Saturday, November 19, 2011

అందాల రాముడు--1973















చిమ్మట లోని మరో ఆణిముత్యం వినండి
సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ,P.సుశీల


ANR::అబ్బోసి చిన్నమ్మా..ఆనాటి ముచ్చటలూ
ఎన్నెన్ని గుర్తున్నయే..తలుచుకొంటే గుండెలోన గుబులౌతుందే

అబ్బోసి చిన్నమ్మా..ఆనాటి ముచ్చటలూ
ఎన్నెన్ని గుర్తున్నయే..తలుచుకొంటే గుండెలోన గుబులౌతుందే

లత::అబ్బోసి చిన్నయ్యా..ఆ.ఆ.ఆ
అబ్బోసి చిన్నయ్యా..ఆనాటి ముచ్చట్లు
ఎన్నైనా గురుతుంటాయి..నీ గుండెలోన గుర్రాలే పరిగెడుతాయీ

అబ్బోసి చిన్నయ్యా..ఆనాటి ముచ్చట్లు
ఎన్నైనా గురుతుంటాయి..నీ గుండెలోన గుర్రాలే పరిగెడుతాయీ


::::1

ANR::ఎలక తోక రెండు జడలు వెనక నుండి నే లాగితే

ఎలక తోక రెండు జడలు వెనక నుండి నే లాగితే
ఉలికులికీ పడేదానివే..నువ్వు ఉడుక్కొని ఏడ్చేదానివే

లత::ఆలాగ ఉడికిస్తే అదనుచూసి నేనేమో

ఆలాగ ఉడికిస్తే అదనుచూసి నేనేమో
నెత్తిమీద మొట్టేదాన్నిరోయ్

ANR::నువ్వు మొట్టగానే చాచిపెట్టి కొట్టేవాడినే

ANR::అబ్బోసి చిన్నమ్మా..ఆనాటి ముచ్చటలూ

లత::ఎన్నైనా గురుతుంటాయి..నీ గుండెలోన గుర్రాలే పరిగెడుతాయీ

::::2


లత::మలిసంధ్య వేళలో..మర్రి చెట్టు నీడలో
మలిసంధ్య వేళలో..మర్రి చెట్టు నీడలో

ANR::వానలో చిక్కడితే ఒళ్ళంతా తడిసింది

వానలో చిక్కడితే ఒళ్ళంతా తడిసింది
పిడుగు పడితే హడలి పోయావే..నను అత్తుక్కొని అదుముకొన్నావే

పిడుగు పడితే హడలి పోయావే..నను అత్తుక్కొని అదుముకొన్నావే

లత::అంతకన్న ఎక్కువగా నువ్వే హడలేవులే

అంతకన్న ఎక్కువగా నువ్వే హడలేవులే
అదుముకొంటే విదిలించుకొని పరుగుపుచ్చుకొన్నావు
నాటి నుండి నేటిదాక..వికరులేకపోయావూ

ANR::వేటగాడినే లేడి..వేటాడ వచ్చిందా
వేటగాడినే లేడి..వేటాడ వచ్చిందా

లత::::అబ్బోసీ చిన్నయ్యా

ANR::::అబ్బోసి చిన్నమ్మా

లత::::అబ్బోసీ చిన్నయ్యా

ANR::::అబ్బోసి చిన్నమ్మా

లత::::అబ్బో అబ్బో అబ్బో అబ్బో అబ్బో అబ్బో..

అందాల రాముడు--1973
















చిమ్మట ఖజానాలోని మరో ముత్యం వినండి
సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల


మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
మము బ్రోవమని చెప్పవే

మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
మము బ్రోవమని చెప్పవే

ఏకాంత రామయ్యా నీ చెంత దాచిరి
చల్లంగ నీ ముద్దు చెల్లించు వేళా

మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
మము బ్రోవమని చెప్పవే

చరణం::1

నీరూ ఈ గోదారి తీరాన నడిచారు
చన్నీళ్ళు కన్నీళ్ళు కలబోసుకొన్నారు
ఆ కథను కాస్తా గురుతు చేసుకొమ్మనీ
మా కష్తము కాస్త చూసి పొమ్మనీ
నీవైన చెప్పవమ్మ రామయ్యకూ..మా అయ్యకూ..

మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
మము బ్రోవమని చెప్పవే

చరణం::2

మారాజులు మంత్రులు మిమ్మడగ వచేవారమే
మా బోటి ధీనులు..మీ కడకు వచ్చేవారలే
ఇంతో అంతో ముడుపు కట్టి అంతటయ్యను మాయజేసి
లక్షలు మోక్షమ్ముకోరే..గడుసు బిక్షగాళ్ళము
ఒట్టి పిచ్చివాళ్ళము..
ఆదుకొమ్మనీ పైకి చేరుకొమ్మని చెప్పవమ్మ
రామయ్యకూ..మా అయ్యకూ

మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
మము బ్రోవమని చెప్పవే

చరణం::3

పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదూ..
మేక వస్తే మేక..ఎన్నడు అదరదూ
మాయ రోగమదేమో కాని..మనిషి మనిషికి కుదరదూ
ఎందుకో తెలుసా తల్లీ
ఉన్నది పోతుందన్న బెదురుతో..
అనుకొన్నది రాదేమోనన్న అదురుతో
కొట్టు కొంటూ తిట్టుకోంటూ కొండ కెక్కే వాళ్ళము
నీ అండ కోరే వాళ్ళము

కరుణించమని చెప్పవే మా కన్న తల్లి
కరుణించమని చెప్పవే..

మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
మము బ్రోవమని చెప్పవే

అందాల రాముడు--1973

















సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల



లత:::మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

ANR:::కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా
నవ్వులారబోసే పడుచున్నదీ
కలువ పువ్వు వేయి రేకులతో విచ్చుకున్నదీ
పున్నమి ఎపుడెపుడా అని వేచి ఉన్నదీ

లత:::ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

లత:::కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో ఎగసిపడే తరగలా..
నాజూకు నెలబాలుడున్నాడూ
నవమి నాడే పున్నమి అని దిగుతున్నాడూ
పున్నమి ఇప్పుడిపుడే అనిపిస్తున్నాడూ

ANR:::ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

ANR::కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా

చరణం::1


ఈ వెండి వెన్నెల్లో ఏమిటి ఈ ఎరుపూ
ఎరుపా అది కాదు ఈ అరికాళ్ళ మెరుపూ..

లత:::మ్మ్..

ఆ కాలి ఎరుపు కెంపులుగా
ఆ చిరునవ్వులె మువ్వలుగా
ఆ మేని పసిమి పసిడిగా
అందాలా వడ్డాణం అమరించాలి
అని తలచానే గాని ఆ నడుమేదీ

ఇంతకూ..

అది ఉన్నట్టా..మరి లేనట్టా..
నడుమూ ఉన్నట్టా మరి లేనట్టా..

లత:::ఊహు

ANR:::పైట చెంగు అలలు దాటీ
అలలపై ఉడికే పొంగులు దాటీ
ఏటికి ఎదురీది ఈది ఈది ఎటు తోచక నేనుంటే
మెరుపులాంటి ఎరుపేదో కళ్ళకు మిరుమిట్లు గొలిపింది

ఏమిటది?

చరణం::2

తల:::ఎవరమ్మా ఇతగాడూ ఎంతకు అంతుపట్టని వాడు
చెంతకు చేరుకున్నాడూ
హ హా..ఎవరమ్మా ఇతగాడూ
పాలవెన్నెలలోనా బాలగోదారిలా
చెంగుచెంగున వచ్చి చెయ్యి పట్టబోయాడూ

ANR:::అంతేనా

లత:::తిరగట్లే ఒరుసుకునే వరద గోదారిలా
పరుగు పరుగున వచ్చి పైట చెంగు లాగాడూ

ANR:::ఆపైన

లత:::అతడు చెయ్యపట్టబోతుంటే పైట చెంగులాగబోతుంటే
ఉరిమి చూసీ ఉరిమి చూసీ తరిమి కొట్టబోయాను

కానీ..

చల్లచల్లగా సాగే గోదారిలా శాంత గోదారిలా
నిలువెల్లా నిండుగా తోచాడూ పులకించే గుండెనే దోచాడూ

ఎవరమ్మా ఇతగాడెవరమ్మా