Tuesday, September 20, 2011

సుమంగళి--1965::రాగేశ్రీ::రాగం

ఈ పాట ఇక్కడ వినండి




రాగేశ్రీ::రాగం
సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల

సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా

పరువానికి బలవంతానా పగ్గాలే వేస్తావా
మనసు మూసిమమతలు రోసి మనుగడ మసిచేస్తావా
పరువానికి బలవంతానా పగ్గాలే వేస్తావా
మనసు మూసిమమతలు రోసి మనుగడ మసిచేస్తావా
తనువు చిక్కి శల్యంబైనా తలుపులణగిపోయేనా
ఇరువైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా
ఎవరికైనా వచ్చేనా

సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా

తీయనైన జీవితాన చేదువిషం తాగేవా
తోడునీడగా ఒకరుండి ఏకాకిగా బ్రతికేవా
తీయనైన జీవితాన చేదువిషం తాగేవా
తోడునీడగా ఒకరుండి ఏకాకిగా బ్రతికేవా
కోరినది చేతికి చిక్కి ఆరుతున్నదొక దీపం
కోరినది చేతికి రాక ఆరకున్నదొక తాపం
ఆరకున్నదొక తాపం

సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా

అంధుని ఎదుట అందాలేలా..
అడవికి పున్నమి వెన్నెలలేలా..
అసమర్థునికి అవకాశాలేలా..
వృధా వృధా..ఈ బ్రతుకు వృధా..

సుమంగళి--1965






సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల

వలపువలే తీయగా వచ్చినావు నిండుగా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా
మెరపువలే తళుకుమని మెరసిపోయేటందుకా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా

తడబడు నడకల నడచినపుడు నీ తత్తరబాటును చూడాలి
తలుపు మూయగనే దారులు వెదకే బిత్తరచూపులు చూడాలి
తడబడు నడకల నడచినపుడు నీ తత్తరబాటును చూడాలి
తలుపు మూయగనే దారులు వెదకే బిత్తరచూపులు చూడాలి
అని తలచి తలచి ఈ తరుణం కోసం తపసు చేసినది ఇందులకా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా

మురిపెములొలికే ముద్దు మోమును కురుల మబ్బులో దాచుటకా
మిసమిసలాడే నొసట కుంకుమ చిరు చెమటలలో కరగుటకా
మురిపెములొలికే ముద్దు మోమును కురుల మబ్బులో దాచుటకా
మిసమిసలాడే నొసట కుంకుమ చిరు చెమటలలో కరగుటకా
ఎదను తెరచి నేనిన్నినాళ్ళుగా ఎదురుచూచినది ఇందులకా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా
మెరపువలే తళుకుమని మెరసిపోయేటందుకా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా

హాపి బర్థ్‌డే టు యూ నాగేశ్వర రావ్

ఇవాళ నాగేశ్వర్‌రావ్ గారి పుట్టిన రూజు అతని పాట వింద్దాం




############################################################


ప్రేమనగర్
సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింక లోకంతొ పని ఏముంది డోంట్ కేర్


నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింక లోకంతొ పని ఏముంది డోంట్ కేర్

1)నేను తాగితే కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి
నేను తాగితే కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతొ కలిసాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతొ కలిసాయి
తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి అహహ డోంట్ కేర్

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింక లోకంతొ పని ఏముంది

2)మనసును దాచెటందుకే పై పై నవ్వులు వున్నాయి
మనిషికిలేని అందం కోసమే రంగులు వున్నాయి
మనసును దాచెటందుకే పై పై నవ్వులు వున్నాయి
మనిషికిలేని అందం కోసమే రంగులు వున్నాయి
ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి
ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయి డోంట్ కేర్

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింక లోకంతొ పని ఏముంది డోంట్ కేర్

3)మనిషిని మనిషి కలిపేటందుకే పెదవులు వున్నాయి
పెదవులు మధురం చేసేటందుకే మధువులు వున్నాయి
బాధలన్ని బాటిల్ లొ నేడే దింపేసెయ్
బాధలన్ని బాటిల్ లొ నేడే దింపేసెయ్
అగ్గి పుల్ల గీసేసేయ్ నీలో సైతాన్ తరిమేసేయ్..డ్రైవ్ ది డెవిల్ ఔట్.. హ హ్హ హ్హ హ..

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింక లోకంతొ పని ఏముంది డోంట్ కేర్