే
అమ్మాయి అలిగింది అలకతీర్చిపోవే
అలకతీర్చిపో
వే


చందమామ రావే జాబిల్లి రావే
అబ్బాయి నోటికి తాళమేసి పోవే
తాళమేసి పోవే
చందమామ రావే...


చల్లగాలి జడిపిస్తోంది ఎలాగా...
గళ్ళదుప్పటి కప్పుకొండి ఇలాగా
పండువెన్నెల రమ్మంటుంది ఎలాగా
తలుపుతీసా వెళ్ళిరండి ఇలాగా
అందాల ఈరేయి వెళతాను అంటొంది
ఇద్దరిని ఒక్కటిగ చూడాలని అంటుంది
ఏదో వంకతో ఎందుకు పిలవాలీ
కావాలంటే సూటిగానే అడగలేరా
చందమామ రావే జాబిల్లి రావే
అబ్బాయి నోటికి తాళమేసి పోవే
తాళమేసి పోవే
చందమామ రావే..
.

అమ్మాయి పుడితేను ఎలాగా
పెళ్ళిచేసి పంపాలి ఇలాగా
అబ్బాయి పుడితేను ఎలాగా
గొప్పవాణ్ణి చేయాలి ఇలాగా
అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా
మీలాగే వుండాలి మీ మనసే రావాలి
తల్లే పాలతో మంచిని పోయాలి
ఆ మంచితోనే�ోనే వారు మనకు పేరు తేవాలి
చందమామ రావే జాబిల్లి రావే
పాపాయి పుడితేను జోలపాడ రావే
జోలపాడ రావే
చందమామ రావే.
...

కార్తీక దీపం--1979::కానడ::రాగం




సంగీతం:: సత్యం
రచన::M.గోపి

గానం::S.జానకి,S.P.బాలు.

కానడ::రాగం

(హిందుస్తానీ ~ కర్నాటక)

పల్లవి::

నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ

నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ

నీ కౌగిలిలో తల దాచి...

చరణం::1

చల్లగ కాసే పాల వెన్నెల
నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ చిరుగాలి
నా కోరికలే వినిపించు
నా కోవెలలో స్వామివి నీవై
వలపే దివ్వెగ వెలిగించు

నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ

నీ కౌగిలిలో తల దాచి..

చరణం::2

నింగి సాక్షి..నేల సాక్షి
నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన మనుగడలోన 
నాలో నీవే సగపాలు
వేడుకలోను..వేదనలోను
పాలు తేనెగ ఉందాము

నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ

నీ కౌగిలిలో తల దాచి..

Friday, January 04, 2008

కార్తీక దీపం--1979



సంగీతం::సత్యం
రచన
::దేవులపల్లి కౄష్ణశాస్త్రి
గానం
::P.సుశీల,S.జానకి
రాగం:::కాఫీ

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం కర్పూరదీపం
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం
ఇదే సుమా నా కుంకుమతిలకం
ఇదే సుమా నా మంగళసూత్రం

ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం

ఇంటిలోన నా పాపరూపునా గోరంతదీపం
కంటికెదురుగా కనబడువేళలా కొండంతదీపం
నా మనస్సులో వెలిగేదీపం
నామనుగడ నడిపే దీపం

ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం

ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో
ఈకోనేట ఈ చిరుదివ్వ్యల చూసి చుక్కలనుకొంటారు
ఏవైనా ఏదైనా కోవెలలో కొలువైవుండే దేవికిపట్టే హారతులే

ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం
చేరనీ నీపాద పీఠం నా ప్రాణదీపం

నోచిన నోముల పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
నోచిన నోముల పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
ఎటనైనా ఎపుడైనా నే పలికే కళ్యాణదీపం
నే వలచే నా ప్రాణదీపం

ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం

Thursday, January 03, 2008

కార్తీక దీపం--1979







సంగీతం::సత్యం
రచన
:: 
మైలవరపు గోపి 
గానం
::SP.బాలు,P.సుశీల
రాగం:::ఆనందభైరవి
యే మాట
అహా..తెలుసు
అదికాదు
ఇంకేమిటీ
చెపితే చాలదూ...
కోరిక తీరదూ...
ఇది విన్నదే...
రోజు వున్నదే...
చెపితే చాలదూ...
కోరిక తీరదూ...
ఇది విన్నదే...
రోజు వున్నదే...
యే మాట
అహా..తెలుసు
అదికాదు
ఇంకేమిటీ
చెపితే చాలదూ...
కోరిక తీరదూ...
ఇది విన్నదే...
రోజు వున్నదే...

