సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు రచన::శ్రీ శ్రీ గానం::ఘంటసాల అనుపమా వారి దర్శకత్వం::K.B. తిలక్ తారాగణం: జగ్గయ్య , అశోక్ కుమార్ , చలం, గుమ్మడి, జమున, ప్రభ, జయప్రద ( తొలి పరిచయం) తోడి::రాగం పల్లవి:: ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా చరణం::1 బడులే లేని పల్లెటూళ్ళలో బడులే లేని పల్లెటూళ్ళలో చదువే రాని పిల్లలకు చదువు రాని చదువుల బడిలో జీతాలు రాని పంతుళ్ళకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా చరణం::2 చాలీ చాలని పూరి గుడిసెలో చాలీ చాలని పూరి గుడిసెలో కాలే కడుపుల పేదలకు మందులు లేని ఆసుపత్రిలో పడిగాపులు పడు రోగులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా చరణం::3 తరతరాలుగా మూఢాచారపు వలలో చిక్కిన వనితలకు అజ్ఞానానికి అన్యాయానికి బలి అయిపోయిన పడతులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా చరణం::4 కూలి డబ్బుతో లాటరీ టికెట్ లాటరీ టికెట్ కూలి డబ్బుతో లాటరీ టికెట్ కొనే దురాశా జీవులకు దురలవాట్లతో బాధ్యత మరిచి చెడే నిరాశా జీవులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా చరణం::5 సేద్యం లేని బీడు నేలలో సేద్యం లేని బీడు నేలలో పనులే లేని ప్రాణులకు పగలు రేయి శ్రమ పడుతున్నా ఫలితం దక్కని దీనులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు రచన::దేవులపల్లి కృష్ణశాస్ర్తి గానం::P.సుశీల పొన్నలూరి బ్రదర్స్ వారి Film Direkted By::B.N. Reddi తారాగణం::N.T.రామారావు, జమున,జానకి, సూర్యకాంతం,రేలంగి, రమణారెడ్డి,అల్లు రామలింగయ్య ఆభేరి::రాగం పల్లవి:: మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో..ఏ పూల పూజింతునో చరణం::1 మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె నీ పాద సేవా మహాభాగ్యమీవా నాపై నీ దయజూపవా..నా స్వామి నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో..ఓ ఓ ఓ ఏ పూల పూజింతునో.. చరణం::2 దూరాననైన కనే భాగ్యమీవా నీ రూపు నాలో సదా నిల్వనీవా ఏడుకొండలపైనా వీడైన స్వామి నా పైని దయజూపవా..నా స్వామి నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో..ఓ ఓ ఓ ఏ పూల పూజింతునో..మ్మ్ మ్మ్