Wednesday, August 22, 2007
తోడి కోడళ్ళు--1957
సంగీతం::మాష్టర్ వేణు
రచన::కోసరాజు
గానం::ఘటసాల,P.సుశీల
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు తోడేస్తుంటే
ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు తోడేస్తుంటే
నీ గాజులు ఘల్లని మోగుతుంటె నా మనసు ఝల్లుమంటున్నది
నా మనసు ఝల్లుమంటున్నది …
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
తీరని కోరికలూరింపంగా ఓరగంట నను చూస్తూ ఉంటే
తీరని కోరికలూరింపంగా ఓరగంట నను చూస్తూ ఉంటే
చిలిపి నవ్వులు చిందులు తొక్కి ..
చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గుముంచుకొస్తున్నది
నునుసిగ్గుముంచుకొస్తున్నది....
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరస్తు ఉంటే
చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరస్తు ఉంటే
తీయని తలపులు నాలో ఏమో...
తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తు ఉన్నవి
ఆహ తికమక చేస్తు ఉన్నవి ....
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి
మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి
పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది
పరవశమైపోతున్నది …ఆఆఆఆఆఆ…ఆఆఆఆఆఆఆ
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
Labels:
P.Suseela,
Singer::Ghantasaala,
తోడి కోడళ్ళు--1957
తోడి కోడళ్ళు--1957
సంగీతం::మాస్టర్ వేణు
రచన::కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం::ఘంటసాల,జిక్కి
'మూటా ముల్లె కట్టూ..'
'ఎక్కడికీ ?'
' బస్తీకి !'
తింటానికి కూడు చాలదే జాంగిరీ..ఉంటానికిల్లు చాలదే
బస్తీకి పోదాము పైసా తెద్దామే..రావే నా రంగసాని
టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ..డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో డౌనైపోతావో రబ్బీ బంగారు సామి
రెక్కలన్నీ ఇరుచుకుంట..రిక్షాలు లాక్కుంట
రెక్కలన్నీ ఇరుచుకుంట..రిక్షాలు లాక్కుంట
చిల్లరంత చేర్చుకుంట..సినీమాలు చూసుకుంట
షికార్లు కొడదామే పిల్లా..జలసా చేద్దామే
బస్తీకి పోదాము పైసా తెద్దామే..రావే నా రంగసాని
కూలి దొరకదు నాలి దొరకదు..గొంతు తడుపుకొన నీరు దొరకదు
కూలి దొరకదు నాలి దొరకదు..గొంతు తడుపుకొన నీరు దొరకదు
రేయి పగలు రిక్షా లాగిన అద్దెకుపోను అణా మిగలదు
గడప గడపకూ కడుపు పట్టుకొని ఆకలాకలని అంగలార్చితే
చేతులు ఎత్తి కొట్టొస్తారు..కుక్కలనీ ఉసిగొల్పిస్తారు
'చాల్లెహే..'
టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ..డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో డౌనైపోతావో రబ్బీ బంగారు సామి
ఫాక్టరీలలో పని సులువంట..గంటైపోతే ఇంటో ఉంటా
వారం వారం బట్వాడంట..ఒరే అరే అన వీల్లేదంట
కాఫీతోటే బతకొచ్చంట..కబుర్లు చెప్పుకు గడపొచ్చంట
'అట్టాగా...'
చూడ చిత్రమంటా..పిల్లా చోద్యమవుతదంటా
బస్తీకి పోదాము పైసా తెద్దామే..రావే నా రంగసాని
పిప్పై పోయే పిచ్చి ఖర్చులు..పోకిరి మూకల సావాసాలు
పిప్పై పోయే పిచ్చి ఖర్చులు..పోకిరి మూకల సావాసాలు
చీట్లపేకలు..సిగ సిగ పట్లు..తాగుడు వాగుడు తన్నులాటలు
ఇంటి చుట్టునా ఈగలు దోమలు..ఇరుకు సందులో మురుగు వాసనలు
అంటురోగము తగిలి చచ్చినా అవతలికీడ్చే దిక్కే ఉండదు
'అయ్యబాబోయ్ !'
టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ..డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో డౌనైపోతావో రబ్బీ బంగారు సామి
ఏలి కేస్తెను కాలికేస్తవు..ఎనక్కి రమ్మని గోల చేస్తవూ
ఏలి కేస్తెను కాలికేస్తవు..ఎనక్కి రమ్మని గోల చేస్తవూ
ఏదారంటే గోదారంటవ్..ఇరుకున పెట్టి కొరుక్కు తింటవ్
దిక్కు తోచనీయవే పిల్లా..తిక మక చేసేవే
బస్తీకి నేబోను..నీతో ఉంటానే రాణి నా రంగసానీ !