పగలంత నా మాట వింటావట
పడకిల్లుచేరంగ దయరాదట
ఆవేళలో నీకు ఇల్లాలినీ
ఈఝాము నీపైన అధికారినీ

యే మాట
అహా..తెలుసు
అబ్బా..అదికాదు
హా..ఇంకేమిటీ
చెపితే చాలదూ...
కోరిక తీరదూ...
ఇది విన్నదే...
రోజు వున్నదే...!!

పలకుంటే ఒకసారి ననుదోచుకో
కౌగిట బంధిచి ముద్దాడుకో
ఎన్నైనచెపుతావు ఈఘడియలో
చాలన్నదేలేదు నీభాషలో

యే మాట
అహా..తెలుసు
..అదికాదు
హా..ఇంకేమిటీ
చెపితే చాలదూ...
కోరిక తీరదూ...
ఇది విన్నదే...
రోజు వున్నదే...
ఆహా...ఆహ..హా...మ్మ్మమ్మ్మ
!!

Wednesday, January 02, 2008

అందరూ దోంగలే--1974







సంగీతం::KVమహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::మోహన్‌దాస్,S.P.బాలు


చంటి బాబూ
ఓ..బుజ్జి బాబూ
చంటి బాబూ
ఓ..బుజ్జి బాబూ
నీ పంట పండితే నవాబూ
వుంది తాళం ఏది బీగం
లేనేలేదా జవాబూ
వుంది తాళం ఏది బీగం
లేనేలేదా జవాబూ
మంచి ఖజానా
మనకు....?
నిధి దొరికేనా
నీకు బజాన
దారినపోయే చక్కనిదానా
బాగున్నానా..హ్హ..
నీ పక్కకురానా
చంటి బాబూ
ఓ..బుజ్జి బాబూ
నీ పంట పండితే నవాబూ


దారిలోనా మాకు చిక్కింది
లక్కీ నాడా..
చిన్నదానా..నీవు చెప్పాలి
గుర్రపు జాడా...
దారిలోనా మాకు చిక్కింది
లక్కీ నాడా..
చిన్నదానా..నీవు చెప్పాలి
గుర్రపు జాడా..........
వెదకాలీ దీనికి జోడీ
వెదకాలీ దీనికి జోడీ
అది చూపవే ఓ వగలాడీ..
ఒప్పులకుప్పా..చెపితే తప్పా
కంటికిరెప్పా..ముత్యపుచిప్పా
ఎక్కడవుంటావ్ తాళంకప్ప
చూటుచెప్పూ..హ్హ..చిక్కుముడివిప్పూ
చంటి బాబూ
ఓ..బుజ్జి బాబూ
నీ పంట పండితే నవాబూ


పదనాన్నా..మనలాభం
బండి సున్నా...

అచ్చుబోసి తెగ నచ్చింది
అత్తా..రిల్లూ..
అంతలోనే..ఇది దొరికింది
ఫలితం నిల్లూ
అచ్చుబోసి సాగ నంపింది
అత్తారిల్లూ
అంతలోనే..ఇది దొరికింది
ఫలితం నిల్లూ
గతి ఏదని నిన్నడిగేమూ
గతి ఏదని నిన్నడిగేమూ
అది చెపితే నీకు సలామూ..
నీ గులాము మేమవుతాము
నీవడిగింది చేసేస్తాము
రోజూ రోజూ సేవిస్తాము
చెప్పు గుట్టూ..హ్హ
దారి చూపేట్టూ...
చంటి బాబూ
ఓ..బుజ్జి బాబూ
నీ పంట పండితే నవాబూ
హా..వదిలెయర


పదరా నా మనరాత
బండి సున్నా

ఏడుకొండలవాడా
వేంకటారమణా
ఆపదమొక్కులవాడా
నువ్వే శరణు..

ఓ స్వామీ మాకు ఇచ్చావు
నువ్వో తాళం
అంతర్యామి కాని చేసావు
మాయాజాలం
ఓ స్వామీ మాకు ఇచ్చావు
నువ్వో తాళం
అంతర్యామి కాని చేసావు
మాయాజాలం
చూపిస్తే సొమ్ములమూటా..
చూపిస్తే సొమ్ములమూటా..
మేమిస్తాం నీకో వాటా..
మా ఈ నోట రాజులజూట
ఆడినమాట అగ్గిబరాట
ఒడ్డుకలాట చూపుముబాట
ఆగలేదా..హ్హ
నీకు డబ్బు చేదా..
చంటిబాబూ..
ఓ..బుజ్జిబాబూ
నీ పంట పండితే నవాబూ
చంటిబాబూ..
ఓ..బుజ్జిబాబూ..
చంటిబాబూ..
ఓ..బుజ్జిబాబూ..
చంటిబాబూ..
ఓ..బుజ్జిబాబూ.
....




