సంగీతం::O.P.నయ్యర్
రచన::రాజశ్రీ
గానం::M.S.రామారావు
తారాగణం::శరణ్య,విశ్వాస్.
పల్లవి::
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో..ఓ
నిదురించు జహాపనా..నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో..ఓ
నిదురించు జహాపనా..నిదురించు జహాపనా
చరణం::1
పండు వెన్నెల్లో..వెండీ కొండల్లే
తాజ్ మహల్..దవళా కాంతుల్లో..ఓ
పండు వెన్నెల్లో..వెండీ కొండల్లే
తాజ్ మహల్..దవళా కాంతుల్లో..ఓ
నిదురించు జహాపనా..నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో..ఓ
నిదురించు జహాపనా..నిదురించు జహాపనా
చరణం::2
నీ జీవిత..ఆ..జ్యోతీ..నీ మధురమూర్తి
నీ జీవిత..ఆ..జ్యోతీ..నీ మధురమూర్తి
ముంతాజ సతి సమాధీ..సమీపాన నిదురించు
ముంతాజ సతి సమాధీ..సమీపాన నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత..ఏకాంత సౌధంలో..ఓ
నిదురించు జహాపనా..నిదురించు జహాపనా