Wednesday, September 26, 2007

వారసత్వం--1964::నట బైరవి::రాగం



సంగీతం::ఘంటసాల
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల, P.సుశీల

!! రాగం::సింధుబైరవి !!
( నటభైరవి చాయలు వున్నది )

::::::::::

ప్రేయసీ మనోహరి వరించి చేరవే
ప్రేయసీ మనోహరి

తీయని మనొరథం నా తీయని మనొరథం
ఫలింప చేయవే ఏ..

!! ప్రేయసి మనోహరి !!

దరిజేరి పోవనేల హృదయవాంఛ తీరు వేళ
తారకా సుధాకర తపించసాగెనే ఏ..

హాయిగా మనోహర వరించి చేరుమా
హాయిగా మనోహర

మురిసింది కలువకాంత చెలుని చేయి సోకినంత
రాగమే సరాగమై ప్రమోదమాయెనే ఏ..

!! ప్రేయసి మనోహరి !!

ఉమా చండీ గౌరీ శంకరుల కథ--1968::రాగం: బౄందావన సారంగ




సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు !!
రచన::పింగళి నాగేంద్ర రావు !!గానం::ఘంటశాల.P.సుశీల !!
రాగం::బౄందావన సారంగ

ఆ : :- నీ లీలలోనే ఒక హాయిలే...
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే.. !

అ : నీ లీలలోనే ఒక హాయిలే...
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే.. !
అ : నీవున్నచోటే స్వర్గాలుగా...
భువనాలనేల నాకేలనే...

ఆ : దివినైన ఏలే పతివుండగా...ఆ...
ఏవైభవాలు నాకునూ...ఏలలే...

ఇద్దరు : నీ లీలలోనే ఒక హాయిలే...
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే.. !!!

ఆ.....ఆ...అహా...ఒహోహో...అహా......
ఒహోహో...అహా.....ఒహో....ఒహోహో....

అ : నావిందు నీవై చెలువొందగా
ఏ చందమామో నాకేలనే...

ఆ : నా వెలుగు నీవైవిలాసిల్లగా
ఏ వెన్నెలైన నాకునూ...ఏలలే....

ఇద్దరు : నీ లీలలోనే ఒక హాయిలే...
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే..

అ : నీవలపు వాహినిలో నే తేలగా...
ఏ కేళీఇనా నాకేలనే ...

ఆ : నీప్రేమ లాహిరిలో నే సోలగా ..
ఏ లాలనైన నాకునూ... ఏలలే....

ఇద్దరు : నీ లీలలోనే ఒక హాయిలే...
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే..!!!