VICTORIA NO.203--1972
Music::Anandji Virji Shah, Kalyanji Virji Shah
lyrics::Verma Malik
Singer's::Kishore Kumar, Mahendra Kapoor
Film Director::Brij
Cast::Navin Nischol, Saira Banu, Pran, Ashok Kumar

::::::::::::::::::::::::::::

help me please to find the locker find the locker
help me please to find the locker
help me please to find the locker find the locker
help me please to find the locker

do bechare bina sahaare, dekho puchh-puchh kar haare
do bechare bina sahaare, dekho puchh-puchh kar haare
bin taale ki chabhi lekar phirte maare-maare
main hu raja yeh hai rana, o main diwaana yeh mastaana
dono milke gaaye gaana o hasina o jara ruk jaana
o jara ruk jaana
help me please to find the locker find the locker
help me please to find the locker

help me please to find the locker find the locker
help me please to find the locker
o father apna aisa huva hai ghotaala
o father apna aisa huva hai ghotaala
mili chabhi par mila hai nahi humko taala
gar maal milega jyaada, gar maal milega jyaada
tujhko de denge aadha yeh hai vaada, kya iraada
koi kaam nahi hai jyada, le ke jaana adha adha
yeh offer le lona, o binati sun lo na
do bechare bina sahaare, dekho puchh-puchh kar haare
help me please to find the locker find the locker
help me please to find the locker

ek chabhi chabhi sapne hazaar, sab aar paar ka phera hai
mere taal taal kyun tu faraar, bas tu hi mit ghanera hai
baje bin bin nache bekaraar, hum saap saap tu sapera hai
phir dwaar dwaar pite baar baar, kab in raato ka sabera hai
dil taar taar roye jaar jaar, khushiyo ka kaun lutera hai
parvardigaar parvardigaar bas hame bharosa tera hai

tu bata de iska milta nahi humko locker
tu bata de iska milta nahi humko locker
kuchh pata de tere ban jaayenge hum naukar
sasuraal se dekho hum aaye
sasuraal se dekho hum aaye
chabhi lekar pachhtaaye hai ghabraaye 
sar chakaraaye kuchh na bhaaye, aake tumse hi takraaye
dhakke khaaye, samajh na aaye o paape
o kuchh bolo na, o kuchh bolo na 

do bechare bina sahaare, dekho puchh-puchh kar haare
bin taale ki chabhi le kar phirte maare maare
main hu raja yeh hai rana, o main diwaana yeh mastaana
dono milke gaaye gaana o hasina o jara ruk jaana
o jara ruk jaana
help me please to find the locker find the locker
help me please to find the locker
help me please to find the locker find the locker

help me please to find the locker

Tuesday, January 01, 2008

అందరూ దోంగలే--1974




సంగీతం::K.V.మహాదేవన్
రచన:: కొసరాజు రాఘవయ్య  
గానం::S.P.బాలు,P.సుశీల

నాయుడోళ్ళింటికాడ
నల్లతుమ్మచెట్టుకింద
నాయుడేమన్నాడె పిల్లా
అబ్భా గుండె ఝల్లుమన్నాదె బుల్లా


నాయుడోళ్ళింటికాడ
నల్లతుమ్మచెట్టుకింద
నాయుడేమన్నాడె పిల్లా
అబ్భా గుండె ఝల్లుమన్నాదె బుల్లా
నాయుడోళ్ళింటుకాడ
నల్లతుమ్మచెట్టుకింద
గుట్టుబైట పెట్టాడే అప్పుడూ
అబ్భా గుండె ఝల్లుమన్నాదే ఇప్పుడూ

నాయుడోళ్ళింటుకాడ
నల్లతుమ్మచెట్టుకింద
గుట్టుబైట పెట్టాడే అప్పుడూ
అబ్భా గుండె ఝల్లుమన్నాదే ఇప్పుడూ


ఎలా ఎలా అన్నాడు
ఏమిచేయమన్నాడూ
మల్లెమొగ్గలాంటిపిల్ల
ఒళ్ళోన వాలుతుంటే
జారులో మన్నాడా
జూరుకోమన్నాడా
జారులో మన్నాడా
జూరుకోమన్నాడా

