సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.శైలజ
పల్లవి::
ఆ ఆ ఆ ఆ..ఆ ఆ..ఆ ఆ ఆ ఆ
జై చిరంజీవా..జగదేక వీరా..ఆ
జై చిరంజీవా జగదేక వీరా
అసహాయ శూరా అంజని కుమారా
జై చిరంజీవా జగదేక వీరా
అసహాయ శూరా అంజని కుమారా
దీవించ రావయ్య..వాయు సంచారా
రక్షించవేలయ్య..శ్రీరామ దూత
జై చిరంజీవా..ఆఆఆ
వీరాంజనేయా శూరాంజనేయ
ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయా
జై చిరంజీవా..
ఆరోగ్యదాతా అభయ ప్రదాతా..ఆ
ఆరోగ్యదాతా అభయ ప్రదాతా
ఉన్మాద భయ జాడ్య పీడా నివారా
సంజీవి గిరివాహా..సానీరిసాహ
సంజీవి గిరివాహ సానీరిసాహొ
జై చిరంజీవా..ఆ..జగదేక వీరా..ఆ
జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా
జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా
జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా
సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి
Cast::Chiranjeevi ...Andaalataara muddugumma Sreedevi
పల్లవి::
ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా ఢమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా..కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా..కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా చమక్కురో
చరణం::1
కసక్కు లయలు..హొయలు చూశా
కసెక్కి వలపు వలలే..వేశా
గుబుక్కు ఎదలో కథలే..దాచా
గుటుక్కు మనక గుబులే..దోచా
మజా చేస్తే మరోటంట..మరోటిస్తే మగాణ్ణంట
సరే అంటే అతుక్కుంటా..సరాగంలో ఇరుక్కుంటా
చుంబురుణ్ణై..నారదుణ్ణై
చుంబ మీద పంబ రేపి పాడుతుంటే మీరు గోవిందే
గోవిందా గోవింద come on..come on పాడండయ్యా
పబం పప్పా పబం పప్పా పబం పప్పా పబం పప్పా
పబం పం పాబం పపం పం పాబం పబం పం పాబా పాబా బాబాబం
ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా..కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా చమక్కురో
చరణం::2
వయస్సు ఒడిలో..చొడినే చూశా
వరించి సుడిలో..పడవే వేశా
నటించే నరుడా..ఘనుడా మెచ్చా
నమస్తే నడుమే..నటిగా ఇచ్చా
ఉడాయిస్తే ఉడుక్కుంటా..లడాయొస్తే హోయ్ ఉతుక్కుంటా
సఖి అంటే సరే అంటా..చెలి అంటే గురు అంటా
బ్రేకు డ్యాన్సు..షేకు డ్యాన్సు
mix చేసి steps వేసి tricks చేస్తే మీరు గోవింద
come on..come on dance I say ఆడండ్రా
ధినక్కుతా ధినక్కుతా..ధినక్కుతా ధినక్కుతా
ధినక్కు తార ధినక్కు తార..ధినక్కు తారా తారా తారారా
ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా..కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా చమక్కురోయ్
సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి
Cast:::Chiranjeevi ,Beauty Queen Sreedevi
పల్లవి::
మ్మ్ హూ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ప్రియతమా నను పలకరించు..ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న..హృదయమా
బ్రతుకులోని బంధమా..పలుకలేని భావమా
మరువలేని స్నేహమా..మరలిరాని నేస్తమా
ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..ఆ
ప్రియతమా నను పలకరించు..ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న..హృదయమా
ఎదుటవున్న స్వర్గమా..చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా..కౌగిలింత ప్రాణమా
ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..ఆ
చరణం::1
నింగి వీణకేమో..నేల పాటలొచ్చె
తెలుగు జిలుగు..అన్నీ కలిసి
పారిజాతపువ్వు..పచ్చి మల్లె మొగ్గ
వలపె తెలిపే నాలో విరిసి
మచ్చలెన్నో ఉన్న..చందమామకన్నా
నరుడే వరుడై..నాలో మెరిసే
తారలమ్మకన్నా..చీరకట్టుకున్న
పడుచుతనము..నాలో మురిసే
మబ్బులనీ..వీడిపోయి
కలిసే నయనం..తెలిసే హృదయం
తారలన్నీ..దాటగానే
తగిలే గగనం..రగిలే విరహం
రాయలేని భాషలో..ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో..ఎన్ని మూగపాటలో
అడుగే పడక..గడువే గడిచి పిలిచే
ప్రియతమా నను పలకరించు..ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న..హృదయమా
