Friday, May 21, 2010

మహామంత్రి తిమ్మరుసు--1962



సంగీతం::పెండ్యాల
రచన::పింగళి నాగేద్ర రావు   
గానం::P.సుశీల,S.వరలక్ష్మి
తారాగణం::N.T. రామారావు,దేవిక,గుమ్మడి,రేలంగి, S. వరలక్ష్మి

పల్లవి::

తిరుమల తిరుపతి వెంకటేశ్వర
కూరిమి వరముల కురియుమయ
ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర
కూరిమి వరముల కురియుమయ
చెలిమిని విరిసే అలమేల్మంగమ
చెలువములే ప్రియ సేవలయ
తిరుమల తిరుపతి వెంకటేశ్వర
కూరిమి వరముల కురియుమయ

చరణం::1

నయగారాలను నవమల్లికలా
మమకారాలను మందారములా
నయగారాలను నవమల్లికలా
మమకారాలను మందారములా 
మంజుల వలపుల..మలయానిలముల 
మంజుల వలపుల మలయానిలముల
వింజామరమున వీతుమయా 
తిరుమల తిరుపతి వెంకటేశ్వర
కూరిమి వరముల కురియుమయ

చరణం::2

ఆశారాగమే ఆలాపనగా
ఆ..హ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆశారాగమే ఆలాపనగా
సరసరీతుల స్వరమేళనలా
నిసరినిదపదమగరిగరిస మగరిస మపమగరిస
గరిగపమగరిస 
మపనిసరి మగ మ రి గ సరినిసరి ని ద మ
మపద మ గ రి పమరి నినిప ససని నినిస
మగరిగ నిసరి నదమపనిస
నిసరి నిదమపదప..దపదమగరిగనిస
ఆశారాగమే ఆలాపనగా
సరసరీతుల స్వరమేళనలా
అభినయ నటనలే ఆరాధనగా
అభినయ నటనలే ఆరాధనగా
ప్రభునలరించి తరింతుమయా 

తిరుమల తిరుపతి వెంకటేశ్వర
కూరిమి వరముల కురియుమయ
ఆ..ఆ..అ..అ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తిరుమల తిరుపతి వెంకటేశ్వర
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
తిరుమల తిరుపతి వెంకటేశ్వర
కూరిమి వరముల కురియుమయ

మహామంత్రి తిమ్మరుసు--1962::మోహన::రాగం



సంగీతం::పెండ్యాలనాగేశ్వర రావు
రచన::పింగళి నాగేద్ర రావు 
గానం::P.సుశీల,ఘంటసాల
తారాగణం::N.T. రామారావు,దేవిక,గుమ్మడి,రేలంగి, S. వరలక్ష్మి
మోహన::రాగం  పల్లవి::

మోహన రాగమహా మూర్తిమంతమాయె
మోహన రాగమహా మూర్తిమంతమాయె
నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే
మోహన రాగమహా..మూర్తిమంతమాయె..

చరణం::1

చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా
మోహన రాగమహా..మూర్తిమంతమాయె

చరణం::2

నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా 
మోహన రాగమహా..మూర్తిమంతమాయె 

అల్లుడొచ్చాడు--1976



సంగీతం::T.చలపతిరావు
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు   
తారాగణం::రామకృష్ణ,రాజబాబు,జయసుధ,నాగభూషణం,ప్రభ,జయమాలిని,అల్లు రామలింగయ్య

పల్లవి::

లేత కొబ్బరి నీళ్లల్లే..పూత మామిడి పిందల్లే
లేత కొబ్బరి నీళ్లల్లే..పూత మామిడి పిందల్లే
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు..మనసు 

చరణం::1

పోంగువస్తుంది నీ బాల అంగాలకు..ఏహే
రంగు తెస్తుంది నీ పాల చెక్కిళ్ళకు
కోక కడతావు మొలకెత్తు అందాలకు..ఏహే
కొంగు చాటేసి గుట్టు అంతా దాచేందుకు
దాగలేనివి..ఆగలేనివి..దారులేవో వెతుకుతుంటవి
లేత కొబ్బరి నీళ్లల్లే..పూత మామిడి పిందల్లే
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు..మనసు

చరణం::2

కోటి అర్ధాలు చూసేవు నా మాటలో..ఓ
కోర్కెలేవేవో రేగేను నీ గుండెలో
నేర్చుకుంటాయి నీ కళ్ళు దొంగాటలు
ఆడుకుంటాయి నాతోటి దోబూచులు
చూచుకోమ్మని..దోచుకోమ్మని 
చూచుకోమ్మని దోచుకోమ్మని..దాచుకున్నవి పిలుస్తుంటవి
లేత కొబ్బరి నీళ్లల్లే..పూత మామిడి పిందల్లే
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు..మనసు

చరణం::3 

ఓ..వయసు తెస్తుంది ఎన్నెన్నో పేచిలను..ఏహే
మనసు తానోల్లనంటుంది రాజీలను
ఆహా..పగలు సెగపెట్టి పెడుతుంది లోలోపల
రాత్రి ఎగదోస్తు ఉంటుంది తెల్లారులు
రేపు ఉందని తీపి ఉందని..ఆశలన్ని మేలుకుంటవి
లేత కొబ్బరి నీళ్లల్లే..పూత మామిడి పిందల్లే
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు..మనసు