Tuesday, October 19, 2010

అమాయకురాలు--1971






















సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::అక్కినేని,శారద,కాంచన,నాగభూషణం,గుమ్మడి,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,చలం,అల్లురామలింగయ్య.

పల్లవి::

ఓ..హో...ఓ..ఆ..హా..ఆ ఆ 
కొంటె పిల్లా..ఆ.. 
కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది
వంట ఇంటి కుందేలై చేత చిక్కింది
బ్రహ్మచారి..ఈ..
బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది
కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది

చరణం::1

కవ్వించి నవ్వించు..గడుసైనదానా
ఈ వింత సిగ్గేల..నీ మోములోన
నను చూసి నా రాజు..కను సైగ చేసే
నును సిగ్గు పరదాలు..కనులందు వాలే
నీ తీపి కలలన్ని..నిజమైన వేళ
నీ తీపి కలలన్ని..నిజమైన వేళ
సరదాగ నాతోటి సరితూగ రావా

బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది
కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది

చరణం::2

చెలికాని అధరాన..చిరునవ్వు నేనై
నిండైన ప్రణయాలు..పండించుకోనా
చెలి నీలి కురులందు..సిరిమల్లె నేనై
పరువాల మురిపాలు..విరబూయ రానా
అందాల మన ప్రేమ..బంధాలలోన
అందాల మన ప్రేమ..బంధాలలోన
హృదయాలు పెనవేసి..విహరించుదామా

కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది
వంట ఇంటి కుందేలై చేత చిక్కింది

బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది
కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది

Amayakuralu--1971
Music::Saluri Rajeswara Rao
Lyricis::C.Narayana Reddy
Singer's::S.P.Balu,P.Suseela 

:::::

konte pillaa..aa..
konte pilla korukunna..janta dorikindi
vanta inti kundelai..cheta chikkindi
brahmachari..ii.. 
brahmachari vanta inti badha tappindi
kallalona pelli sogasu gantulesindi

:::1

kavvinchi navvinchu..gadusainadaanaa
ee vinta siggela..ne momulona
nanu chusi na raju..kanu saiga chese
nunu siggu paradalu..kanulandu vaale
ne teepi kalalanni..nijamaina vela
ne teepi kalalanni..nijamaina vela
saradaga natoti..sarituga raavaa

brahmachari vanta inti badha tappindi
kallalona pelli sogasu gantulesindi

:::2

chelikani adharaana..chirunavvu nenai
nindaina pranayaalu..pandinchukonaa
cheli neeli kurulandu..sirimalle nenai
paruvala muripalu..virabuya ranaa
andala mana prema..bandhaalalona
andala mana prema..bandhaalalona
hrudayaalu penavesi..viharinchudaamaa

konte pilla korukunna..janta dorikindi
vanta inti kundelai..cheta chikkindi

brahmachari vanta inti badha tappindi
kallalona pelli sogasu gantulesindi

అమాయకురాలు--1971

















సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::అక్కినేని,శారద,కాంచన,నాగభూషణం,గుమ్మడి,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,చలం,అల్లురామలింగయ్య.

పల్లవి::

చిన్నారి పైడి బొమ్మ..కన్నీరు ఎందుకమ్మా
నీ తల్లి బాధ మరిచి..నిదురించవే..ఏ..నిదురించవే
చిన్నారి పైడి బొమ్మ..కన్నీరు ఎందుకమ్మా
నీ తల్లి బాధ మరిచి..నిదురించవే

చరణం::1

ఏ పాపమెరుగని నీవు..నా పాపవైనావమ్మా
ఏ పాపమెరుగని నీవు..నా పాపవైనావమ్మా
రేపటి నీ బ్రతుకును తలచి..రేయి పగలు వగచేనమ్మా
చిన్నారి పైడి బొమ్మ..కన్నీరు ఎందుకమ్మా

చరణం::2

జాలి లేని శిలకే నేను..తాళి లేని సతినైనాను
జాలి లేని శిలకే నేను..తాళి లేని సతినైనాను
దిక్కు లేని తల్లిని చూచి..వెక్కి వెక్కి ఏడుస్తావా
వెక్కి వెక్కి ఏడుస్తావా..