నాయుడేమన్నాడె పిల్లా
అబ్భా గుండె ఝల్లుమన్నాదె బుల్లా

వాలుకన్నుల చినదాన్ని
వదలకూడదు అన్నాడు
ఇంతకన్నా మంచిరోజు
ఎప్పుడూ రాదన్నాడు
చెయ్యివేయమన్నాడూ
అయ్యాయ్యో చెప్పకూడదన్నాడూ
చెయ్యివేయమన్నాడూ
చెప్పకూడదన్నాడూ

నాయుడోళ్ళింటుకాడ
నల్లతుమ్మచెట్టుకింద
గుట్టుబైట పెట్టాడే అప్పుడూ
అబ్భా గుండె ఝల్లుమన్నాదే ఇప్పుడూ


కల్లి బొల్లి సాకులన్ని
కట్టిపెట్టమన్నాడా
కంటి సైగ తెలుసుకొని
కలుసుకోమన్నాడా
పిట్ట పడతదన్నాడా
వీపు చిడతదన్నాడా
పిట్ట పడతదన్నాడా
వీపు చిడతదన్నాడా

నాయుడే మన్నాడే పిల్లా
అబ్భా గుండెఝల్లుమన్నాదే బుల్లా

సందెపొద్దుదాక నీతో సరసమాడి
సద్దుచేయకుండ వుండమన్నాడు
మనసుతీర నీతో మాటలాడి
తొందరేమి చేయకుండ ఆగమన్నాడు
దారిచూదమాన్నాడూ...
అమ్మమ్మ్మమ్మో దౌడుతీయమన్నాడు
దారిచూదమనాడు
దౌడుతీయమన్నాడు

నాయుడోళ్ళింటికాడ
నల్లతుమ్మచెట్టుకింద
నాయుడేమన్నాడె పిల్లా
అబ్భా గుండె ఝల్లుమన్నాదె బుల్లా

నాయుడోళ్ళింటుకాడ
నల్లతుమ్మచెట్టుకింద
గుట్టుబైట పెట్టాడే అప్పుడూ
అబ్భా గుండె ఝల్లుమన్నాదే ఇప్పుడూ

లల్లాల్లల్లాల్లా
ఆ..హా..హా...ఊ..హో...హో.
.

ఇద్దరూ ఇద్దరే--1976



సంగీతం::చక్రవర్తి
రచన::దాశరథి 
గానం::SP.బాలు,P.సుశీల

ఆకుమీద ఆకుపెట్టి
ఆకులోన సున్నమెట్టి
ఆకుమీద ఆకుపెట్టి
ఆకులోన సున్నమెట్టి
చిలకచుట్టి తెచ్చానయ్యో
చిన్నయ్యో..ఓ..ఓ..ఒడుపుతెలిసి
కొరకాలయ్యో రాజయ్యో..హా..
ఒడుపుతెలిసి కొరకాలయ్యో..రాజయ్యో

మావిడంచు చీరగట్టి
మల్లెపూలచెండుపెట్టి
మావిడంచు చీరగట్టి
మల్లెపూలచెండుపెట్టి
చిలకచుట్టి నోటికిస్తే
చిన్నమ్మో..ఓ..నీ బుగ్గమీద
గంటుపడనే సీతమ్మో...హా..
బుగ్గమీద గంటుపడనే..సీతమ్మో..హేయ్

ఆకుమీద ఆకుపెట్టి
ఆకులోన సున్నమెట్టి..హా..ఆ..!!


:::1


తీయతీయటి మావిడిపళ్ళు
కొరిమేను ఇట్టంటే..హా..
తీయతీయటి మావిడిపళ్ళు
కొరిమేను ఇట్టంటే
కొంగులాగి ఏవేవో కోంటే పనులు
చేసేవా..ఏవయ్యో..రాజయ్యో
ఏవయ్యో రాజయ్యో ఇదినీకు తగదయ్యో...

తీయతీయటి పండువు నీవే
తీనేలూర్చిన తీపివి నీవే..ఆ..హా..ఆ..హా..
హోయ్..తీయతీయటి పండువు నీవే
తీనేలూర్చిన తీపివి నీవే
కొంగుదాచిన పరువాలన్ని
దొంగిలించుకొ పోతానే ఏవమ్మో..సీతమ్మో
ఏవమ్మో...సీతమ్మో...వదిలేది లేదమ్మో
ఏ..హే.....సీతమ్మో....

