Thursday, November 18, 2010

చీకటి వెలుగులు--1975




సంగీతం::చక్రవర్తి
రచన::సినారె
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,పద్మప్రియ,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,సూర్యకాంతం.

పల్లవి::

ఊరు పేరు లేని వాణ్ణి ..ప్రేమించానమ్మా..తక్ధీం 
ఓనమాలు దగ్గరుండి..నేర్పించాలమ్మా..తకధీం

ఊరు పేరు లేని వాణ్ణి ..ప్రేమించానమ్మా..తక్ధీం 
ఓనమాలు దగ్గరుండి..నేర్పించాలమ్మా..తకధీం 

ఓనా మహః ఓనా మహః..
శివాయహః అబ్భా..శివాయహః

నేర్చుకో కళ్ళతో..దాచుకో గుండెలో
చూడనీ కళ్ళలో..చేరనీ గుండెలో

ఊరు పేరు లేని వాణ్ణి ..ప్రేమించానమ్మా
ఓనమాలు దగ్గరుండి..నేర్పించాలమ్మా

చరణం::1

మంచు కప్పిన..కొండపైన
మనసు తెలిసిన..మనిషితోటి కలిసి ఉంటే..
ఏ ఏ ఏ...

ఉన్నదేమిటి...?
ఊ..చలీ..
ఆ..లేనిదేమిటి...?
ఊ..గిలీ....

ఉండి కూడ..లేనిదేమిటి..?
ఉండి కూడ..లేనిదేమిటి..?
ఆ..ఆ..కౌగిలీ...

ఊరు పేరు లేని వాణ్ణి ..ప్రేమించానమ్మా
ఓనమాలు దగ్గరుండి..నేర్పించాలమ్మా

చరణం::2

ఉరకలెత్తే పడుచుపిల్లను..ఒడుపు తెలిసి
చేయి వేసి..పట్టుకుంటే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ

ఉన్నదేమిటి..?
ఏయ్..పొగరు

హ..హ..హ..లేనిదేమిటి..?
ఆ..బెదురు

ఉండి కూడా..లేనిదేమిటి..?
ఉండి కూడా..లేనిదేమిటి..?
ఆ..ఆ..ఆ..కుదురూ..

ఊరు పేరు లేని వాణ్ణి ..ప్రేమించానమ్మా
ఓనమాలు దగ్గరుండి..నేర్పించాలమ్మా

చరణం::3

బెదురులేని కుర్రదప్పుడు
చిగురుపెదవుల..అదురుపాటును
ఆపమంటే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ

ఆగమన్నది..?
హద్దు..
ఆగనన్నదీ..?
ఊ..ఊ..పొద్దు..

ఆగమన్నా..ఆగనన్నదీ
ఆగమన్నా..ఆగనన్నదీ
ఆ..ఆ..హా..ముద్దూ..ఊ..ఊ..ఊ..

ఊరు పేరు లేని వాణ్ణి..ప్రేమించానమ్మా..తక్ధీం..
ఓనమాలు దగ్గరుండి..నేర్పించాలమ్మా..తకధీం..

నేర్చుకో కళ్ళతో..దాచుకో గుండెలో..
చూడనీ కళ్ళలో..చేరనీ గుండెలో.. 

ఇల్లు-ఇల్లాలు--1972


















సంగీత::K.V.మహదేవన్
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ, కృష్ణంరాజు,రాజబాబు,రమాప్రభ,వాణిశ్రీ,సూర్యకాంతం

పల్లవి::

పల్లెటూరు మన..భాగ్యసీమరా 
పాడి పంటలకు..లోటు లేదురా
పల్లెటూరు మన..భాగ్యసీమరా 
పాడి పంటలకు..లోటు లేదురా
మంచితనం..మమకారం 
మనిషి మనిషిలో..కనబడురా                    
పల్లెటూరు మన..భాగ్యసీమరా 
పాడి పంటలకు..లోటు లేదురా
మంచితనం..మమకారం 
మనిషి మనిషిలో..కనబడురా            
పల్లెటూరు మన..భాగ్యసీమరా 
పాడి పంటలకు..లోటు లేదురా

చరణం::1

కొత్తకొత్త వ్యవసాయ పద్దతులు 
కొల్లగ ప్రవేశ పెడదాము
కొల్లగ ప్రవేశపెడదాము
బీటినేలలను పాటుకుతెచ్చి 
సుక్షేత్రాలను చేద్దాము
సుక్షేత్రాలను చేద్దాము
కొత్తకొత్త వ్యవసాయ పద్దతులు 
కొల్లగ ప్రవేశపెడదాము 
బీటినేలలను పాటుకుతెచ్చి 
సుక్షేత్రాలను చేద్దాము 
చదివినామనే బింకం వదిలి 
ఆడామగ చేదోడుగ కదిలి 
బంగారము పండిద్దాము
ఓహోహోయ్ ఓహోహోయ్ 
ఓహోహోయ్ప పదిమందిని పోషిద్దాము
ఓహోహోయ్ ఓహోహోయ్ ఓహోహోయ్   
పల్లెటూరు మన భాగ్యసీమరా 
పాడి పంటలకు లోటు లేదురా