చరణం::3

చల్లని నీ నవ్వుల కోసం..చావలేక జీవించేను
చల్లని నీ నవ్వుల కోసం..చావలేక జీవించేను
నీవు కరిగి నీరవుతుంటే..నేను చూడలేనే తల్లి

చిన్నారి పైడి బొమ్మ..కన్నీరు ఎందుకమ్మా
నీ తల్లి బాధ మరిచి..నిదురించవే..ఏ..నిదురించవే


Amayakuralu--1971
Music::Saluri Rajeswara Rao
Lyricis::C.Narayana Reddy
Singer's::S.P.Balu,P.Suseela 

:::::

chinnari paidi bomma..kanneeru yendukamma
ne talli badha marichi..nidurinchave..E..nidurinchave
chinnari paidi bomma..kanneeru yendukamma
ne talli badha marichi..nidurinchave

:::::1

ye papamerugani neevu..na papavainaavammaa
ye papamerugani neevu..na papavainaavammaa
repati ne bratukunu talachi..reyi pagalu vagachenammaa
chinnari paidi bomma..kanneeru yendukamma

:::::2

jaali leni shilake nenu..taali leni satinainaanu
jaali leni shilake nenu..taali leni satinainaanu
dikku leni tallini chuchi..vekki vekki yedustaavaa
vekki vekki yedustaavaa..

:::::3

challani ne navvula kosam..chavaleka jeevinchenu
challani ne navvula kosam..chavaleka jeevinchenu
neevu karigi neeravutunte..nenu chudalene talli

chinnari paidi bomma..kanneeru yendukamma
ne talli badha marichi..nidurinchave..E..nidurinchave

అమెరికా అమ్మాయి--1976::అఠాణ::రాగం ( starts with::vasanta )





సంగీతం::G.K.వెంకటేష్  
రచన::D.C.నారాయణ రెడ్డి 
గానం::P.సుశీల

starts with::vasanta  అఠాణ::రాగం  

పల్లవి::

ఆ..ఆ..ఆ..
ఆనంద తాండవ మాడే
ఆనంద తాండవ మాడే..శివుడు
అనంతలయుడు..చిదంబర నిలయుడు
ఆనంద తాండవ మాడే..

నగరాజసుత చిరునగవులు చిలుకంగ
నగరాజసుత చిరునగవులు చిలుకంగ
సిగలోన వగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ 

ఆనంద తాండవ మాడే..శివుడు
అనంతలయుడు..చిదంబర నిలయుడు
ఆనంద తాండవ మాడే..

చరణం::1

ప్రణవనాదం ప్రాణం కాగా..ప్రకృతిమూలం తానం కాగా
ప్రణవనాదం ప్రాణం కాగా..ప్రకృతిమూలం తానం కాగా
భువనములే రంగ భూమికలు కాగా
భుజంగ భూషణుడు..అనంగ భీషణుడు
పరమ విభుడు..గరళధరుడు
భావ రాగ తాళ మయుడు సదయుడు...

ఆనంద తాండవ మాడే..శివుడు
అనంతలయుడు..చిదంబర నిలయుడు
ఆనంద తాండవ మాడే..

చరణం::2

ఏమి శాంభవ లీల? ఏమా తాండవహేల?
ఏమి శాంభవ లీల? ఏమా తాండవహేల?
అణువణువులోన దివ్యానంద రసడోల
సుర గరుడులు..ఖేచరులు..విద్యాధరులు..ఊ..ఊ
సుర గరుడులు..ఖేచరులు..విద్యాధరులు
నిటల తట ఘటిత..నిజకరకమలులై  
నిలువగా..పురహరాయని పిలువగా..కొలువగా

ఆనంద తాండవ మాడే..

చరణం::3

ధిమి ధిమి ధిమి ధిమ డమరుధ్వానము
దిక్తటముల మార్మోయగా...

కిణకిణ కిణ కిణ మణి నూపురముల ఝణత్కారములు మ్రోయగా

విరించి తాళము వేయగా..హరి మురజము మ్రోయింపగా
ప్రమధులాడగా..అప్సరలు పాడగా..ఆడగా..పాడగా

ఆనంద తాండవ మాడే..శివుడు
అనంతలయుడు..చిదంబర నిలయుడు
ఆనంద తాండవ మాడే..