చరణం::2
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
తొంతననన తనతనతన తొంతననన
ప్రాణవాయువులో వేణువూదిపోయే..శృతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత ఎంకి పాటలాయే..మనసు మమత అన్నీ కలిసి
వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే..బహుశా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె..కులము గుణము అన్నీ కుదిరి
నీవులేని నింగిలోన..వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద..బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో..నీటికెన్ని రంగులో
అమృతాల విందులో..ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై..మిగిలే
ప్రియతమా నను పలకరించు..ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న..హృదయమా
బ్రతుకులోని బంధమా..పలుకలేని భావమా
కనులలోని కావ్యమా..కౌగిలింత ప్రాణమా
ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..ఆ
ప్రియతమా నను పలకరించు..ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న..హృదయమా
సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి
పల్లవి:
లా లా ల ల ల లా
లా లా ల ల ల లా
అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం
పువ్వూ నవ్వూ పులకించే గాలిలో
నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం
నా చూపుకే శుభోదయం
చరణం::1
లతా లతా సరాగమాడే..సుహాసిని సుమాలతో
వయస్సుతో వసంతమాడీ..వరించెలే సరాలతో
మిలా మిలా హిమాలే..జలా జలా ముత్యాలుగా
తళా తళా గళాన..తటిల్లతా హారాలుగా
చేతులు తాకిన కొండలకే..చలనము వచ్చెనులే
ముందుకు సాగిన ముచ్చటలో..మువ్వలు పలికెనులే
ఒక స్వర్గం తలవంచి..ఇల చేరే క్షణాలలో
అందాలలో అహో మహోదయం..భూలోకమే నవోదయం
చరణం::2
సరస్సులో శరత్తు కోసం..తపస్సులే ఫలించగా
సువర్ణిక సుగంధమేదో..మనస్సునే హరించగా
మరాళినై ఇలాగే..మరీ మరీ నటించనా
విహారినై ఇవాళే..దివి భువి స్పృశించనా
గ్రహములు పాడిన పల్లవికే..జాబిలి ఊగెనులే
కొమ్మలు తాకిన ఆమనికే..కోయిల పుట్టెనులే
ఒక సౌఖ్యం తనువంతా..చెలరేగే క్షణాలలో
అందాలలో అహో మహోదయం..భూలోకమే నవోదయం
నీలాకాశం దిగివచ్చే లోయలో..ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
నాలో సాగే ఏదో సరాగమే
అందాలలో అహో మహోదయం..భూలోకమే నవోదయం
JagadekaVeerudu-AtilokaSundari--1990
Music::IlayaRaja
Lyrics::Veturi
Singer's::S.P.Balu,S.Janaki
andaalalo aho mahodayam
bhoolokame navodayam
puvvu navvu pulakinche gaalilo
ningi nela chunbinche lalilo
tarallara rare viharame
andaalalo aho mahodayam
na choopuke shubhodayam
lata lata saragamade suhasini sumaalato
vayassuto vasantamadi varinchele saralato
mila mila himale jala jala mutyaaluga
tala tala galana tatillata haaraaluga
chetulu takina kondalake chalanamu vacchenule
munduku saagina muchhatalo muvvalu palikenule
oka swargam talavanchi ila chere kshanalalo
andaalalo aho mahodayam bhoolokame navodayam
puvvu navvu pulakinche gaalilo ningi nela chunbinche lalilo
tarallara rare viharame
andaalalo aho mahodayam na choopuke shubhodayam
sarassulo sharattu kosam tapassule phalinchaga
suvarnika sugandhamedo manassune harinchaga
maralinai ilaage maree maree natinchana
viharinai ivaale divi bhuvi sprushinchana
grahamulu padina pallavike jaabili oogenule
kommalu takina amanike koyila puttenule
oka soukhyam tanuvanta chelarege kshanalalo
andaalalo aho mahodayam bhoolokame navodayam
neelaakasham digivachhe loyalo oohaalokam yedurochhe haayilo
naalo sage yedo saraagame
andaalalo aho mahodayam bhoolokame navodayam
సంగీత::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు
తారాగణం::చిరంజీవి,శ్రీదేవి.