చరణం::2

జీవనదులు కృష్ణా గోదావరి తుంగభద్రలే వున్నవి
జీవనదులు కృష్ణా గోదావరి తుంగభద్రలే వున్నవి
పంటనిచ్చు హంసా మసూరి వరివంగడాలు వస్తున్నవి
పంటనిచ్చు హంసా మసూరి వరివంగడాలు వస్తున్నవి
జీవనదులు కృష్ణా గోదావరి తుంగభద్రలే వున్నవి
పంటనిచ్చు హంసా మసూరి వరివంగడాలు వస్తున్నవి
కరువుని దూరం చేద్దాము జాతికి ప్రాణం పోద్దాము
ఆంధ్రదేశమే అన్నపూర్ణయను పేరుకీర్తులను నిలబెడదాము
ఆంధ్రదేశమే అన్నపూర్ణయను పేరుకీర్తులను నిలబెడదాము     
పల్లెటూరు మన భాగ్యసీమరా పాడి పంటలకు లోటు లేదురా
   
చరణం::3

సోమరితనముగ తిరిగేవాళ్లే 
సంఘానికి విద్రోహులురా 
సంఘానికి విద్రోహులురా
ఐకమత్యముగ యువకులందరూ 
ఒళ్లువంచి పనిచెయ్యాలిరా 
ఒళ్లువంచి పనిచెయ్యాలిరా
సోమరితనముగ తిరిగేవాళ్లే 
సంఘానికి విద్రోహులురా 
ఐకమత్యముగ యువకులందరూ 
ఒళ్లువంచి పనిచెయ్యాలిరా
ఉద్యోగంలో వ్యాపారంలో 
తృప్తియన్నదే వుండదురా
స్వతంత్రమగు మన రైతు వృత్తిలో 
గౌరవమున్నదిరా ఎంతో గౌరవమున్నదిరా                    
పల్లెటూరు మన భాగ్యసీమరా 
పాడి పంటలకు లోటు లేదురా
మంచితనం మమకారం 
మనిషి మనిషిలో కనబడురా            
పల్లెటూరు మన భాగ్యసీమరా 
పాడి పంటలకు లోటు లేదురా
మంచితనం మమకారం 
మనిషి మనిషిలో కనబడురా            
పల్లెటూరు మన భాగ్యసీమరా 
పాడి పంటలకు లోటు లేదురా

చీకటివెలుగులు--1975


సంగీతం::చక్రవర్తి
రచన::సినారె
గానం::P.సుశీల

పల్లవి::

మీటి చూడు నీ హృదయాన్నీ..పలుకుతుంది ఒక రాగం
మీటి చూడు నీ హృదయాన్నీ..పలుకుతుంది ఒక రాగం
తరచి చూడు నీ గతాన్నీ మెదులుతుంది ఒక రూపం
రూపం ఎవ్వరిదో.. రాగం ఎక్కడిదో
తెలుసుకొంటే చాలును..నీ కలత తీరి పోవును

చరణం::1

పూడిపోయిన గొంతులా..ఓడిపోయిన గుండెలా
పూడిపోయిన గొంతులా..ఓడిపోయిన గుండెలా
నీలో..ఊపిరాడక ఉన్నదీ...
హృదయమే అర్పించుకొన్నదీ..హృదయమే అర్పించుకొన్నదీ

రూపం ఎవ్వరిదో.. రాగం ఎక్కడిదో
తెలుసుకొంటే చాలును..నీ కలత తీరి పోవును

చరణం::2

పూవులోని పిందెలా..పిందలోని తీపిలా
పూవులోని పిందెలా..పిందలోని తీపిలా
నీలో..లీనమైనది..కానరానిదీ
నీ పదము తానై మూగపోయినదీ..మూగపోయినదీ

రూపం ఎవ్వరిదో.. రాగం ఎక్కడిదో
తెలుసుకొంటే చాలును..నీ కలత తీరి పోవును

చరణం::3

మనసు మూలలు వెతికి చూడూ..మరుగు పొరలను తీసి చూడు
మనసు మూలలు వెతికి చూడూ..మరుగు పొరలను తీసి చూడు
ఏదో ..మబ్బుమూసి..మసక కమ్మి..
మమత మాయక ఉన్నది..నీ మమత మాయక ఉన్నదీ

 
మీటి చూడు నీ హృదయాన్నీ..పలుకుతుంది ఒక రాగం
మీటి చూడు నీ హృదయాన్నీ..పలుకుతుంది ఒక రాగం
తరచి చూడు నీ గతాన్నీ మెదులుతుంది ఒక రూపం
రూపం ఎవ్వరిదో.. రాగం ఎక్కడిదో
తెలుసుకొంటే చాలును..నీ కలత తీరి పోవును