Amerikaa Ammaayi--1976
Music::G.K.Venkatesh
Lyrics::C.Narayana Reddy
Singer's::P.Suseela 

:::::
aa aa aa aa aa aa aa aa 

Ananda taanDava maaDE
Ananda taanDava maaDE..SivuDu
ananta layuDu..chidanbara nilayuDu
Ananda taanDava maaDE..

nagaraajasuta chirunagavulu..chilukanga
nagaraajasuta chirunagavulu..chilukanga
sigalOna vagaloliki..egiri egiri..dUkanga suraganga

Ananda taanDava maaDE
Ananda taanDava maaDE..SivuDu
ananta layuDu..chidanbara nilayuDu
Ananda taanDava maaDE..

:::::1

pranava naadam praaNam kaagaa
prakRtimoolam taanam kaagaa
pranava naadam praaNam kaagaa
prakRtimoolam taanam kaagaa

bhuvanamulE ranga..bhUmikalu kaagaa
bhujanga bhushanudu..ananga bhiishanudu
parama vibhudu..garaladharudu
bhaava raaga taala mayudu sayudu..

Ananda taanDava maaDE
Ananda taanDava maaDE..SivuDu
ananta layuDu..chidanbara nilayuDu
Ananda taanDava maaDE..

:::::2

Emi saambhava leela? Emaa taandavahela?
Emi saambhava leela? Emaa taandavahela?
anuvanuvulona divyaananda rasadola
sura garudulu..khecharulu..vidhyaadharulu..U..U
sura garudulu..khecharulu..vidhyaadharulu
nitala taTa ghatita..nijakara kamalulai 
niluvagaa..puraharaayani piluvaga..koluvagaa

Ananda taanDava maaDE..

:::::3

dhimi dhimi dhimi dhimi damarudhwaanamu
diktaTamula maarmOyagaa..

kina kina kina kina mani nooparamula jhaNatkaaramulu mroyagaa

virinchi taalamu veyagaa..hari murajamu mroyimpagaa
pramadhulaadagaa..apsaralu paadagaa..Adagaa..paadagaa

Ananda taanDava maaDE..

అమెరికా అమ్మాయి--1976




సంగీతం::G.K.వెంకటేష్  
రచన::మైలవరపు గోపి
గానం::G.ఆనంద్

పల్లవి::

ఒక వేణవు వినిపించెను..అనురాగ గీతికా
ఒక రాధిక అందించెను..నవరాగ మాలికా
ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా

చరణం::1

సిరివెన్నెల తెలబోయెను..జవరాలి చూపులో
సిరివెన్నెల తెలబోయెను..జవరాలి చూపులో
నవమల్లిక చినబోయెనూ.. 
నవమల్లిక చినబోయెను..చిరునవ్వు సొగసులో

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా

చరణం::2

వనరాణియే అలివేణికి..సిగపూలు తురిమెనూ
వనరాణియే అలివేణికి..సిగపూలు తురిమెనూ
రేరాణియే..నా రాణికి..
రేరాణియే..నా రాణికి..పారాణి పూసెనూ

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా

చరణం::3

ఏ నింగికి..ప్రభవించెనో..నీలాల తారకా
ఏ నింగికి..ప్రభవించెనో..నీలాల తారకా
నా గుండెలో..వెలిగించెనూ..
నా గుండెలో..వెలిగించెను..సింగార దీపికా

ఒక వేణవు..వినిపించెను..అనురాగ గీతికా
ఒక రాధిక..అందించెను..నవరాగ మాలికా
ఒక వేణవు..వినిపించెను..అనురాగ గీతికా

Amerikaa Ammaayi--1976
Music::G.K.Venkatesh
Lyrics::Mailavarapu Gopi
Singer's::G.Anand

oka vENuvu vinipinchenu..anuraaga geetika
oka raadhika sandhinchenu..navaraaga maalika
oka vENuvu vinipinchenu..anuraaga geetika

:::::1

sirivennela telabOyenu..jevaraali choopulO
sirivennela telabOyenu..jevaraali choopulO
navamallika chinabOyenu..
navamallika chinabOyenu..chiru navvu sogasulO

oka vENuvu vinipinchenu..anuraaga geetika

:::::2

vana raaNiye alivENiki..siga poolu turimenu
vana raaNiye alivENiki..siga poolu turimenu
rEraaNiye naaraaNiki.. 
rEraaNiye..naaraaNiki..paaraaNi..poosenu

oka vENuvu vinipinchenu..anuraaga geetika

:::::3

E ningiki..prabhavinchenu..neelaala taaraka
E ningiki..prabhavinchenu..neelaala taaraka
naa gunDelO..veliginchenu..
naa gunDelO..veliginchenu..singaara deepika

oka vENuvu