Saturday, November 29, 2008

బుల్లెమ్మ బుల్లోడు--1972

సంగీత::చెళ్ళపిళ్ళ సత్యం 
రచన:: రాజశ్రీ
గానం::S.P.బాలు  
తారాగణం::చలం,సత్యనారాయణ,ధూళిపాళ,త్యాగరాజు,విజయలలిత,పండరీబాయి,బాలకృష్ణ 

పల్లవి::

నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు 
నీ పాలిట యముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను యహ్ 

చరణం::1

నమ్మిన వారికి నమ్మకద్రోహము చేసినందుకు శిక్ష 
ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలు రాసినందుకీ శిక్ష 

నీ డొక్కచించి నే డోలుకట్టి వాయించుటే నా దీక్ష 
నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు 
నీ పాలిట యముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను యహ్ 

చరణం::2

దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము 
తల పొగరంతా తగ్గేదాకా దులుపుతాను నీ దుమ్ము 

నీ కోసమే నే నీ దినం యెత్తేను ఈ అవతారం 