సంగీతం::చక్రవర్తి రచన:: గానం::S.P.బాలు , P.సుశీల పల్లవి:: నీరెండ దీపాలు నీ కళ్ళలో నా నీడ చూసాను ఎన్నాళ్ళకో ఈ కొండకోనల్ల వాకిళ్ళలో నీదాననైనాను కౌగిళ్ళలో నీరెండ దీపాలు నీ కళ్ళలో నా నీడ చూసాను ఎన్నాళ్ళకో చరణం::1 ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో నీ అందచందాలు మందారమై నీ రాగభావాలు శృంగారమై ఈ కొండగాలుల్లో నా గుండె ఊసుల్లో నీ మాట అనురాగ సంగీతమై నీ చూపు ప్రణయాల పేరంటమై పొద్దెరగని ముద్దులలో ముద్దగ తడిసేవేళ చరణం::2 నా ఆశలీనాడు ఆకాశమే చేరి నా ఆశలీనాడు ఆకాశమే చేరి మెరిసేను తారల్ల మణిహారమై విరిసేను జాబిల్లి మనతీరమై అందాల హరివిల్లు పొదరిల్లుగా మారి వరిచేను విరిపానుపు మనకోసమై కరగాలి జతగూడి మనమేకమై ముద్దులలో నెలబాలుడి నిద్దురపోయిన వేళ నీరెండ దీపాలు నీ కళ్ళలో నా నీడ చూసాను ఎన్నాళ్ళకో
సంగీతం::భానుమతి రచన::? గానం::P.భానుమతి నటీ,నటులు::భానుమతి, చక్రపాణి, మధుబాబు, రాజీ, ప్రీతా పల్లవి:: నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను నిదుర నీకంటి పాప నీవు మా కంటి పాప జోలాలి లాలి లాలి నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను నిదుర నీకంటి పాప నీవు మా కంటి పాప జోలాలి లాలి లాలి నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను చరణం::1 కలలే పసివారి లోకం నవ్వులే వారి నేస్తం వయసు ఎంతైనా రాని పాప మనసుండిపోనీ జోలాలి లాలి లాలి నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను చరణ::2 నీవు నడిచేది బాటై నలుగురూ నడిచిరానీ కన్న నీవారి పేరు గొప్పగా చెప్పుకోని జోలాలి లాలి లాలి నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను నిదుర నీకంటి పాపై నీవు మా కంటి పాపై జోలాలి లాలి లాలి నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను
సంగీతం::ఇళయరాజా గానం::వాణిజయరాం నిర్మాత & దర్శకత్వం::టి.ఎం.బాలు నటీ,నటులు::కమల్‌హాసన్,శ్రీదేవి పల్లవి: ఎవరికి ఎవరో రంగనాథ తెలియజాలరు కాదా ఎవరికి ఎవరో రంగనాథ తెలియజాలరు కాదా ఏ క్షణమెవరు ఏమౌతారో అంతా నీ లీల ఎవరికి ఎవరో రంగనాథ తెలియజాలరు కాదా చరణం::1 గూడే వదిలిన..ఒంటరి చిలుక తోడు నీడ కనలేక..తిరిగే వేళ మమతే ఎరుగని..ఓ సిరిమల్లిక గాలికి ఎగిరి గతిలేక..నలిగే వేళ పువ్వుల..మాలను చేరెను..నేడు చిత్రం చూడు వింతేనోయి ఇంతేనోయి..కాలం చేసే జాలం ఎవరికి ఎవరో రంగనాథ..తెలియజాలరు కాదా చరణం::2 కాలం మనిషికి..ప్రతికూలిస్తే కర్రే పామై కాటేస్తే..మారును కథలే దైవంగానీ..అనుకూలిస్తే చేసిన పుణ్యం ఫలియిస్తే..తీరును వ్యధలే నిలుచునులేరా..నీలో న్యాయం..నీకు సహాయం ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా..నీదేలేరా విజయం ఎవరికి ఎవరో రంగనాథ..తెలియజాలరు కాదా ఏ క్షణమెవరు ఏమౌతారో..అంతా నీ లీల ఎవరికి ఎవరో రంగనాథ..తెలియజాలరు కాదా