ఆకుమీద ఆకుపెట్టి
ఆకులోన సున్నమెట్టి
చిలకచుట్టి నోటికిస్తే
చిన్నమ్మో..ఓ..నీ బుగ్గమీద
గంటుపడనే సీతమ్మో...హా..
ఒడుపుతెలిసి కొరకాలయ్యో..రాజయ్యో


:::2


ఊసులేవో చెపుతానంటే
ఆశతోటి చెతకువస్తే..ఆ..హ..
ఊసులేవో చెపుతానంటే
ఆశతోటి చెతకువస్తే
పొదచాటుకు లాగేసీ
పోకిరి పనులే చేసేవా..
ఏవయ్యో...రాజయ్యో...
ఏవయ్యో రాజయ్యో ఇదినీకు తగదయ్యో...

దోరవయసు కవ్విస్తుంటే
ఓరచూపు ఊరిస్తుంటే..అహా..హా..
దోరవయసు కవ్విస్తుంటే
ఓరచూపు ఊరిస్తుంటే
ఒళ్ళుమరచి వాటేసుకోనా
చూడని స్వర్గం చూపించేనా
ఏనమ్మో...సీతమ్మో....
ఏనమ్మో...సీతమ్మో..వదిలేది లేదమ్మో..
హే..హే..హే....సీతమ్మో...

ఆకుమీద ఆకుపెట్టిఆకులోన సున్నమెట్టి
చిలకచుట్టి తెచ్చానయ్యో
చిన్నయ్యో..ఓ..ఓ..ఒడుపుతెలిసి
కొరకాలయ్యో రాజయ్యో..హా..
ఒడుపుతెలిసి
కొరకాలయ్యో రాజయ్యో


మావిడంచు చీరగట్టి
మల్లెపూలచెండుపెట్టి
మావిడంచు చీరగట్టి
మల్లెపూలచెండుపెట్టి
చిలకచుట్టి నోటికిస్తే
చిన్నమ్మో..ఓ..నీ బుగ్గమీద
గంటుపడనే సీతమ్మో...హా..
బుగ్గమీద గంటుపడనే..సీతమ్మో

ఇద్దరూ ఇద్దరే--1976























సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర 
గానం::SP.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,కృష్ణంరాజు,ప్రభాకరరెడ్డి,పద్మనాభం,మంజుల,చంద్రకళ,రాజబాబు


:::
ఒళ్ళంత వయ్యరమే...చిన్నదాన
ఒక చిన్న ముద్దియ్యవే కుర్రదానా
అహా.. ఇవ్వాలనే వుందిరా..చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాదా
అరెరెరెరె....
ఒళ్ళంత వయ్యరమే...చిన్నదాన
ఒక చిన్న ముద్దియ్యవే కుర్రదానా
అమ్మమ్మ్మమ్మో...
ఇవ్వాలనే వుందిరా..చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాదా
ఊ...ఉసులాడ చోటుకాదు
ఆ..చాటువుంది అందాల తోటలోన
మందార చెట్టుకింద
నా ముద్దు చెల్లించవే
ఒ...ఒ...ఒళ్ళంత వయ్యరమే..చిన్నదాన
ఒక చిన్న ముద్దియ్యవే కుర్రదానా
ఆ..హా...హా...ఇవ్వాలనే వుందిరా..
చిన్నవాడ ఎవరైన చూస్తారురా
...వన్నెకాదా.......


:::1


పువ్వల్లే నవ్వుతావు
కవ్వించి కులుకుతావు
పువ్వల్లే నవ్వుతావు
కవ్వించి కులుకుతావు
కులుకంతా కూరవండి
మనసార తినిపించాలి
హా..కులుకంతా కూరవండి
మనసార తినిపించాలి..హా...
రారాని వేళలోన రాజల్లే వస్తావూ
రారాని వేళలోన రాజల్లే వస్తావూ
ఏమేమో చేస్తావురా....
అబ్బబ్బబ్బా..అందాల వాడలోన
అద్దాలమేడలోన ఇద్దరమే వుందామురా
ఓ..హో..ఒ..ఒళ్ళంత వయ్యరమే...చిన్నదాన
ఒక చిన్న ముద్దియ్యవే కుర్రదానా
అయ్యయ్యయ్యో....
ఇవ్వాలనే వుందిరా..చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాదా


