సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు,
రచన::పింగళి నాగేంద్ర రావు
గానం::ఘంటసాల,S.జానకి
ఆభేరి::రాగం
(భీం పలాశ్రీ)
ఆమె:- కుశలమా..కుశలమా..కుశలమా..
ఎటనుంటివో ప్రియతమా..
నీ విలాసము..నీ ప్రతాపము కుశలముగా..సిరి సిరి..
ఆమె:- నను నీవు..నిను నేను..తనివితీరగా..తలచుకొనీ..
నను నీవు..నిను నేను..తనివితీరగా తలచుకొనీ
పెనగొను ప్రేమలు విరిసికొనీ తనువులు మరచేమా..ఆ ఆ ఆ
అతడు:- కుశలమా..కుశలమా..ఎటనుంటివో ప్రియతమా..
నీ పరువము నీ పరవశమూ కుశలముగా..సిరి సిరీ..
అతడు:- కలలోనూ..మదిలోనూ..ఓ..పిలచినటులనే ఉలికిపడీ..
కలలోనూ..మదిలోనూ..ఓ..పిలచినటులనే ఉలికిపడీ
ఉల్లము విసిరే..వలపుగాలిలో మెల్లగకదిలేమా..ఆ..ఆ ఆ
ఆమె:- కుశలమా..కుశలమా..కుశలమా..
ఎటనుంటివో ప్రియతమా..
నీ విలాసము..నీ ప్రతాపము కుశలముగా..సిరి సిరి..
ఆమె:- కొలనిటనైనా కనుపించగనే ..ఏ ఏ ఏ
తలతువా నీ విజయేశ్వరినీ
కొలనిటనైనా కనిపించగనే
తలతువా నీ విజయేశ్వరినీ
అతడు:- కలగానముతో నీ చెలినేనని నాలో నిలీచితివే...
ఇద్దరు:- కుశలమా..కుశలమా..కుశలమా..
ఎటనుంటివో ప్రియతమా..కుశలమా..