Wednesday, January 28, 2009

అర్ధాంగి--1977


సంగీతం::T.చలపతి రావ్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల


నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
అది ఏనాదైనా ఏనాడైన నీకే నీకే కంకితం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

తెరచిన నా కన్నులలో ఎపుడూ నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడూ నీ కలల దీపమే
తెరచిన నా కన్నులలో ఎపుడూ నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడూ నీ కలల దీపమే
కనులే కలలై..కలలే కనులై
కనులే కలలై..కలలే కనులై
చూసిమ అందాలు..అనుబంధాలు అవి నీకే నీకే అంకితం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆధ్యానంలో ఎపుడూ..నీ ప్రణయ గానమే
నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆధ్యానంలో ఎపుడూ..నీ ప్రణయ గానమే
ధ్యానమే గానమై...గానమె ప్రాణమై
ధ్యానమే గానమై...గానమె ప్రాణమై
పలికిన రాగాలు..అనురాగాలు..అవి నీకే నీకే అంకితం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

కల్పన--1977సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల,G.ఆనంద్


పల్లవి:

దిక్కులు చూడకు రామయ్యా..పక్కనె ఉన్నది సీతమ్మా
దిక్కులు చూడకు రామయ్యా..పక్కనె ఉన్నది సీతమ్మా..సీతమ్మా
సిరిమల్లె నవ్వుల సీతమ్మా..ముందుకు రావే ముద్దుల గుమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మా..ముందుకు రావే..ముద్దుల గుమ్మ..ముద్దుల గుమ్మా


చరణం::1


ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగిఉంటావో..ఓ..
ఎదనే దాచుకుంటావో..నా ఎదనే దాగిఉంటావో..
కదలికలన్నీ కధలుగ అల్లి కవితలే రాసుకుంటావో..రామయ్యా..

పొన్నలు పూచిన నవ్వు..సిరివెన్నెల దోచి నాకివ్వు
పొన్నలు పూచిన నవ్వు..సిరివెన్నెల దోచి నాకివ్వు
ఆ వెన్నెలలో..నీ కన్నులలో..ఆ వెన్నెలలో..నీ కన్నులలో..
సన్నజాజులే రువ్వు..కను సన్నజాజులే రువ్వు..సన్నజాజులే రువ్వు..
కను సన్నజాజులే రువ్వు..సీతమ్మా..సీతమ్మా..

దిక్కులు చూడకు రామయ్యా..పక్కనె ఉన్నది సీతమ్మా
సిరిమల్లె నవ్వుల సీతమ్మా..ముందుకు రావే ముద్దుల గుమ్మ..ముద్దుల గుమ్మా


చరణం::2


కలలో మేలుకుంటావో..నా కళలే ఏలుకుంటావో..
కలలో మేలుకుంటావో..నా కళలే ఏలుకుంటావో..
కలలిక మాని కలయికలో నా కనులలో చూసుకుంటావో..రామయ్యా

వెల్లువలైనది సొగసు..తొలివేకూవ నీ మనసు..
వెల్లువలైనది సొగసు..తొలివేకూవ నీ మనసు..
ఆ వెల్లువలో..నా పల్లవిలో..ఆ వెల్లువలో..నా పల్లవిలో..
రాగమే పలికించు..అనురాగమై పులకించు..రాగమే పలికించు
అనురాగమై పులకించు..సీతమ్మా..సీతమ్మా
దిక్కులు చూడకు రామయ్యా..పక్కనె ఉన్నది సీతమ్మా
సిరిమల్లె నవ్వుల సీతమ్మా..ముందుకు రావే ముద్దుల గుమ్మ..ముద్దుల గుమ్మా

మహా సంగ్రామం --- 1985

s

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల

ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...
అలనాటి తొలిచూపు గురిచూడగా..
కలలన్ని ఒకసారి కవ్వించగా...
అవలీలగా..ఒక నీడగా..తను వెంటాడగా..

ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...
చిననాటి చిరునవ్వు చిగురించగా
ఒకనాటి బిడియాలు ఒడిచేరగా
ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా..


గోదారమ్మా..లాలాలాలా..
పోంగేనమ్మా..లాలాలాలా..
తొలినాటి వయ్యారాల పరవళ్ళలో..

కావేరమ్మా..లాలాలాలా..
కరిగేనమ్మా..లాలాలాలా..
కన్నూ కన్నూ కలిపే తీపి కన్నీటిలో

ఉయ్యాలూగే..లాలాలాలా..
ఊహల్లోనే..లాలాలాలా..
ఊరేగు ఈవేళలో....ఓ....
ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...


జాబిలమ్మా..లాలాలాలా..
చిక్కేనమ్మా..లాలాలాలా..
జారేపైట..పోంగేడద..సందిళ్ళలో

ముద్దుగుమ్మా..లాలాలాలా..
మురిసేనమ్మా..లాలాలాలా..
తొలిమేనల్లో పొద్దేమరచె..కౌగిళ్ళలో

సాయంత్రాల..లాలాలాలా..
నీడల్లాంటి..లాలాలాలా..
ఆదూర తీరాలలో.....

ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...
చిననాటి చిరునవ్వు చిగురించగా
కలలన్ని ఒకసారి కవ్వించగా...
ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా..
ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
ఎన్నడో..కలిసిన జ్ఞాపకం