:::2


హోయ్...మనసంతా మాలకట్టి
మెడలోనే వేస్తాను
మనసంతా మాలకట్టి
మెడలోనే వేస్తాను
మనువాడే రోజుదాకాఓరయ్యో
ఆగలేవా
హా...మనువాడే రోజుదాకాఓరయ్యో
ఆగలేవా..ఓ....
అందాక ఆగలేనే నా వయసు ఊరుకోదే
అందాక ఆగలేనే నా వయసు ఊరుకోదే
వయ్యారి నన్నాపకే...
అమ్మమ్మమ్మా పన్నీటి వాగుపక్క
సంపంగితోటలోన నీదాన నౌతానురా
ఓ..హో..ఒ...ఒళ్ళంత వయ్యారమే..
చిన్నదాన ఒక చిన్న ముద్దియ్యవే
ఓ కుర్రదానా....
అమ్మ్మమ్మ్మమ్మ్మమ్మా...ఇవ్వాలనే వుందిరా
చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాడ..
ఊ...ఉసులాడ చోటుకాదు
ఆ..చాటువుంది అందాల తోటలోన
మందార చెట్టుకింద
నా ముద్దు చెల్లించవే
ఒ..హో.ఒ...ఒళ్ళంత వయ్యరమే..చిన్నదాన
ఒక చిన్న ముద్దియ్యవే కుర్రదానా
అమ్మమ్మమ్మా ఇవ్వాలనే వుందిరా..
చిన్నవాడ ఎవరైన చూస్తారురా
...వన్నెకాదా...
....

బంగారు బాబు--1973




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
Film Director::V.B.Rajendra Prasad
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,జయంతి,రాజబాబు,S.వరలక్ష్మీ,కృష్ణ,శోభన్‌బాబు,
నాగభూషణం,పద్మనాభం.

పల్లవి::

గౌరమ్మ తల్లీ గౌరమ్మ తల్లీ
కోరిన కోర్కెలు తీర్చేతల్లీ
గౌరమ్మ తల్లీ గౌరమ్మ తల్లీ
కోరిన కోర్కెలు తీర్చేతల్లీ
కోరిన కోర్కెలు తీర్చేతల్లీ

సిరులిచ్చినావు గుణమిచ్చినావూ
చక్కని..సొగసిచ్చినావూ
సొగసును మించిన..మనసిచ్చినావూ
సిరులిచ్చినావు గుణమిచ్చినావూ
చక్కని..సొగసిచ్చినావూ
సొగసును మించిన..మనసిచ్చినావూ
మనసునుకు తగిన..మనువీయవమ్మా
మనసునుకు తగిన..మనువీయవమ్మా
నా మనుగడ..నిలకడ చేయవమ్మా  
గౌరమ్మ తల్లీ గౌరమ్మ తల్లీ
కోరిన కోర్కెలు..తీర్చేతల్లీ
కోరిన కోర్కెలు..తీర్చేతల్లీ

చరణం::1

చదువున్నవాడా..సరి అందగాడా
చదువున్నవాడా..సరి అందగాడా  
ఎవరమ్మ నీకూ..తగుజోడు  
నను మెచ్చువాడు..మనసిచ్చువాడు
నను మెచ్చువాడు..మనసిచ్చువాడు
వలపించి బులిపించి..వయసేలువాడు 
గౌరమ్మ తల్లీ గౌరమ్మ తల్లీ
కోరిన కోర్కెలు..తీర్చేతల్లీ
కోరిన కోర్కెలు..తీర్చేతల్లీ

చరణం::2

నిరుపేదనైనా..వరియించగలవా
వలపులు..కురిపించగలవా
కులమేదైనా..పెండ్లాడగలవా  
నిరుపేదనైనా..వరియించగలవా
వలపులు..కురిపించగలవా
కులమేదైనా..పెండ్లాడగలవా   
పేదవాడైనా..ప్రేమున్నచాలు
పేదవాడైనా..ప్రేమున్నచాలు
పొత్తుకుదిరితే..పూరిపాకైన చాలు   
గౌరమ్మ తల్లీ గౌరమ్మ తల్లీ
కోరిన కోర్కెలు తీర్చేతల్లీ
కోరిన కోర్కెలు తీర్చేతల్లీ
మనసునుకు తగిన మనువీయవమ్మా
మనసునుకు తగిన మనువీయవమ్మా
నా మనుగడ నిలకడ చేయవమ్మా   
గౌరమ్మ తల్లీ గౌరమ్మ తల్లీ
కోరిన కోర్కెలు తీర్చేతల్లీ
కోరిన కోర్కెలు తీర్చేతల్లీ