గొడ్డూ గోదా మేపుకుందాం .. కోళ్ళూ మేకలు పెంచుకుందాం
కూరా నారా జరుపుకుందాం .. పాలూ పెరుగు అమ్ముకుందాం
పిల్లా జెల్లను సూసుకుందాం .. తలో గంజియో తాగి పడుందాం
టౌను పక్కకెళ్ళొద్దండోయ్ బాబూ..డాంబికాలు పోవద్దండోయ్
టౌను పక్కకెళ్ళేరో డౌనైపోతారూ..
తానే తందన్న తాన.. తందన్న తాన.. తందన్న తానా!
తోడి కోడళ్ళు--1957
సంగీతం::మాష్టర్ వేణు
రచన::కోసరాజు
గానం::జిక్కి,మాధవపెద్ది
పల్లవి::
నీ సోకు చూడకుండ నవనీతమ్మ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
ఎంత మాయగాడవురా రమణయ్ మావ
నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ
నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ
ఆఉహు...ఆఉహు..ఆఉహు...ఆఉహు..
నీవు చూసే చూపులకు వన్నెలాడీ
నీరుగారి పోతానె చిన్నెలాడి
మనసు దాచుకోలేను నవనీతమ్మ
పది మాటలైన చెప్పలేను ముద్దులగుమ్మా
నీ సోకు చూడకుండ నవనీతమ్మ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
ఆఉహు...ఆఉహు..ఆఉహు...ఆఉహు..
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
ఆఉహు...ఆఉహు..ఆఉహు...ఆఉహు..
చరణం::1
ముచ్చట్లు చెబుతావు వన్నెకాడ
మోసపుచ్చి పోతావు చిన్నవాడ
మాటవరసకైన నువ్వు రమణయ్ మావా
ముచ్చట్లు చెబుతావు వన్నెకాడ
మోసపుచ్చి పోతావు చిన్నవాడ
మాటవరసకైన నువ్వు రమణయ్ మావా
ఎంత మాయగాడవురా రమణయ్ మావ
నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ
నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ
ఆఉహు...ఆఉహు..ఆఉహు...ఆఉహు..
నీ తోటి సరసమాడి పడుచు పిల్లా
నెల్లూరు వెళతానే గడుసు పిల్లా
మళ్ళి తిరిగి వస్తానే నవనీతమ్మా
నిను మరచిపోయి ఉండలేనె ముద్దులగుమ్మా
నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ
నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ
ఆఉహు...ఆఉహు..ఆఉహు...ఆఉహు..
నీ తోటి సరసమాడి పడుచు పిల్లా
నెల్లూరు వెళతానే గడుసు పిల్లా
మళ్ళి తిరిగి వస్తానే నవనీతమ్మా
నిను మరచిపోయి ఉండలేనె ముద్దులగుమ్మా
నీ సోకు చూడకుండ నవనీతమ్మ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
చరణం::2
నెల్లూరు పోతేను నీటుగాడా
తెల్ల బియ్యం తెస్తావా నీటు గాడా
పక్క ఊళ్ళో నువ్వుంటె రమణయ్ మావ
నే ప్రాణాలు నిల్పలేను రమణయ్ మావ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
చరణం::2
నెల్లూరు పోతేను నీటుగాడా
తెల్ల బియ్యం తెస్తావా నీటు గాడా
పక్క ఊళ్ళో నువ్వుంటె రమణయ్ మావ
నే ప్రాణాలు నిల్పలేను రమణయ్ మావ
ఎంత మాయగాడవురా రమణయ్ మావ
నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావనీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ
ఆఉహు...ఆఉహు..ఆఉహు...ఆఉహు..
నీ సోకు చూడకుండ నవనీతమ్మ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
ఆఉహు...ఆఉహు.. ఆఉహు...ఆఉహు..
తోడి కోడళ్ళు--1957
సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల
డైరెక్టర్:: అదూర్తి సుబ్బారావ్
రాగం::
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చనో చెప్పగలవా?
నిన్ను మించిన కన్నెలెందరో మందుటెఒడలో మాడిపొతే,
వారి బుగ్గల నిగ్గు నీకూ వచ్చి చేరెను, తెలుసుకో..
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
నిలిచి విను నీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు
చలువ రాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడ కట్టిన చలువ రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా?
కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచీ, ఘనులూ తొలచీ,
చెమట చలువను చేర్చి రాళ్ళను, తీర్చినారూ, తెలుసుకో..
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
నిలిచి విను నీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు
గాలిలోనా తేలిపోయె చీర కట్టిన చిన్నదాన
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా?
చిరుగు పాతల, బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారూ..
చాకిరొకరిదీ ,సౌఖ్యమొకరిదీ సాగదింకా, తెలుసుకో...
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
నిలిచి విను నీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు
Labels:
Singer::Ghantasaala,
తోడి కోడళ్ళు--1957
Subscribe to:
Posts (Atom)