పల్లవి::
హే హే రపరపపర రపరపపర పా
హే హే రపరపపర రపరపపర పా
రపరపా రపరపా రప్పప్పా
రపరపా రపరపా రప్పప్పా
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట నా పేరే రాజు
ఎన్ పేర్‌దా రాజు మేరా నాం రాజు మై నేం ఈజ్ రాజూ
చరణం::1
భాయియో ఔర్ బెహ్‌నో
ఈ కొండ వీడు వైభవాన్నీ చూసి
కన్ను కుట్టిన శత్రు రాజు ధూమ కేతు
తన సైన్యంతో దండెత్తి వచ్చాడు హా
అప్పుడు మన రాజసింహుడు తెలివిగా
ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో
శత్రుసైన్యం మీదికి మెరుపు దాడి చేశాడు
విజయుడై వచ్చినాడురా తన ప్రజలంతా మెచ్చినారురా
దుర్గమునే ఏలినాడురా ఆ స్వర్గమునే దించినాడురా
అక్షితలే చల్లినారు రమణులంతా
అహ హారతులే భక్తిమీర పట్టినారురా
సింహాసమెక్కి తాను విష్ణుమూర్తిలా
అహ సిరులెన్నో చెలువు మీద చెలికినాడురా
ఏ రాజు ఎవరైనా మా రాజువింక నువ్వంటా
నీ మనసే మా కోట మీ మాట మాకు పూబాటా
రాజాది రాజా మార్తాండ తేజ
నా పేరే రాజు మై నేం ఈజ్ రాజూ
చరణం::2
అందాల ఆ రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు
పెద్ద రాణి నాట్యంలో మయూరి
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
చిన్న రాణి సంగీతంలో దిట్ట సరిగమల పుట్ట
పద పద సాస సరి గరి సాపద
పద పద సాస సగరిగ సరి గస పద
దరి రిగ గస సప గరిస దప గారిస
కళలే పోషించినాడురా తను కావ్యాలే రాసినాడురా
శిలలే తెప్పించినాడురా ఘన శిల్పాలే మలచినాడురా
చెరువులెన్నో తవ్వించి కరువుమాపి
అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా
కులమతాల రక్కసిని రూపుమాపి
అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా
నీలాంటి రాజుంటే ఆ దేవుడింక ఎందుకంట
చల్లనైన నీ చూపే మాకున్న పండు ఎన్నెలంట
రాజాధి రాజా మార్తాండ తేజా
నా పేరే రాజు మేరా నాం రాజు
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట మమ నామ రాజు
ఎన్ పేర్‌దా రాజు
ఎండ వేరే రాజు
నన్న హెసరే రాజు
నా పేరే రాజు
VIDEO
సంగీత::S.P.బాలు
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు, S,P,శైలజ
తారాగణం::భానుచందర్,సుహాసిని,S.వరలక్ష్మీ
పల్లవి::
ఆ..ఆ..ఆ..మ్మ్..మ్మ్..మ్మ్
సామజవరగమనా..ఆ
దివిని తిరుగు మెరుపు లలన..సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన..సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన..సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన..సామజవరగమనా
దివిని తిరుగు మెరుపు లలన..సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన..సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన..సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన..సామజవరగమనా
చరణం::1
అరవిరిసిన చిరునగవుల..సామజవరగమనా
ఇల కురిసెను సిరివెలుగులు..సామజవరగమనా
అరవిరిసిన చిరునగవుల..సామజవరగమనా
ఇల కురిసెను సిరివెలుగులు..సామజవరగమనా
సొగసులమణి నిగనిగమని..సామజవరగమనా
మెరిసిన గని మురిసెనుమది..సామజవరగమనా
వెలసెను వలపుల మధువని..సామజవరగమనా
దివిని తిరుగు మెరుపు లలన..సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన..సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన..సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన..సామజవరగమనా
చరణం::2
మమతల ఉలి మలచిన కల..సామజవరగమనా
తళుకుమనెను చెలి కులుకుల..సామజవరగమనా
మమతల ఉలి మలచిన కల..సామజవరగమనా
తళుకుమనెను చెలి కులుకుల..సామజవరగమనా
సుగుణములను తరగని గని..సామజవరగమనా
దొరికినదని ఎగసెను మది..సామజవరగమనా
అరుదగు వరమిది తనదని..సామజవరగమనా
హ..హా..హ..హా
దివిని తిరుగు మెరుపు లలన..సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన..సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన..సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన..సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన..సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన..సామజవరగమనా