సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::సుశీల,బృందం
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు
ఎందువలన దేముడు?
తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను..ఊ..
తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేవుడు
అందాల రాముడు..ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు..ఎందువలన దేముడు?
అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను..ఊ..
అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి జేసెను|
అందాల రాముడు అందువలన దేవుడు
అందాల రాముడు..ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు..ఎందువలన దేముడు?
ధర్మపత్ని చెర బాపగ దనుజుల దునుమాడెను..ఊ..
ధర్మపత్ని చెర బాపగ దనుజుల దునుమాడెను
ధర్మము కాపాడుటకా..సతినే విడనాడెను
అందాల రాముడు..అందువలన దేముడు
అందాల రాముడు..ఇందీవర శ్యాముడు
అందాల రాముడు..ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు..ఇలలో మన దేముడు
ఇనకులాబ్ది సోముడు..ఇలలో మన దేముడు
అందాల రాముడు..ఇందీవర శ్యాముడు
అందాల రాముడు..ఇందీవర శ్యాముడు
అందాల రాముడు..
అందాల రాముడు..
అందాల రాముడు..ఇందీవర శ్యాముడు
అందాల రాముడు..ఇందీవర శ్యాముడు
అందాల రాముడు..ఇందీవర శ్యాముడు
అందాల రాముడు..ఇందీవర శ్యాముడు