సంగీతం::T.చలపతిరావు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల
పల్లవి::
ఓ ధర్మదాతా ఓ ధర్మదాతా
ఎవరూ నీవారు కారు
ఎవరూ నీతోడు రారు
అడిగిన వారికి కాదనక
అర్పించిన ఓ ధర్మదాతా
చరణం::1
సగము దేహమై నిలిచిన నీ దేవి
రగిలే చితిలో రాలింది
పుట్టెడు మమతలు పండించు యిల్లాలు
పిడికెడు బుదిడగా మారింది
ముత్తైదువుగా ముగిసిన సతిమేను
కృష్ణ వేణిగా మిగిలింది
కృష్ణ వేణిగా మిగిలింది
ఎవరూ నీవారు కారు
ఎవరూ నీతోడు రారు
చరణం::2
కల్ప తరువగా వెలసిన భవనం
కడకు మెడుగా మారేనా
కోటి దివ్వెలు నిలిపిన నీకే
నిలువ నీడయే కరువాయెన
పూవు లమ్ముకొని బ్రతికే చోట
పూవు లమ్ముకొని బ్రతికే చోట
కట్టేలమ్ముకోను గతి పట్టేనా
ఓ ధర్మదాతా ఓ ధర్మదాతా
No comments:
Post a Comment